English | Telugu
'ఎన్టీఆర్ 30' షూటింగ్ మరింత ఆలస్యం!
Updated : Feb 26, 2023
'ఎన్టీఆర్ 30' షూటింగ్ ఎప్పుడెప్పుడా మొదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఏవో కారణాల ఆలస్యమవుతూ వస్తుంది. నిజానికి ఫిబ్రవరి 24న మూవీని లాంచ్ చేసి, మార్చి మూడో వారంలో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావించారు. కానీ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారకరత్న మృతితో మూవీ లాంచ్ వాయిదా పడింది. దీంతో మార్చిలోనే మూవీని లాంచ్ చేసి, షూటింగ్ కూడా ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర అధికారిక ప్రకటన గతేడాది మేలోనే వచ్చినప్పటికీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మార్చిలోనైనా ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని వారు ఆశపడుతుండగా.. ఇప్పుడది ఏప్రిల్ కి వాయిదా పడిందని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో మార్చిలో ఘనంగా ప్రారంభించి, షూటింగ్ ని మాత్రం ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.
కాగా 'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.