English | Telugu
సీనియర్ హీరోస్ కేర్ ఆఫ్ చందమామ!
Updated : Feb 11, 2023
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్ద కాలంగా ఈమె దక్షిణాది చిత్రాలతో తన హవా చాటుకుంటూనే ఉంది. ఆ మధ్యన పెళ్ళి చేసుకుని తల్లి కూడా అయింది. సాధారణంగా సౌత్ లో పెళ్లయ్యి తళ్లయిన హీరోయిన్లను పెద్దగా ఆదరించరు. బాలీవుడ్‌లో తల్లులకు హీరోయిన్ పాత్రలు ఇస్తారేమో గాని దక్షిణాదిలో తల్లి అయినా హీరోయిన్లకు అవకాశాలు రావని చెప్పాలి. అయితే సీనియర్ హీరోల పక్కన మాత్రం వీరికి అవకాశం ఉంటుందనేది వాస్తవం. తాజాగా కాజల్ అగర్వాల్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న అనిల్ రావిపూడి చిత్రంలో నటించనుందని సమాచారం. ఎన్‌బీకే 108 గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో బాలయ్యకు కూతురుగా శ్రీలీలా నటిస్తోంది.
దాదాపు కాజల్ ఈ సినిమాలో నటించడం కన్ఫర్మ్ అయినట్టే సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. బాలయ్య గత చిత్రాలు తీసుకుంటే హీరోయిన్లకి ప్రాధాన్యం ఉండదు. అఖండ అంత భారీవిజయాన్ని సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ కి వచ్చిన క్రేజ్ అంటూ ఏమీ లేదు.ఆమెకు ఈ చిత్రం కెరీర్ పరంగా ఏమి ప్లస్ కాలేదు. వీర సింహారెడ్డి లో శృతిహాసన్ కు వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. దాంతో బాలయ్యతో సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఈమె పలు ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. కాజల్ అందం పెళ్లి తర్వాత ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు ఇంకాస్త కొత్తగా అందంగా కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. బాలయ్య సినిమాలో మినిమమ్ రోల్ లభించిన కూడా ఆమె ఆ తర్వాత సీనియర్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి వారికి సరిగ్గా సెట్ అవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా కాజల్‌కు ఏమైనా ఉపయోగం ఉందంటే అది సీనియర్ స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు రావడం మాత్రమేనని చెప్పవచ్చు.