English | Telugu

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌తో చ‌ర‌ణ్ డీల్ రూ. 4 కోట్లకు పైమాటే!

ఓటీటీ దిగ్గ‌జం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌కు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాస‌డ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యం తెలిసింది. త్వ‌ర‌లోనే రామ్‌చ‌ర‌ణ్‌తో తీసిన యాడ్‌ను ప్ర‌సారం చేయ‌నున్నాడు. ఆ యాడ్‌లో చ‌ర‌ణ్ ఒక మెజీషియ‌న్ లాగా క‌నిపించ‌నున్నాడు. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌కు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర‌ణ్ ప్ర‌మోట్ చేస్తున్నాడు. దీని కోసం అత‌నికి ఒక కోటి రెమ్యూన‌రేష‌న్ అందిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ అది త‌ప్ప‌నీ, ఆయ‌న‌కు రూ. 4 కోట్ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్ అందుతుంద‌నీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. ఒక తెలుగు యాక్ట‌ర్‌కు సంబంధించి దీన్ని చాలా పెద్ద డీల్‌గా చెబుతున్నారు. ఈ డీల్‌తో చ‌ర‌ణ్ బ్రాండ్ వాల్యూ కూడా బాగా పెరిగింద‌ని చెప్పాలి.

కాగా ఈరోజు బిగ్ బాస్ 5 ఎపిసోడ్‌లో నాగార్జున‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ సంద‌డి చేయ‌నున్నాడు. వారితో పాటు మాస్ట్రో మూవీ లీడ్ యాక్ట‌ర్స్ నితిన్‌, త‌మ‌న్నా, న‌భా న‌టేశ్ వీక్ష‌కుల్ని అల‌రించ‌నున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను స్టార్‌మా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

రామ్‌చ‌ర‌ణ్ ఇప్ప‌టికే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను పూర్తిచేసి, 'ఆచార్య' షూట్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. త్వ‌ర‌లో శంక‌ర్ డైరెక్ష‌న్‌లో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమాని ప్రారంభించ‌నున్నాడు.