English | Telugu
చిరంజీవికి 100 కోట్లు సాధ్యమేనా?
Updated : Feb 11, 2023
ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ లో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, కోలీవుడ్ స్టార్ విజయ్ వంటి వారు 100కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. వారి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కూడా వసూళ్లను రాబడుతున్నాయి. మెగాస్టార్ తో సరైన కమర్షియల్ యాంగిల్ లో సినిమా చేస్తే మినిమం 150 నుండి 200 కోట్ల వరకు వసూలు నమోదు అవుతాయి. ఈ విషయాన్ని వాల్తేరు వీరయ్య చిత్రం నిరూపించింది.
చిరంజీవికి ఉన్న స్టార్డం, ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో యావరేజ్ టాకు వచ్చినా కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు ఈజీగా నమోదు అవుతాయి. ప్రమోషన్ విషయంలో కొత్తగా ఆలోచిస్తూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తే చిరు సినిమాలు రికార్డులు బద్దలు అవుతాయి. చిరంజీవి 100 కోట్ల పారితోషకానికి సరైన వ్యక్తి. ఆరు పదుల వయసు దాటిన తర్వాత 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోయే చిరంజీవిని త్వరలో చూడాలని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం కొందరు హీరోలు మొదట కొంత అడ్వాన్స్ తీసుకొని తరువాత లాభాలలో వాటా తీసుకుంటున్నారు.
అలా చిరు కూడా తీసుకుంటే 100 కోట్ల రెమ్యూనరేషన్ చిరు ఈజీగా అందుకుంటాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. లాభాల్లో వాటా కాకుండా మరో రెండు మూడు సినిమాలు 150 నుండి 200 కోట్ల వరకు వసూలు చేస్తే చిరుకి 100 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. వాల్తేరు వీరయ్య లాగా మరో రెండు మూడు చిత్రాలు గనక బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే చిరు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోల జాబితాలో స్థానం సంపాదించుకుంటాడని కచ్చితంగా చెప్పవచ్చు.