English | Telugu

'ప్రాజెక్ట్ k' గ్లింప్స్.. ఇదీ నాగ్ అశ్విన్ అంటే.. ఇదీ అసలుసిసలు పాన్ వరల్డ్ అంటే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ప్రాజెక్ట్ k'లో k అంటే ఏంటి?, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్.

'ప్రాజెక్ట్ k'లో k అంటే కర్ణ, కల్కి, కాలచక్ర అని రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఈ చిత్రానికి 'కల్కి' టైటిల్ ని నిర్ణయించినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే 'కల్కి 2898 AD' గ్లింప్స్ ని విడుదల చేశారు. 76 సెకన్ల గ్లింప్స్ లో ప్రతి ఫ్రేమ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభ కనిపించింది. 'ప్రాజెక్ట్ k' పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ అంచనాలను అందుకోలేక పోవడంతో సినిమా అవుట్ పుట్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు గ్లింప్స్ తో ఆ సందేహాలకు పూర్తిగా చెక్ పెట్టేశారు. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. సినిమా సెటప్, నటీనటుల గెటప్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు కల్కి అవతరిస్తాడు అన్నట్టుగా ప్రభాస్ పాత్రను పరిచయం చేసిన తీరు వావ్ అనిపించేలా ఉంది. పురాణాలను, సైన్స్ ని ముడిపెడుతూ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లుగా ఉంది. మూవీ టీమ్ ముందు నుండి చెబుతున్నట్లుగా ఇది నిజంగానే అసలుసిసలైన పాన్ వరల్డ్ మూవీ అనే నమ్మకం కలుగుతోంది.

కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఇది కలియుగాంతము నేపథ్యంలో జరిగే కథ అని, కలి - కల్కి మధ్య పోరు చూడొచ్చని అర్థమవుతోంది. కలిగా కమల్ హాసన్, కల్కిగా ప్రభాస్ కనిపించనున్నారని చెప్పవచ్చు. ఇక సప్తచిరంజీవులలో ఒకరైన అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. హనుమంతుడు, పరశురాముడు వంటి పురాణ పాత్రలతో ఈ చిత్రం పలు భాగాలుగా వచ్చే అవకాశముంది. మొత్తానికి నాగ్ అశ్విన్ విజన్ తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

'బాహుబలి'తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలు అంచనాలను అందుకోలేక నిరాశపరుస్తున్నాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు విడుదల కాగా, అన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రాలు 'సలార్', 'ప్రాజెక్ట్ k' పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 'ప్రాజెక్ట్ k' పాన్ వరల్డ్ మూవీగా ప్రచారం పొందింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. ఇది ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి'కి మించిన సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.