English | Telugu
విజయ్ సినిమాలో శివకార్తికేయన్!
Updated : Jul 22, 2023
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు డైరక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో శివకార్తికేయన్ గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. శివకార్తికేయన్ నటించిన సినిమా మావీరన్. ఇటీవల విడుదైంది. ఫాంటసీ సినిమాగా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా వచ్చినట్టు, పోయినట్టు కూడా చాలా మందికి తెలియదు. కానీ తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. ప్రిన్స్ తర్వాత ఈ సినిమా తమిళంలో శివకార్తికేయన్‌కి కాస్త మంచి పేరు తెచ్చిపెట్టింది. మావీరన్ సినిమా ప్రమోషన్లలో శివకార్తికేయన్‌కి ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ``లియోలో ఇప్పటికే చాలా మంది నటిస్తున్నారు. మీరు కూడా కేమియో చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ అడగగానే విజయ్ సినిమాలో నటించడానికి మీరు ఓకే చెప్పారనే వార్త వైరల్ అవుతోంది. నిజమేనా`` అని ప్రశ్నించింది మీడియా.
ఈ ప్రశ్నకు శివకార్తికేయన్ కూల్‌గా `లేదు` అంటూ సమాధానం ఇచ్చారు. ``లియోలో విజయ్ నటిస్తున్నారు. కానీ, శివకార్తికేయన్ ఇందులో నటించారనే వార్తల్లో నిజం లేదు. కాకపోతే లోకేష్ కనగరాజ్ లియో సినిమాను డైరక్ట్ చేసిన సేమ్ లొకేషన్లలో శివకార్తికేయన్ తదుపరి సినిమా షూటింగ్ చేశారు. కశ్మీర్‌లో ఇద్దరి సినిమాలూ షూటింగ్ చేసుకోవడంతో ఈ కన్‌ఫ్యూజన్ మొదలైంది`` అని అంటున్నారు శివకార్తికేయన్ సన్నిహితులు.
లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేసిన ఐదో సినిమా లియో. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. లోకేష్ గత చిత్రం విక్రమ్. కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు లియో కూడా అంతకు మించి హిట్ కావాలని కోరుకుంటున్నారు ఆడియన్స్.