English | Telugu
తెలుగు సినిమా తగ్గేదేలే... తెలుగమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీకి రండి!
Updated : Jul 21, 2023
ఇప్పుడు ఎక్కడ చూసినా "బేబీ" మూవీ గురించే టాక్. ఆ మూవీకి సంబందించిన ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా "బేబీ" మూవీ అప్రిసియేషన్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంది. తెలుగమ్మాయిలను ఉద్దేశించి ఎన్నో ఇన్స్పైరింగ్ మాటలు చెప్పారు అల్లు అర్జున్. అసలు ఈ ఫంక్షన్ కి రావడానికి కారణం హీరోయిన్ వైష్ణవి అన్నారు. తెలుగమ్మాయిలు ఎందుకు మూవీస్ లోకి రావడం లేదో అర్ధం కావడం లేదన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ తమిళ్, కన్నడ, మలయాళం అమ్మాయిలు వచ్చి అవార్డ్స్ తీసుకుని వాళ్ళ వాళ్ళ భాషల్లో థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతున్నారు.
కానీ తెలుగమ్మాయిలు లేరేమిటా, వాళ్ళ రెప్రెసెంటేషన్ లేదేమిటా అని చాలా బాధపడ్డారట. "అల వైకుంఠపురంలో" మూవీలో నా సిస్టర్ రోల్ చేసిన వైష్ణవిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసే రోజు ఎప్పుడొస్తుందా అనుకున్నాను..కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. తెలుగమ్మాయిలు శ్రీలీలే, వైష్ణవి వచ్చి తెలుగులో మూవీస్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా అనిపించింది అన్నారు. రండి..తెలుగమ్మాయిలు..మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంతో మంచి ప్లేస్..చాలా డెవలప్ అవుతోంది. ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళను వాళ్ళు నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మీ పేరెంట్స్ కి చూపించండి. బయట వాళ్లకు ఎగైనెస్ట్ కాదు కానీ మన తెలుగు అమ్మాయిల రెప్రెసెంటేషన్ కొంతైనా ఉండాలి కదా అన్నారు అల్లు అర్జున్. 2023 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కొట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అంటూ వైష్ణవికి విషెస్ చెప్పారు... ఒక్కసారి నీలాంటి అమ్మాయి అవార్డు తీసుకుంటే ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి కూడా పిచ్చ డిమాండ్ ఉంది. వయసైపోయింది అని అస్సలు అనుకోవద్దు. నేను, సుకుమార్ గారు మాట్లాడుకున్నాం..ఏంటి ఎవరూ ఇండస్ట్రీకి తెలుగు వాళ్ళు రావడం లేదు అని అనుకున్నాం...పిల్లలే స్టార్స్ అవుతారని అస్సలు అనుకోవద్దు. రావు రమేష్ గారి లాంటి వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలా మెప్పిస్తున్నారో చూస్తున్నారుగా. అలా మంచి క్యారెక్టర్స్ తో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఆడిషన్స్ పంపించండి అన్నారు అల్లు అర్జున్.