English | Telugu
అదే డేట్‌కి ఫిక్స్ అయిన సలార్!
Updated : Feb 11, 2023
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి-ది కంక్లూషన్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈయనకు ఇప్పుడు ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా బాగా గుర్తింపు ఉంది. కానీ బాహుబలి 2 భాగాల తర్వాత ఆయన నటించిన సాహూ రాధేశ్యామ్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో తదుపరి ప్రభాస్ చేయబోయే చిత్రం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాహో రాధేశ్యామ్ చిత్రాల పరాజయాలకు దీటుగా సలార్ సంచలనం సృష్టిస్తుందని వారు ఎంతో ఆశతో ఉన్నారు. అందునా ప్రశాంతినీల్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ దర్శకుడైన ప్రశాంత్ నీల్ తో ఈ చిత్రం రూపొందుతూ ఉండటంతో అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి.
ఈ క్రేజీ కాంబోలో చిత్రం కే జి ఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత ప్రశాంత్ నీళ్లు చేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం కాగా కేజిఎఫ్ సినిమా ఫ్రాంచైజీని నిర్మించిన హోం భలే ప్రొడక్షన్స్ లోనే సలార్ కూడా రూపొందుతోంది. అలా చూసుకుంటే హోం భలే సంస్థ తెలుగులో తీస్తున్న తొలి చిత్రం సలారే కానుంది. కాగా ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తయిందని సమాచారం. మిగిలిన షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ప్రొడక్షన్ పనులను మే నెల కల్లా పూర్తి చేసి, సెప్టెంబర్ 28న సలార్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సినిమాకి ఇదే డేట్ వినిపిస్తూ వస్తోంది. అదే డేట్ కు ప్రశాంత్ నిల్ - ప్రభాస్- హోం బలే ప్రొడక్షన్స్ కట్టుబడి ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఫస్ట్ లుక్ లు విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
కాగా ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇక ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తుండగా హీరోయిన్ శృతిహాసన్ ఓ జర్నలిస్టు పాత్రను పోషిస్తుంది. మొత్తానికి సలార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు అందరిలోనూ ఈ చిత్రంపై ఆసక్తి బాగా పెరిగిపోతుంది. సలార్ మూవీ బాహుబలి, కే జి ఎఫ్ ఫ్రాంచైజీ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందా? లేదా అనేది వేచిచూడాలి. ఆ రేంజ్ లో ఆకట్టుకుంటే మాత్రం ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది.