English | Telugu
ధనుష్ డబుల్ ధమాకా
Updated : Jul 22, 2023
వెర్సటైల్ యాక్టర్ ధనుష్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమాతో పాటు తన 50 సినిమాను కూడా చేయటానికి రెడీ అయ్యారు. కెప్టెన్ మిల్లర్ సినిమాను చూస్తే పీరియాడిక్ మూవీలా అనిపిస్తుంది. ఇక తన 50వ మూవీని ధనుష్ ఇంకా షురూ చేయలేదు. అయితే ఆ సినిమాలో నటిస్తోన్న ఎస్.జె.సూర్య, సందీప్ కిషన్‌లకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. త్వరలోనే ధనుష్ కూడా సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇప్పటి వరకు సాలిడ్ అప్‌డేట్స్ రాలేదు. మరో వైపు ఫ్యాన్స్, ప్రేక్షకులు ధనుష్ సినిమాలకు సంబంధించిన వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు... ధనుష్ ఏకంగా డబుల్ ధమాకాను సిద్ధం చేస్తున్నారు.
ధనుష్ పుట్టినరోజు జూలై 28..ఆ సందర్బంగా ధనుష్ తన రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇవ్వటానికి రెడీ అవుతున్నారు. ధనుష్ 50వ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను జూలై 27న రిలీజ్ చేస్తారు.ఇందులోనే రిలీజ్ డేట్‌ను కూడా చెబుతారేమో చూడాలి మరి. ఇక జూలై 28న కెప్టెన్ మిల్లర్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నారు. కెప్టెన్ మిల్లర్‌కు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఈ సినిమాకు `రాయన్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ధనుష్ 50వ సినిమాలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు. అది కూడా గుండుతో. రీసెంట్‌గానే ఆయన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకున్నారు. ఆయన గుండు లుక్ నెట్టింట వైరల్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ధనుష్ హీరోగా నటిస్తూనే తన 50వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.