English | Telugu

నితిన్ కి విల‌న్‌గా స‌ముద్ర‌క‌ని?

`అల వైకుంఠ‌పుర‌ములో`, `క్రాక్` చిత్రాల్లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించి ఆయా పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన ముద్ర‌వేశాడు సముద్ర‌క‌ని. ప్ర‌స్తుతం ఈ విల‌క్ష‌ణ న‌టుడు చేతిలో `ఆర్ ఆర్ ఆర్`, `స‌ర్కారు వారి పాట‌`, `భీమ్లా నాయ‌క్` వంటి క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట స‌ముద్ర‌క‌ని. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` పేరుతో ఓ పొలిటిక‌ల్ డ్రామా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన‌` ఫేమ్ కృతి శెట్టి నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఆర్. శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నితిన్ కలెక్ట‌ర్ గా క‌నిపించబోతున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ ఉంద‌ని.. ఆ పాత్ర‌లో ఓ ప్ర‌ముఖ న‌టుడు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఆ వేషంలో స‌ముద్ర‌క‌ని న‌టించ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు.. ఆయ‌నది ద్విపాత్రాభిన‌యం అని టాక్. త్వ‌ర‌లోనే `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`లో సముద్ర‌క‌ని ఎంట్రీపై క్లారిటీ రానుంది.

మ‌రి.. నితిన్ కి స‌ముద్ర‌క‌ని విల‌నిజం ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.