నాగార్జున సాగర్ ఎగ్జిట్ పోల్.. సంచలన ఫలితం! 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంక కీలకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకుని పోరాడటంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. పోలింగ్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదైంది. నాగార్జున సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఏడుసార్లు గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సాగర్ లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య విజయం సాధించారు. అయితే గత డిసెంబర్ 1న అనారోగ్యంతో నర్సింహయ్య చనిపోయారు. దీంతో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరిగింది. తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఘోర ఫలితాలు చవిచూసిన కాంగ్రెస్ .. తమకు పట్టున్న నాగార్జున సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జానారెడ్డిని మరోసారి బరిలోకి దింపింది. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుడు భగత్ పోటీ చేశారు. బీజేపీ మాత్రం జనరల్ సీటులో గిరిజన వ్యక్తిని బరిలోకి దింపి ప్రయోగం చేసింది. మూడు పార్టీలు తమ బలగాన్నంతా సాగర్ లోనే మోహరించి ప్రచారం చేశాయి. కరోనా వైరస్ భయపెడుతున్నా... అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ కూడా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు . నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 లక్షల 20 వేలకు పైగా ఓటర్లు ఉండగా.. ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 88 శాతం పోలింగ్ జరిగింది. 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెరగడంతో అన్ని పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి గండం అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి మద్దతుగానే పోలింగ్ శాతం పెరిగిందని అధికార పార్టీ ధీమాగా ఉండగా.. ప్రజా వ్యతిరేకత వల్లే ఓటర్లు కసిగా ఓటేశారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ మాత్రం గెలుపు రేసులో ఉండకపోయినా గౌరవప్రదంగానే ఓట్లు సాధిస్తామని చెబుతోంది.  అయితే నాగార్జున సాగర్ పై ఆరా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ లో సంచలన ఫలితం కనిపిస్తోంది. ఎన్నికల్లో సర్వేల్లో ఆరా సంస్థకు మంచి పేరుంది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దే విజయమని ఆరా సంస్థ సర్వేలో తేలింది. అయితే అందరు అనుకున్నట్లుగా కాకుండా కారు పార్టీకి సాగర్ లో భారీగానే ఓట్లు రానున్నాయి. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 39.93 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ కేవలం 6. 31 శాతం ఓట్లతో డిపాజిట్ కోల్పోనుందని ఆరా ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. ఇతరులకు 3.28 శాతం ఓట్లు రానున్నాయి. ఆరా సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు దాదాపు 10 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి. అంటే దాదాపు 20 వేల ఓట్లతో నోముల భగత్ సాగర్ లో గెలవబోతున్నారని ఆరా సంస్థ సర్వేలో తేలింది. మూడు శాతం ఓట్లు అటు ఇటుగా వేసుకున్నా.. 15 వేల నుంచి 25 వేల తేడాతో నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలవబోతోంది. 

బెంగాల్ లో మమతదే విజయం! 

