English | Telugu

'ప్రాజెక్ట్ k' వాయిదాపై క్లారిటీ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ k' సినిమాని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమేనని, వేసవికి వాయిదా పడే అవకాశాలున్నాయని ఈమధ్య వార్తలు వినిపించాయి. తాజాగా మేకర్స్ సైతం వాయిదా పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దీపికా పదుకొణె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'కల్కి 2898 AD' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇక గ్లింప్స్ కూడా హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంది. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఈ సినిమాని 2024 లో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు కానీ తేదీని మాత్రం చెప్పలేదు. దీంతో ఈ సినిమా జనవరి 12 వ తేదికి రావడంలేదని, అందుకే కేవలం 2024 లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారని అర్థమవుతోంది. మరి ఈ సినిమా నిజంగా వేసవిలోనే వస్తుందో లేదో తెలియాలంటే కొత్త విడుదల తేదీని ప్రకటించేవరకు వేచి చూడాలి.

ఇక ఈ సినిమా ఎన్ని భాగాలుగా రానుందనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం 'సలార్' రెండు భాగాలుగా రానుందని టీజర్ విడుదల సందర్భంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 'ప్రాజెక్ట్ k' కూడా రెండు భాగాలుగా రానుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. గ్లింప్స్ విడుదల సందర్భంగా క్లారిటీ వచ్చే అవకాశముందని భావించారంతా. కానీ మేకర్స్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 'ప్రాజెక్ట్ k' అనేది యూనివర్స్ లా రూపొందనుందని, అందులో భాగంగా రెండు కంటే ఎక్కువే సినిమాలు రానున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.