English | Telugu
యంగ్ డైరెక్టర్స్‌తో బాలయ్య రెండు మూడేళ్లు ఫుల్ బిజీ!
Updated : Feb 26, 2023
నందమూరి బాలకృష్ణ. ఈయనను అందరు నటసింహం అని పిలుస్తారు. అత్యధిక చిత్రాలు పేరు ఉన్న అగ్ర దర్శకులతో చేశారు. బాగా పేరున్న డైరెక్టర్ తో మాత్రమే ఈయన సినిమాలు చేశారు. అలాంటి సీనియర్ డైరెక్టర్లను ఏరికోరి వారి సినిమాల్లో నటించారు. కానీ అదంతా గతం. ప్రస్తుతం కొత్త ట్రెండ్ నడుస్తోంది. పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టుగా సాగుతోంది. ఇండస్ట్రీలోకి యంగ్ డైరెక్టర్ వెల్లువలా పోటెత్తుతున్నారు. వారిలో బాగా టాలెంట్ ఉన్నవారు సంచలనాలు సృష్టిస్తున్నారు. అలా ఒకటి రెండు సినిమాలతో తమ ప్రతిభను నిరూపించుకున్న దర్శకులకు బాలకృష్ణ ఏరి కోరి అవకాశం ఇస్తున్నారు. గోపీచంద్ మలినేని తో వీరసింహారెడ్డి సినిమా తీసి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి చిత్రాలతో ఎంటర్టైన్మెంట్ ను బాగా పండించగలడని పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్.బి.కె 108 చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమాలో బాలయ్యను అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాలో చూడాలి.... మాస్ యాక్షన్ చేస్తాడా లేదా తనకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఫిలిం చేస్తాడా లేదా రెండింటిని మిక్స్ చేస్తాడా అనేది చూడాలి. ఇక దీని తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయనున్నారు. బోయపాటితో ఇప్పటికే ఆయన సింహా లెజెండ్ అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు డబ్ ల్ హ్యాట్రిక్కి శ్రీకారం చుడుతూ నాలుగో సినిమాకు ఓకే చెప్పారు.. 2024 ఎలక్షన్ మూమెంట్లో ఈ సినిమాను వదిలి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోను నిర్వహిస్తున్న ప్రశాంత వర్మతోను బాలయ్య ఓ సినిమా ఓకే చెప్పారు. తెలుగులో అ,కల్కి,జాంబిరెడ్డి లాంటి డిఫెరెంట్ మూవీస్ తో మెప్పించిన ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో హనుమాన్ చిత్రం తర్వాత బాలకృష్ణతో సినిమా చేయనున్నారు.
అలాగే కళ్యాణ్ రామ్ తో బింబిసారా చిత్రాన్ని తీసిన వశిష్ఠతోనూ సినిమా చేస్తున్నారు. ఇది గీత ఆర్ట్స్ బ్యానర్ లో రానుంది. సర్కారు వారి పాట తీసి జనాల్లో ఇంప్రెస్ కొట్టేసిన పరుశురాం బాలయ్యతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఊర్వశివో రాక్షశివో ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అన్ స్టాపబుల్ షో చేస్తోన్నబి.వి.ఎస్.రవి దర్శకత్వంలో కూడా బాలయ్య ఓ సినిమా చేయనున్నారట. వీరితో పాటు పూరి జగన్నాథ్ కొరటాల శివ వెంకీ అట్లూరి త్రివిక్రమ్ సంపత్ నంది లాంటి వారికి బాలయ్య చాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ డైరెక్టర్ తో మాత్రమే సినిమాలు చేసిన బాలయ్య ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ సంపాదించుకున్న జూనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. అభిమానులను ఆకట్టుకొంటున్నయంగ్ డైరెక్టర్స్తోపని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి మరో రెండు మూడేళ్ల వరకు బాలయ్య చిత్రాలకు ఢోకా లేదని చెప్పాలి.