దేశ వ్యాప్తంగా రాజకీయ మంటలు రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ గెలవబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ లో హ్యాట్రిక్ విజయానికి తృణామూల్ కాంగ్రెస్ , పాగా వేసేందుకు బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ మధ్య యుద్దమే సాగింది. ఎనిమిది విడతలుగా జరిగిన పోలింగ్... గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తంగా సాగింది. ప్రతి దశలోనూ గొడవలు జరిగాయి. పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలు కూడా జరిగాయి. అన్ని దశల్లోనూ హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. గురువారం చివరి దశ పోలింగ్ ముగియడంతో బెంగాల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. పోలింగ్ సరళిని అంచనా వేసిన బీజేపీ .. బెంగాల్ లో పాగా వేస్తామని ధీమాలో ఉండగా... ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం మళ్లీ టీఎంసీదే అధికారమని తెలుస్తోంది. గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వేలో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తేలింది. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడంతో 292 స్థానాలకే పోలింగ్ జరిగింది. అయితే 292లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ 170 (ప్లస్ ఆర్ మైనస్ 16 ), బీజేపీకి 110 ( ప్లస్ ఆర్ మైనస్ 14). కాంగ్రెస్ కూటమికి 10 (ప్లస్ ఆర్ మైనస్ 4) సీట్లు వస్తాయని ఎగ్టిట్ పోల్ సర్వేలో తేలింది. టీఎంసీకి 157 నుంచి 185 సీట్లు, బీజేపీకి 96 నుంచి 125 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 8 నుంచి 14 సీట్లు వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది.  బెంగాల్ లో ప్రాంతాల వారీగా చూస్తే.. నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఇక్కడ బీజేపీకి 26 నుంచి 32 సీట్లు రానుండగా.. టీఎంసీకి 18 నుంచి 25 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ కూటమికి కేవలం 3 నుంచి 4 సీట్లు నార్త్ బెంగాల్ లో రానున్నాయి. సెంట్రల్ బెంగాల్ లో టీఎంసీకి లీడ్ రాబోతోంది. ఇక్కడ టీఎంసీకి 38-45, బీజేపీకి 24-29, కాంగ్రెస్ కూటమికి 4-7 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. గ్రేటర్ కోల్ కతా రీజియన్ లో మాత్రం బీజేపీ పత్తా లేకుండా పోయింది. ఇక్కడ టీఎంసీకి ఏకపక్ష ఫలితాలు వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. గ్రేటర్ కోల్ కతాలో టీఎంసీకి ఏకంగా 80 నుంచి 91 సీట్లు రానుండగా.. బీజేపీకి కేవలం 17 నుంచి 26 సీట్లకే పరిమితం కాబోతోంది.  ఇక బెంగాల్ పోలింగ్ కు తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించిన జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో మాత్రం బీజేపీ సత్తా చాటనుందని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.  జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో బీజేపీకి 31-37 అసెంబ్లీ సీట్లు గెలవనుండగా.. టీఎంసీ కేవలం 18-24 స్థానాలకే ఆగిపోనుందని సర్వే చెబుతోంది. మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఈ ఏరియాలోనే ఉంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికార ఈసారి కూడా నందిగ్రామ్ ఏరియాలో తన పట్టు నిలుపుకున్నారని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. దీంతో నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో తాము తప్పకుండా గెలుస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది.  కుచ్ బీహార్ , అలిపూర్దూర్..జల్ పాయ్ గురి, డార్జిలింగ్ . దక్షిణ్ దినాజ్ పూర్ , మాల్దా, నదియా జిల్లాలో బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. హుగ్లి, మిడ్నాపూర్,  పూరిలియా, బంకూరా జిల్లాలో హోరాహోరీ పోరు సాగినా.. కమలానికి ఆధిక్యత కనిపిస్తోంది. కోల్ కతాలో మాత్రం టీఎంసీ స్వీప్ చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హౌరా జిల్లాలోనూ టీఎంసీ హవా ఉందని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడిస్తోంది.

పరీక్షలపై పోరు.. కేఏ పాల్‌ దీక్ష

విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ప‌రీక్షలు వాయిదా వేయాలి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పెట్టడం సరికాదు. అందుకే, ఎగ్జామ్స్ ర‌ద్దు కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ‌లో దీక్ష చేప‌ట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్‌ స్పష్టం చేశారు.   ప‌రీక్షలు ర‌ద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో అడ్మిట్‌ చేశార‌ని చెప్పారు కేఏ పాల్‌. . శుక్ర‌వారం వాదనలు జరుగుతాయని.. 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు త‌న‌ దీక్ష కొనసాగుతుందన్నారు. "నా పిల్లల్ని పరీక్షలకు పంపడం లేదు. పరీక్షలు రద్దు చేయమని, పాస్‌ చేయమని అడగట్లేదు. రెండు నెలలు వాయిదా వేయమని కోరుతున్నా. పరీక్షలు వాయిదా పడే వరకు దీక్ష కొనసాగిస్తా. నా దీక్ష దగ్గరకు ఎవరూ రావొద్దు’’ అని కేఏ పాల్‌ అన్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే-05 నుంచి ఇంటర్ పరీక్షలు, జూన్ తొలి వారంలో ప‌ది ప‌రీక్ష‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌ను ఆన్‌లైన్ క్లాసెస్‌కు అందుబాటులో ఉండాల‌ని మంత్రి కోరారు. పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించ‌బోమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

ముక్కులో నిమ్మరసం.. టీచర్ మృతి.. 

