English | Telugu

బాల‌య్య - సితార.. ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం `అఖండ‌`ని పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. ఈ లోపే `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ డ్రామాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు బాల‌య్య‌. అలాగే వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లోనూ ఓ మాస్ ఎంట‌ర్టైన‌ర్ ని చేయ‌బోతున్నారు ఈ నంద‌మూరి వారి హ్యాండ్స‌మ్ హీరో. విజ‌య‌ద‌శ‌మికి బాల‌య్య - అనిల్ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ కూడా బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తోంద‌ని బ‌జ్. అంతేకాదు.. ఓ స్టార్ డైరెక్ట‌ర్ రూపొందించ‌నున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా తెర‌కెక్క‌నుంద‌ని వినికిడి. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. మొత్త‌మ్మీద‌.. ఇంట్రెస్టింగ్ లైన‌ప్ తో బాల‌య్య త‌న‌శైలి ఎంట‌ర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న‌మాట‌.