English | Telugu

నితిన్‌తో నిధి అగ‌ర్వాల్ రొమాన్స్?

`స‌వ్య‌సాచి`(2018)తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్. ఆపై త‌క్కువ గ్యాప్ లోనే `మిస్ట‌ర్ మ‌జ్ను` (2019)తో ప‌ల‌క‌రించింది. అక్కినేని బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య‌, అఖిల్ తో వేర్వేరుగా చేసిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. అయితే, మూడో తెలుగు చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్` (2019) బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో.. నిధికి నాయిక‌గా ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో న‌టిస్తోంది నిధి. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పిరియ‌డ్ డ్రామా.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా నిధి అగ‌ర్వాల్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా ఎస్.ఆర్. శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` పేరుతో ఓ పొలిటిక‌ల్ డ్రామా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన‌` ఫేమ్ కృతి శెట్టి మెయిన్ లీడ్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో నిధి సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`లో నిధి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. నితిన్, నిధి ఫ‌స్ట్ కాంబినేష‌న్ లో రానున్న ఈ సినిమాతో మిస్ అగ‌ర్వాల్ ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.