అతని పేరు బసవరాజ్.  వయసు 43 ఏళ్ళు. ఆయన ఓ  పతులు. పంతులు అంటే గుడిలో మంత్రాలు చదివే పంతులు కాదు. బడిలో పాఠాలు చెప్పే పంతులు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో  రకరకాల ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. కొబ్బరి నూనెతో కరోనా తగ్గుతుందని. నిమ్మ రసం ముక్కులో వేసుకుంటే కరోనా ధరకిరాదని. చేతిలో ఫోన్ ఉండి, అందులో డేటా ఉన్నోడు ప్రతి ఒక్కడు, సర్టిఫికెట్ లేకుండానే వైద్యుడు అయిపోతున్నారు. అవ్వని ప్రజా ఆరోగ్యం కోసం చేయడం లేదు. సమాజ ఉద్దరణ కోసం చేయడం లేదని. యూట్యూబ్ లో ఇచ్చే డబ్బుల కోసమో, లేక నాకు తెలివి ఉందని అందరు అనికోవాలని చేస్తున్నారని ఆ టీచర్ గ్రహించలేకపోయాడు. అందుకే ఆ ఫేక్ న్యూస్ లు నమ్మి తన ప్రాణాలు తీసుకున్నాడు ఆ బడి పంతులు.  రాయచూరు జిల్లాలో నివసించే బసవరాజ్ ముక్కులో  నిమ్మరసం పిండుకోవడం గురించి తెలుసుకుని, తాను కూడా అలాగే చేశాడు.నిమ్మరసం ముక్కులో పిండుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు దరిచేరవని, తద్వారా కరోనా రాకుండా ఉంటుందని నమ్మాడు. కానీ విషాదకర రీతిలో ముక్కులో నిమ్మరసం పిండుకున్న తర్వాత బసవరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.    దెబ్బ తగిలితే అదే చోట మందు రాయాలి. అది వాస్తవం కానీ దానివల్ల ఏదైనా ప్రమాదం ఉందొ లేదో తెలుసుకోకుండా.. తొందర పడి ఫేక్ న్యూస్  లు విని ప్రాణాల మీదికి తెచ్చుకోకండి.                                      

రెండు డోసులు తీసుకుంటే సేఫ్.. 

అది భూకంపం కంటే భయంకరమైనది. తుపాన్ కంటే ప్రమాదకరమైంది. టెర్రరిస్టుల చేతిలో ఉన్న బాంబ్ కంటే బలమైంది...అది ఏంటని అనుకుంటున్నారా..? అదే కరోనా మృతువు. కరోనా వస్తే కనికరం ఉండదు. బంధాలు, అనుబంధాలు, బంధువులుండవ్.. అన్నీ అనాధశవాలే.  ఒక రోజు కాదు. రెండు రోజులు కాదు. సరిగ్గా సంవత్సరం నుండి ప్రపంచదేశాలను వణికిస్తోంది. సినిమాలో దెయ్యం లా దేశాలను పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ప్రపంచదేశాలు ఆ మహమ్మారికి మరణ ముహూర్తం పెట్టడానికి ట్రై చేస్తున్నారు. భారత దేశం లో కరోనా బ్రేక్ లేని ఆర్టీసీ బస్సు లా దూసుకుపోతుంది. నిర్లక్ష్యం తో వుంటే అంతే,  కరోనా ఒక్కసారి ఎటాక్ చేసిందంటే డైరెక్ట్ టికెట్ స్వర్గపురికే. కరోనా ముదిరాక తప్పకుండ బకెట్ తన్నాల్సిందే. అందుకే  దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ని రంగంలోకి దించింది.. కరోనాకు వ్యాక్సిన్ రూపం లో బ్రేక్ వేస్తుంది. దేశం లో ఉన్న ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండ వ్యాక్సిన్ వేసుకోవాలి.   అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆసక్తికర వివరాలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే, పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదని సీడీసీ తెలిపింది. మరణం నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. 65 ఏళ్లకు పైబడిన వారు రెండు డోసులు తీసుకున్న అనంతరం, వారికి 94 శాతం రక్షణ ఉంటుందని చెప్పింది. ఒక డోసు తీసుకుంటే 64 శాతం రక్షణ కలుగుతుందని వెల్లడించింది. టీకా తీసుకున్న వారు కరోనా వైరస్ ను సాధారణ జలుబులాగానే ఎదుర్కొంటారని సీడీసీ వివరించింది.  ఈ అధ్యయనం కోసం సీడీసీ నిపుణులు అమెరికాలోని 417 మంది కరోనా రోగుల సమాచారాన్ని, 187 మంది వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ఆరోగ్యపరిస్థితితో పోల్చి చూశారు. అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. సీడీసీ తాజా అధ్యయనంతో ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై మరింత సానుకూలత బలపడింది. దీనిపై సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్ స్కై స్పందిస్తూ.... వ్యాక్సినేషన్ వల్ల కరోనా రోగులు ఆసుపత్రుల పాలయ్యే ముప్పు తప్పుతుందని, తద్వారా ఆసుపత్రులు నిండిపోయే అవకాశం ఉండదని వివరించారు. ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అటు, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అధ్యయనం చేపట్టాయి. ఇజ్రాయెల్ లో వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తేలింది. అటు, బ్రిటన్ లో కరోనా టీకా ఒక డోసు వేసుకున్నా 50 శాతం రక్షణ కలిగిస్తున్నట్టు గుర్తించారు.

సింగల్ డోస్ వ్యాక్సిన్ లాభాలు.. 

