English | Telugu

ర‌వితేజ త‌దుప‌రి చిత్రానికి ముహూర్తం ఫిక్స్!

మాస్ మ‌హారాజా ర‌వితేజ కొత్త సినిమా `ఖిలాడి` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు.. `రామారావు ఆన్ డ్యూటీ` శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు కూడా త‌క్కువ గ్యాప్ లోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌ని టాక్.

ఇదిలా ఉంటే.. ఎప్ప‌టినుంచో వార్త‌ల్లో ఉన్న మ‌రో ప్రాజెక్ట్ ని అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడ‌ట ర‌వితేజ‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్`, `హ‌లో గురు ప్రేమ కోస‌మే` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి 2022 వేస‌విలో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌వితేజ - త్రినాథ‌రావు న‌క్కిన కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. ర‌వితేజ - త్రినాథ‌రావు ఫ‌స్ట్ కాంబో మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

కాగా, ఈ చిత్రంలో ర‌వితేజ‌కి జంట‌గా `పెళ్ళిసంద‌డి` ఫేమ్ శ్రీ‌లీల నాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని బ‌జ్.