English | Telugu
'గోపీచంద్ 31' లాంచ్.. ప్రశాంత్ నీల్ బాటలో మరో కన్నడ డైరెక్టర్!
Updated : Mar 3, 2023
తనకు 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం 'రామబాణం' అనే సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత గోపీచంద్ చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ వచ్చింది. గోపీచంద్ కెరీర్ లో 31వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వం వహించనున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.
కొంతకాలంగా కన్నడ దర్శకులు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. 'కేజీఎఫ్'తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ చేయనున్నాడు. మరో కన్నడ దర్శకుడు నర్తన్ కూడా తెలుగులో సినిమా చేయడానికి ప్రయత్నిసున్నాడు. ఇక ఇప్పుడు హర్ష వంతు వచ్చింది. ఆయన కన్నడలో 'భజరంగి', 'అంజనీ పుత్ర', 'వేద' వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు గోపీచంద్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న హర్ష ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.