English | Telugu

'హిడింబ' మూవీ రివ్యూ.. కాన్సెప్ట్ అదిరింది, స్క్రీన్ ప్లే తేడా కొట్టింది!

కొంతకాలంగా విభిన్న చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల విభిన్న చిత్రంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'హిడింబ'. అశ్విన్ బాబు, నందితా శ్వేత ప్రధానపాత్రధారులుగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు(జూలై 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'విరూపాక్ష' తరహాలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది అనిపించిన ఈ సినిమా అనూహ్యంగా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా, స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా తేలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వరుస కిడ్నాప్ లు లేదా వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమాలు ఎన్నో చూసుంటాం. ఈ సినిమాలో కూడా వరుస కిడ్నాప్ లు ఉంటాయి. కానీ దర్శకుడు ఎంచుకున్న కథా నేపథ్యం మాత్రం కొత్తగా ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలోనే దర్శకుడు తప్పటడుగులు వేశాడు. ఇది రెండు భిన్న కాలాల్లో జరిగే కథ కావడంతో దర్శకుడు.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే పద్ధతిలో కథని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సన్నివేశం వర్తమానంలో నడుస్తుంటే, మరో సన్నివేశం గతంలో సాగుతుంటుంది. ఇది ప్రేక్షకులను గందరగోళానికి గురి చేయడమే కాకుండా, ప్రథమార్థం రెగ్యులర్ గానే సాగిపోయింది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. అయితే ప్రథమార్థంతో పోలిస్తే, ద్వితీయార్థం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, పతాక సన్నివేశాలు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. మొత్తానికి దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే పగడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.