English | Telugu
'జైలర్' ప్రీ రిలీజ్.. ఒకే వేదికపై ఇద్దరు సూపర్‌స్టార్స్
Updated : Jul 23, 2023
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్ట్ 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కావటానికి సన్నద్ధమవుతోంది. మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బాక్సాఫీస్ వర్గాలు సైతం జైలర్ రిలీజ్ కలెక్షన్స్ ఏ మేరకు ఉండొచ్చుననే దానిపై డిస్కషన్స్ ఇప్పటికే స్టార్ట్ చేశాయి.
`జైలర్` మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ యాక్షన్ మోడ్‌లో తెరకెక్కించారు. లేటెస్ట్‌గా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. జూలై 28న ఈ సినిమాను చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో భారీగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే.. జైలర్ స్టేజ్‌పై ఇద్దరు సూపర్‌స్టార్స్ కలవబోతున్నారు. రజినీకాంత్‌తో స్టేజ్ షేర్ చేసుకోబోతున్న మరో సూపర్‌స్టార్ ఎవరా? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ సర్కిల్స్ సమాచారం మేరకు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, జైలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఇంకా జాకీ ష్రాఫ్ కూడా హాజరవుతారని టాక్.
జైలర్ సినిమాలో తమన్నా భాటియా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కావాలయ్యా... అనే పాట రిలీజైన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని కూడా మీడియా వర్గాలంటున్నాయి. ఈ సినిమా సక్సెస్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే.. ఆయన గత చిత్రం బీస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో రజినీకాంత్‌తో జైలర్ సినిమా చేసే అవకాశం వచ్చింది. మరీ సినిమా సక్సెస్‌తో నెల్సన్ మళ్లీ సక్సెస్ బాటలో పడుతారేమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.