English | Telugu
కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
Updated : Feb 26, 2023
కళాతపస్వి కె.విశ్వనాథ్(92) ఈ ఫిబ్రవరి 2న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అయితే ఆయన కన్నుమూసిన మూడు వారాలకే ఆయన సతీమణి జయలక్ష్మి(88) కన్నుమూశారు. గుండెపోటుతో నిద్రలోనే ఆమె ఆమె తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. జయలక్ష్మి ఈ రోజు సాయంత్రం 6.15కు మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఒకే నెలలో ఇద్దరి మరణంతో విశ్వనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు. పెద్దకుమారుడు వచ్చాక జయలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.