English | Telugu

ఢీ కావాలో పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకోమన్నారు!

జబర్దస్త్ షోతో హైపర్ ఆది వెలుగులోకి వచ్చాడు. తన పంచులతో అందరినీ ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు. బుల్లితెర మీద షోస్ చేస్తూ అటు వెండి తెర మీద కూడా వెలిగిపోతున్నాడు. వరుసగా మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. ఆయన నటించిన "సార్" మూవీ ఈ నెల 17 న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో హైపర్‌ ఆది మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాన్ ఇండియా స్టార్ ధనుష్ గారి పక్కన నటించడం తన అదృష్టం అని చెప్పాడు. ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి మాట్లాడుతూ "పైకి ప్రొడ్యూసర్‌లాగా కనిపిస్తారు కానీ, ఆయనలో ఓ హీరో ఉన్నారు. ఆయన లోపల అర్జున్‌ రెడ్డి అంత యాటిట్యూడ్‌ ఉంటుంది. అల్లు అర్జున్‌ గారికి ఉన్నంత యాక్టివ్‌నెస్‌ ఉంటుంది. త్రివిక్రమ్‌ గారితో ట్రావెల్‌ చేస్తున్నారు కాబట్టి.. చిన్న టైమింగ్‌, రైమింగ్‌ కూడా ఆయనలో ఉంది. వీటన్నిటి మధ్యలో ఆయన ఏదైనా జెన్యూన్‌గా అనిపించి ఏదైనా అంటే దాని వేరేలా రాసేస్తూ ఉంటారు. ఆయన జెన్యూన్‌గా మాట్లాడ్డమే కాదు చాలా స్ట్రైట్‌ పార్వర్డ్‌ గా ఉంటారంటూ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు.

"భీమ్లానాయక్‌" సాంగ్‌ షూటింగ్ టైంలో ఆయనకు ఓ రోజు ఫోన్ చేసి "ఢీ షూటింగ్ కి అడుగుతున్నారు ఒక హాఫ్ డే లీవ్ కావాలి అని అడిగాను" దానికి ఎవరైనా అయితే, కుదరదు అని చెప్తారు కానీ, నాగవంశీగారు ‘ఢీ కావాలో.. పవన్‌ కళ్యాణ్ కావాలో తేల్చుకో’ అన్నాడు. ఆ ఒక్క మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కి వెళ్ళిపోయాను." అంటూ ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారో చెప్పాడు హైపర్ ఆది.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.