English | Telugu
కాంతార2లో ఊర్వశి రౌతెలా!
Updated : Feb 12, 2023
బాసూ వేర్ ఈజ్ ద పార్టీ పాట గుర్తుందా? అందులో బాస్‌ని వేర్ ఈజ్ ద పార్టీ అని అడిగిన లేడీ గుర్తుందా? యస్... ఆమె పేరు ఊర్వశి రౌతెలా. నార్త్ జనాలకు పరిచయం కూడా అక్కర్లేని పేరు ఊర్వశి. సౌత్ ఆడియన్స్ తో అల్లుకుపోతున్నారు ఊర్వశి రౌతెలా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న కాంతార ప్రీక్వెల్ కోసం సంతకం చేశారట ఊర్వశి రౌతెలా. భూతకోల కాన్సెప్ట్ తో తెరకెక్కిన కాంతార సినిమా గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైంది. 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ హిట్ అనిపించుకుంది. రిషబ్ శెట్టి క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. రిషబ్ కోసం హిందీ, మలయాళం నుంచి ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే వేటికీ సంతకం చేయలేదు రిషబ్. తన కాన్‌సెన్‌ట్రేషన్ పూర్తిగా కాంతార ప్రీక్వెల్ మీదే ఉందని అన్నారు. కాంతార ప్రీక్వెల్‌కి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నారు.
ఇప్పుడు స్టార్ కాస్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రిషబ్. రీసెంట్‌గా ఊర్వశి రౌతెలాను కలిసి ఆమెకు స్క్రిప్ట్ ఎక్స్ ప్లయిన్ చేశారు. ఆల్రెడీ కాంతార సినిమా మీద ఐడియా ఉన్న ఊర్వశి, ఇప్పుడు రిషబ్ చెప్పిన కథకు ఫ్లాట్ అయ్యారట. కాంతార2 లోడింగ్ అంటూ క్యాప్షన్ పెట్టి రిషబ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు ఊర్వశి. రిషబ్‌శెట్టితో పాటు నిర్మాణ సంస్థ హోంబలేని కూడా ట్యాగ్ చేశారు ఊర్వశి రౌతెలా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆమె కేవలం స్పెషల్ సాంగ్‌లోనే కనిపిస్తారా? లేకుంటే ఆమెకోసం రోల్ ఏమైనా డిజైన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కాంతార2ని వాంటెడ్‌గానే లావిష్‌గా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు నెటిజన్లు.