English | Telugu
దమ్ముంటే పోటీ అక్కడ పడాలంటున్న రకుల్
Updated : Mar 4, 2023
రకుల్ ప్రీత్‌సింగ్‌ది ఎప్పుడూ ముక్కుసూటి వ్యవహారమే. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడటం ఆమెకు అసలు చేతకాదు. నచ్చినా అంతే ఓపెన్‌గా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమ వ్యవహారాన్ని కూడా ఆమె ఎంతో కాలం దాచలేదు. అయినా అందులో దాచుకోవడానికి ఏముంది? మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. రీసెంట్‌గా ఓ ఇష్యూ గురించి కూడా ఇదేవిధంగా ఓపెన్ అయ్యారు. ``సౌత్ సినిమాల్లో ప్లస్సులేంటి? నార్త్ సినిమాల్లో ప్లస్సులేంటి? అక్కడ సినిమాలు బావుంటాయా? ఇక్కడ సినిమాలు బావుంటాయా? మిమ్మల్ని కెరీర్ స్టార్టింగ్‌లో తీర్చిదిద్దింది సౌత్ సినిమా కదా.
మరి నార్త్ సినిమాల్లో సెటిల్ అయ్యారేంటి? అంటూ నానా రకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి నాకు. అరే యార్... ఎక్కడుండే ప్లస్‌లు అక్కడుంటాయి. ఎక్కడుండే మైనస్‌లు అక్కడుంటాయి. అయినా ఇప్పుడు మనతో మనం పోల్చుకుని, మనతో మనం పోటీపడితే ఏం వస్తుంది? మన దేశంలో అత్యుత్తమమైన టెక్నీషియన్లున్నారు. అద్భుతంగా నటించే నటీనటులున్నారు. వారందరూ ఏకం కావాలి. మంచి కథతో సినిమాలు చేయాలి. అప్పుడే మనం ఇంటర్నేషనల్ లెవల్లో మిగిలిన వాళ్లతో పోటీపడగలం. అంతర్జాతీయ స్థాయిలో గట్టిగా పోటీ ఇవ్వగలిగిన సత్తా ఉన్న వాళ్లం మనం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినర్జీని నమ్మాలి.
ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి`` అని అన్నారు రకుల్. రీసెంట్‌గా తన ప్రియుడితో కలిసి హైదరాబాద్‌కి వచ్చారు రకుల్. లక్ష్మీ మంచు కోసం ఓ చారిటీ షోలో వాక్ చేశారు. ప్రస్తుతం ఇండియన్2లో కమల్‌హాసన్‌తో నటిస్తున్నారు. అయిలన్ అనే మరో సినిమాలోనూ చేస్తున్నారు. నార్త్ లోనూ చేతినిండా సినిమాలున్నాయి రకుల్ ప్రీత్‌సింగ్‌కి. అక్కడ గ్లామర్‌కి అవకాశం ఉన్న పాత్రలను, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలనూ కలిపి చేస్తున్నారు రకుల్ ప్రీత్‌సింగ్.