English | Telugu
ఓటీటీలోకి 'పరేషాన్' మూవీ!
Updated : Jul 20, 2023
తిరువీర్, పావని కరణం జంటగా 'కొబ్బరి మట్ట' ఫేమ్ రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పరేషాన్'. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. యువతను బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'పరేషాన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సోనీ ప్రకటించింది. ఇటీవల చిన్న పెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తుండగా.. పరేషాన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
బన్నీ అభిరామ్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, అంజి వల్గుమాన్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా వాసు పెండెం, ఎడిటర్ గా హరిశంకర్ వ్యవహరించారు.