English | Telugu
'RC 15' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!
Updated : Feb 26, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'RC 15'(వర్కింగ్ టైటిల్). రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని త్వరలోనే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లీకైన కొన్ని ఫోటోలు ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రానికి 'అధికారి', 'సిటిజన్' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ టైటిల్స్ లో ఒకదానిని ఎంపిక చేస్తారో లేక మరో కొత్త టైటిల్ ని ఖరారు చేస్తారో త్వరలోనే తెలియనుంది.
'RC 15'లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.