English | Telugu

1000 మంది ఫైటర్స్ తో 'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ సినిమా అంటేనే భారీతనం. పాటలు, యాక్షన్ సన్నివేశాలను భారీస్థాయిలో తెరకెక్కిస్తారు. 'గేమ్ ఛేంజర్'లోనూ ఆ భారీతనం ఉండబోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ను అంత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట.

'మగధీర'లో వంద మందితో రామ్ చరణ్ చేసిన ఫైట్ ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. అలాగే 'ఆర్ఆర్ఆర్'లో దాదాపు రెండు వేల మందితో తెరకెక్కించిన రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక 'గేమ్ ఛేంజర్'లోనూ అలాంటి భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. 1000 మందికి పైగా ఫైటర్స్ తో హీరో చరణ్, విలన్ ఎస్.జె. సూర్య మధ్య క్లైమాక్స్ చిత్రీకరించనున్నారట. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 23 నుంచి మొదలుకానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో క్లైమాక్స్ ని చిత్రీకరించనున్నారని సమాచారం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.