English | Telugu
'నాని 30'కి ఊహించని టైటిల్!
Updated : Apr 20, 2023
ఇటీవల 'దసరా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 30వ సినిమాని నూతన దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్నాడు. 'దసరా'లో ఊర మాస్ అవతార్ తో మెప్పించిన నాని.. అందుకు పూర్తి భిన్నంగా క్లాస్ సినిమాతో రాబోతున్నాడు. అందుకు తగ్గట్లే ఈ సినిమాకి 'హాయ్ నాన్న' అనే ఆసక్తికరమైన క్లాసీ టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
'నాని 30' అనౌన్స్ మెంట్ వీడియో చూసినప్పుడే ఇది తండ్రీకూతుళ్ల కథ అని అర్థమైంది. ఆ కథకు సరిపోయేలా 'హాయ్ నాన్న' అనే టైటిల్ ను ఎంపిక చేశారట. నాని ఎక్కువగా క్లాస్ టైటిల్స్ కే మొగ్గుచూపుతుంటాడు. 'హాయ్ నాన్న' టైటిల్ క్లాస్ గా ఉండటంతో పాటు, సినిమాకి సరిగ్గా సరిపోయే టైటిల్ కావడంతో.. నాని ఈ టైటిల్ కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. డిసెంబర్ 21 ఈ చిత్రం విడుదల కానుంది.