English | Telugu
పాట, ఫైట్ చేస్తున్న రజనీకాంత్
Updated : Feb 10, 2023
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అన్నాత్తే సినిమాతో జనాల ముందుకు వచ్చారు రజనీకాంత్. ఇప్పుడు జైలర్ సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విజయ్‌తో బీస్ట్ సినిమాను రూపొందించిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు డైరక్టర్. దాదాపు 75 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో షూటింగ్ జరుగుతోంది. జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్స్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పాటలను కూడా అక్కడి అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఆ ఫొటోలలో చాలా వాహనాలు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని బట్టి చూస్తే ఛేజింగ్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారనే విషయం అర్థమవుతుంది.
జైలర్ సినిమాలో తాను చిన్న కేరక్టర్ చేస్తున్నానని అన్నారు శివరాజ్‌కుమార్. రజనీకాంత్ సినిమాలో నటిస్తారా అని అడుగుతూ పిలుపువస్తే, కాదనే ధైర్యం ఎవరికీ ఉండదని, ఎంతపెద్ద నటుడైనా సూపర్‌స్టార్ సినిమాలో చిన్న కేరక్టర్ చేయడానికి రెడీగా ఉంటారని అన్నారు శివరాజ్ కుమార్. ఈసినిమాను దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నాత్తే తర్వాత రజనీకాంత్ సినిమాలకు దూరమవుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది అప్పట్లో. అయితే వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ ప్రాజెక్టును ఓకే చేశారు రజనీకాంత్. జైలర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు రజనీకాంత్. ఖాకీ చొక్కాలో తలైవర్ పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నారంటున్నారు ఫ్యాన్స్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది ఈ సినిమా.
మరోవైపు పెద్ద కూతురు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు రజనీకాంత్.