English | Telugu
బాబీపై మెగా కాంపౌండ్‌కు నమ్మకం పెరిగింది!
Updated : Feb 11, 2023
డైరెక్టర్ బాబి అలియాస్ కొల్లి రవీంద్ర. ఈయన రవితేజ హీరోగా పవర్ చిత్రంతో దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు. రెండో చిత్రం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అయినా సరే ఆయన తదుపరిచిత్రం ఎన్టీఆర్ తో కావడం విశేషం. జై లవకుశ గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇక వెంకటేశ్ -నాగచైతన్య లతో వెంకీ మామ తీసి వావ్ అనిపించారు. తాజాగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవిని ఫిదా చేశారు. వాల్తేరు వీరయ్య చిత్రం సమయంలో బాబిలోని స్పార్క్ ను అతని డెడికేషన్ ను చూసిన మెగాస్టార్ ఆయన డైరెక్షన్ ప్రతిభకు మంత్రముగ్ధుడయ్యారట. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే బాబి చిరుకి ఓ స్టోరీ చెప్పాడట. అయితే దానిని చిరు తాను కాకుండా మరో మెగా కాంపౌండ్ హీరో చేత చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం.
చిరు కాకుండా మెగా హీరోల్లో ఎవరితోనైతే చేయాలని నిర్ణయించుకున్నారో ఇంకా తెలియడం లేదు. పూర్తి సాయి స్క్రిప్ట్ వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఆయన వాల్తేరు వీరయ్య సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో ఈ కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతానిక చాలా బిజీగా ఉన్నారు. దాంతో ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్, సాయి ధరంతేజ్ లలో ఎవరో ఒకరు హీరోగా ఎంపిక కావచ్చని సమాచారం. ఇంతకీ బాబీ ఎంపిక చేసుకోబోతున్న మెగా హీరో ఎవరు అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బాబి తదుపరి సినిమా కూడా మెగా కాంపౌండ్ హీరోతోనే అని విశ్వసనీయ సమాచారం.
కాగా ప్రస్తుతం సాయిదరమ్ తేజ్ చేతిలో విరూపాక్ష సినిమా తప్ప మరో చిత్రం లేదు. పవన్ తో కలిసి చేయాల్సిన వినోదాయసిత్తం రీమేక్ లో ఆయన నటించడం ఖరారైంది. అయితే ఈ చిత్రం ఎప్పుడుమొదలవుతుందో ఎవరికి అర్ధం కావడంలేదు. దాంతో సాయిధరమ్ తేజ్ తోనే బాబీ చిత్రం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మెగా కాంపౌండ్ మెచ్చిన దర్శకునిగా బాబి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వి.వి.వినాయక్ లాగా చిరు మెచ్చిన దర్శకుల్లో బాబీ కూడా ఒకరయ్యారు.