English | Telugu

అలా మొదలైంది షోలో ఆది-అరుణ దంపతులు!

ఈ టీవీలో ప్రసారమవుతున్న టాక్ షో 'అలా మొదలైంది'. వెన్నెల కిషోర్ ఈ షోకి యాంకర్ గా చేస్తున్నాడు. అయితే ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ షోలో వెన్నెల కిషోర్.. ప్రతీవారం ఎవరో ఒక జంటని ఆహ్వానించి వారి జర్నీ ఎలా మొదలైందని తెలుసుకుంటాడు.

అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ షోకి గెస్ట్ లుగా సాయికుమార్ కొడుకు 'ఆది', ఆది భార్య అరుణ గెస్ట్ లుగా వచ్చారు. మీది అరెంజ్ మ్యారేజా? లేక లవ్ మ్యారేజా? అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా.. మాది అరెంజ్డ్ మ్యారేజే అని ఆది అన్నాడు. మీరు ఇంట్లో హస్బెండ్ ని పేరు‌ పెట్టి పిలుస్తారా లేకా ఏవండి? ఓయ్ అని పిలుస్తారా అని వెన్నెల కిషోర్ అడుగగా.. "అయ్యో అసలు అలా పిలవనండి.. పేరు పెట్టి పిలుస్తాను" అని అరుణ అంది. సినిమా వాళ్ళు కదా పెళ్ళి దాకా ఎలా తీసుకొచ్చారని చాలా మంది అడిగిరాని అరుణ చెప్పగా.. 'మేం కూడా మనుషులమేనండి' అని వెన్నెల కిషోర్ అంటాడు. ఇక్కడికి వచ్చాకే తెలిసిందని అరుణ చెప్పింది. పెళ్ళి ఒకే అనుకున్న తర్వాత నేను నంబర్ తీసుకున్నాను అని ఆది చెప్తాడు. దానికి అరుణ.. డాడిని అడిగి నెంబర్ ఇచ్చానని అంటుంది. అలా అనగానే ఈ విషయం ఇప్పుడు నాకు చెప్తున్నావ్ అని ఆది అంటాడు. ఆ తర్వాత ఎంత సేపు మాట్లాడుకున్నారని వెన్నెల కిషోర్ అడుగగా.. మూడు నాలుగు గంటలు మాట్లాడుకునేవాళ్ళమని ఆది చెప్తాడు. ఆ సమాధానానికి వెన్నెల కిషోర్.. ఓ రియల్లీ అని చెప్పి ఆశ్చర్యపోతాడు.

మీ ఇద్దరు ఫస్ట్ ఎక్కడ గొడవ పడ్డారని కిషోర్ అడుగగా.. 'ఐ థింక్ హనీమూన్ అనుకుంటా' అని ఆది అంటాడు. దాంతో కిషోర్ షాక్ అవుతాడు. ఇద్దరికి గొడవ జరిగినప్పుడు మొదట ఎవరు సారీ చెప్తారని కిషోర్ అడుగుతాడు.. నేనే చెప్తానని అరుణ అనగా లేదు మొదట నేనే సారీ చెప్తానని ఆది అంటాడు. పెళ్ళి అయిననుండి ఇప్పటివరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. బ్యూటిఫుల్ జర్నీ అని ఆది అనగా.. నిజంగా బంగారమని ఆది గురించి అరుణ చెప్పింది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్తూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోగా.. పూర్తి ఎపిసోడ్ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.