English | Telugu
హీరోల క్రేజ్‌కు ఆహా సర్వర్లు క్రాష్!
Updated : Feb 12, 2023
తాజాగా ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సందర్బంగా ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ప్రభాస్ ఎపిసోడ్ కు ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. మరి పవన్ ఎపిసోడ్‌కు సర్వర్లు క్రాష్ అవుతాయా లేదా అని అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కు యాప్ క్రాష్ కావడం కొలమానంగా మారింది. ఆహా మరోసారి సర్వర్ క్రాష్ అయితే ప్రభాస్ కన్నా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని లేదంటే కాదని కొందరు ట్వీట్లు పోస్ట్ చేశారు. కానీ ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ కూడా సర్వర్లు క్రాష్ అయ్యాయి. మరోవైపు ఇంకొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ రచ్చలోకి మహేష్ బాబును కూడా లాగారు. మొదటి సీజన్లో మహేష్ ఎపిసోడ్ సందర్బంగా సర్వర్లు క్రాష్ కాలేదని కామెంట్లు పెట్టారు. తొలి సీజన్‌లో ఆయన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయినప్పుడు సర్వర్లు అసలు క్రాషే కాలేదు అంతా సాఫీగా సాగింది. దీంతో మహేష్ అభిమానుల సంఖ్య తక్కువ అని కామెంట్ పెట్టారు.
మొత్తానికి మహేష్ కన్నా ప్రభాస్, పవన్ అభిమానులు ఎక్కువ అంటూ ప్రచారం చేశారు. ఆహా టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మళ్లీ అదే జరిగింది. సర్వర్లు క్రాష్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆహా లోకి అందుబాటులోకి రావడమే ఆలస్యం ఒక్కసారిగా ఫ్యాన్స్ పైరసీ రాయిడ్లు ఆహా లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆహాకు సంబంధించిన పది సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఆహా ఈ సమస్యను మొదటగా ప్రభాస్ ఎపిసోడ్ స్క్రీనింగ్ సమయంలో ఎదుర్కొంది. ఎపిసోడ్ స్క్రీనింగ్ మొదలైనప్పుడు ప్రభాస్ అభిమానుల తాకిడికి ఆహా యాప్ కొన్ని గంటలపాటు క్రాష్ అయింది. సర్వర్లు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపిసోడ్ కోసం తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఎగబడి ఎదురు చూస్తారన్న సంగతి తెలిసిందే.
దీంతో ఆహా టీం సర్వర్ క్రాష్ భయం మరోసారి వెంటాడింది. దీంతో ముందు జాగ్రత్తగా మళ్ళీ క్రాష్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. బ్యాక్అప్ సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేసింది. అయితే ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత పవన్ ఫ్యాన్ ముందు ఇవేమీ పనిచేయలేదు. అభిమానులు తాకిడికి సర్వర్లు క్రాష్ అయ్యాయి. కానీ అంతకుముందుతో పోలిస్తే జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈసారి అది అంతగా ప్రభావం చూపలేదు.