English | Telugu

ఆ పాత్ర విషయంలో రవితేజ మొండి పట్టుదల చూపిస్తున్నాడ‌ట‌!

సినిమా ఇండస్ట్రీలో తలరాతను మార్చేందుకు ఒకే ఒక సినిమా చాలు. ఓవర్ నైట్ అనుకోని ఫలితాలు, అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎంతో స్టార్డం ఉన్నవారు అట్ట‌డుగుకి పడిపోతారు. అట్టడుగున ఉన్నవారు ఒక్కసారిగా స్టార్ డం సాధిస్తారు. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయన కెరీర్ను ధమాకా ముందు ధమాకా తర్వాతగా చెప్పుకోవాలి. ఒకే ఒక హిట్టుతో ఆయన లెక్కలన్నీ మారిపోయాయి. క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చినా మరల ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలు డిజాస్టర్లు రావడంతో రవితేజ ఇబ్బందులు పడ్డారు.

కానీ ధమాకా తో పాటు చిరుతో వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా మాస్ మహారాజా రవితేజను ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. ఈ చిత్రాలతో ఆయ‌న వరుసగా 100, 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టారు. ప్ర‌స్తుతం ర‌వితేజ కెరీర్ పీక్స్ లో ఉంద‌ని చెప్పాలి. ఇకనుంచి తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సుదీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే సమయంలో స్టువ‌ర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నారు. ఇది ఓ పీరియాడికల్ మూవీ. ఈ చిత్రం రవితేజ కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలను కాకుండా రవితేజ మరో చిత్రానికి ఓకే చెప్పారు. 2021 నవంబర్ 25న తమిళనాట‌ మానాడు చిత్రం విడుద‌లైంది. శింబు కెరీర్ ని వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాడిన పడవేసింది. య‌స్.జె. సూర్య కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ టైం ప్యారల‌ల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ త్రిల్లర్.

ఈ మూవీ రీమేక్ హ‌క్కుల‌ను సురేష్ ప్రొడక్షన్స్ వారు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఇదే మూవీ ని తెలుగులో రవితేజ, సిద్దు జొన్నలగడ్డల‌తో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో ముందుగా రవితేజ సూర్య చేసిన క్యారెక్టర్ చేయాలనుకున్నారు. అయితే అది నెగటివ్ రోల్. తాజాగా రవితేజ ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో మానాడు స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సిందేనని తేల్చి చెప్పాడట. అలా మార్పులు చేర్పులు చేశాక అవి నచ్చితేనే రీమేక్లో నటిస్తానని లేదంటే మరో స్క్రిప్టును ఎంచుకోవాలని రవితేజ ఆలోచిస్తున్నారు. రవితేజకు నచ్చినట్టుగా స్క్రిప్ట్ మార్చితే మూవీ సోల్ దెబ్బతినే అవకాశం ఉంది. ఏ చిన్న మార్పు చేసిన క‌థ మొత్తం అడ్డం తిరుగుతుంది. మరి రవితేజ చెప్పిన మార్పుల్ని మేకర్స్ అంగీకరిస్తారా లేక ఆయన స్థానంలో మరో హీరోతో ముందుకు వెళతారా అనేది వేచి చూడాలి!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .