English | Telugu
షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్‌కి సలహాలిచ్చింది ఎవరో తెలుసా?
Updated : Mar 5, 2023
వైవాహిక బంధాలు చాలా చిత్రంగా జరుగుతుంటాయి. మనసుకు నచ్చినవారిని కాదని, మరొకరిని పెళ్లాడాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. మనసుకు నచ్చినవారితోనే పెళ్లయినా, ఆ కాపురం సగంలోనే ఆగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా హాయిగా 21 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు తల అజిత్, ఆయన భార్య షాలిని. ఒకప్పుడు వీరిద్దరూ కోలీవుడ్‌లో మంచి పేరున్న యాక్టర్స్. 1991లో అమర్కళం అనే సినిమా చేసేటప్పుడు వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ల పెళ్లయి 21 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే షాలినితో అజిత్ ప్రేమలో ఉన్నారని తెలియక, ఆమెను పెళ్లి చేసుకోవద్దని అజిత్‌కి సలహా ఇచ్చారట దర్శకుడు, నటుడు అయిన రమేష్ ఖన్నా. ఈ విషయాన్ని గురించి రమేష్ ఖన్నా మాట్లాడుతూ ``వారిద్దరూ అప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నాకు తెలియదు. నేను నా పని చేసుకుంటూ వెళ్లేవాడిని. జనాలు ఈ విషయం గురించి అడపాదడపా మాట్లాడుకునేవారు. కానీ, అవన్నీ పట్టించుకోవద్దని, మన పని మనం చేసుకుంటూ పోతే మంచిదని అజిత్‌తో అన్నాను`` అని అన్నారు.
అజిత్ ఎవరి మాటా పట్టించుకోలేదు. తన మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్లారు. ``ఎప్పుడూ ఏదో ఒకటి అనేవారు అంటూనే ఉంటారు. వారిని పట్టించుకోను. నేను నచ్చినన్ని రోజులు, నా సినిమాలు నచ్చినన్ని రోజులు చూస్తారు. చూడని రోజూ ఎవరినీ బలవంతం చేయలేం. అలాగని వ్యక్తిగత జీవితాన్ని ఎవరి కోసమూ త్యాగం చేయలేం`` అని అప్పట్లో సన్నిహితులతో అన్నారట అజిత్.
ఈ ఏడాది తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. ఆ వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లారు. ఆ ఫొటోలను షాలిని ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చేశారు. ముందు అనుకున్న ప్రకారం జరిగి ఉంటే, అజిత్ ఇప్పుడు విఘ్నేష్ శివన్ సెట్లో ఉండాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు ఫైనల్ కాలేదు. త్వరలోనే మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చెన్నైలో జరిగాయి. అఫిషియల్‌గా మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ చిత్రంలో అజిత్‌తో ఎవరెవరు నటిస్తారనే విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది.