English | Telugu
అఖిల్ కోరిక నెరవేరుతుందా!
Updated : Feb 11, 2023
అక్కినేని ఫ్యామిలీ అంటే రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవాలి. యంగ్ తరంలో కూడా నాగచైతన్య అదే దారిలో నడుస్తున్నారు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం మాస్ అండ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకోసమే తన మొదటి చిత్రం అఖిల్ ని వి వి వినాయక్ తో చేశారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన కల నెరవేరలేదు. ఆ తర్వాత చేసిన మూడు చిత్రాలు రొమాంటిక్ చిత్రాలే. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం పర్వాలేదు అనిపించింది. మిగిలినవి సరిగా ఆడలేదు.
ఇక తాజాగా అఖిల్ ఏజెంట్ అనే చిత్రం చేస్తున్నారు. దీనికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి కి మాస్ యాక్షన్ సినిమాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య.దాంతో ఆయన అఖిల్‌ను మాస్ యాక్షన్ హీరోగా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలైన పోస్టర్లు టీజర్లు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇందులో ఫుల్ అండ్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ హీరోగా అక్కినేని అఖిల్ కనిపిస్తున్నారు. ఇండియా లెవెల్ లో దేశవ్యాప్తంగా విడుదల ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీతో అఖిల్, సురేందర్ రెడ్డిలు పాన్ ఇండియా మూవీపై కన్నేశారు. దీనికి ముందు సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో చేసిన సైరా నరసింహారెడ్డి కూడా పాన్ ఇండియా చిత్రమే.
దాంతో ఏజెంట్ చిత్రం ద్వారా అఖిల్ మాస్ యాక్షన్ హీరోగా స్థిరపడిపోతాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా ఈ చిత్రం ద్వారా అఖిల్ కు మాస్ ఇమేజ్ వస్తుందని తద్వారా ఆయన యాక్షన్ హీరోగా ప్రమోట్ అవుతాడని భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం ఉంటుందో లేదో చూడాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.