English | Telugu

ప్ర‌భాస్ 25.. ఆ రోజే ముహూర్తం?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం `రాధే శ్యామ్`, `స‌లార్`, `ఆది పురుష్`, `ప్రాజెక్ట్ కే` చిత్రాలున్నాయి. వీటిలో `రాధే శ్యామ్`, `స‌లార్`, `ఆది పురుష్` వ‌చ్చే ఏడాది తెర‌పైకి రానుండ‌గా.. `ప్రాజెక్ట్ కే` 2023లో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కాంబినేష‌న్ లో చేయ‌బోతున్న‌ట్లు గ‌త కొద్దిరోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. `వృందావ‌న‌` అనే టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడ‌ని.. ఇది కూడా పాన్ - ఇండియా మూవీలా రూపొంద‌నుంద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. దిల్ రాజు పుట్టినరోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 18న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ట‌. రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం 2022 చివ‌ర‌లో లేదా 2023 ఆరంభంలో మొద‌లు కావ‌చ్చ‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ఇప్ప‌టికే దిల్ రాజు నిర్మాణంలో `మున్నా` (2007), `మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్`(2011) చిత్రాలు చేశాడు ప్ర‌భాస్. వీటిలో `మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్` మంచి విజ‌యం సాధించింది.