సింగల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్ వ్యాప్తి  సగానికి సగం తగ్గిందని అధ్యనం వెల్లడించింది. ఎవరైతే మొదటి డోస్ తీసుకున్నారో లేదా రెండవ డోస్ తీసుకున్నారో ఎన్ హెచ్ ఎస్ అధ్యనం చేసింది. కోవిడ్ సార్క్ వచ్చిన వారినీ పరిశీలించగా మూడు వారాల తరువాత 38% - 49%  వార్స్ వారిలో వచ్చిపోయిందని తేల్చారు. ఒక సింగల్ డోస్ ఆస్ట్రా జనికా లేదా ఫైజేర్ వ్యాక్సిన్  కోవిడ్ 19 తగ్గినట్లు కనుగొన్నారు . కరోనా వ్యాప్తి సగానికి సగం తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాపించదని తేల్చారు. వ్యాక్సిన్ వేసిన14 రోజుల తరువాత అన్ని వయస్సుల వారు సంరక్షించ బడి నట్లు అధ్యనం వెల్లడి చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికుటుంబాలలో కోవిడ్ వ్యాప్తి5౦% తగ్గిస్తుందని వ్యాక్సిన్ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంరక్షిస్తుందని అని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యమని ఎన్ హెచ్ ఎస్ పేర్కొంది.ఈ మేరకు57౦౦౦ మంది పై ఒక ల్యాబ్ లో పరీక్షలు నిర్వ హించినట్లువివరించారు.దాదాపు ఒక మిలియన్ ప్రజలు కరోన వచ్చిన వారు వ్యాక్సిన్ తీసుకొని వారని తేల్చారు. వ్యాక్సిన్ కు ముందు5౦%6౦ % ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ నాలుగు వారాల తరు వాత వ్యాక్సిన్ తీసున్న తరు వాత సాధారణ స్థితి కి చేరుకున్నారని అంటే వ్యాక్సిన్ సహకరిస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ వ్యాధి తీవ్రత తగ్గు తుందని ప్రతి రోజూ మరణాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అధ్యయనం లో పేర్కొన్నారు. పి హెచ్ ఇ కి చెందిన ఇమ్యునైజేషన్ విభాజం హెడ్ డాక్టర్ మేరీ రంసేయ్ అన్నారు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యల పై ప్రభా వం చూపబోదని , అయితే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోడంలో జాప్యం చేస్తే మీశరీరం లో కోత్హ వేరియంట్స్ వస్తాయని అన్నారు. కరోనా నుండి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తప్పని సరి అని అధ్యనం వెల్లడిస్తోంది.                   

ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చిన కోవిడ్19 

కోవిడ్19 ప్యాండమిక్  సహజంగా ఉండే వాతావరణం పై తీవ్ర ప్రభావం చూపింది. జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విధించిన  లాక్ డౌన్ కొందరికి అనుకూల మరికొందరికి ప్రతి కూల ప్రభావం చూపింది.కొన్ని సమస్యలకుప్రశ్నలకు జవాబులు దొరకవు. ఖగోళ్ళాన్ని, జయించిన మనం అంగారకుడి ఉనికిని కనిపెట్టి చంద్ర మండలంలో నివసించడానికి ఏర్పాట్లు చేసుకునే సామర్ధ్యాన్ని సైన్సును అభి వృద్ధి చేసుకున్నమనం ప్రకృతికి మాత్రం భయపడక తప్పని పరిస్థితి. మానవుడి ముందు ప్యాండమిక్ కు సంబందించిన వార్తలు కొంత వరకు వ్యతిరేకం కావచ్చు. అయినప్పటికీ కోవిడ్19 ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది. ఇంకా ఇప్పటికీ మానవుల కు మరిన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదని స్పష్ట మౌతోంది భవిష్యత్తు ప్రస్నార్ధకం అయ్యింది. జీవన శైలి మారింది మానవీయ సంబందాలు దూరం చేసాయిఆయా దేశాలలో ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభ్హవం చూపింది. అసలు పరి ణామాన్ని అధ్యనం చేయడం మనవ తప్పిదం వల్ల చోటు చేసుకున్న ఈ పరిణామాల పై ఒక హెచ్చరిక చ్చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండవ విడత కోవిడ్ తీవ్రతను అంచనా వేయడం లో పూర్తిగా విఫల మయ్యా మని, రోజు రోజుకు కొమ్మి దేశాలలో మరణాల రేటు పెరగడాన్ని మరింత బాధని పాలకుల నిర్లక్ష్యాన్ని బాధ్యత రాహిత్యానికి సామాన్యులు బాలి అయ్యారనేది వాస్తవం వెళ్తున్న ప్రతి దారి కోవిడ్ మరణాల కెనా అన్నట్లుగా కనిపిస్తోంది.కోవిడ్ ప్యాండమిక్ లో ఉజ్జాయింపుగా 16 ట్రిలియన్ల అంటే జీడిపి లో 9౦% అని తేల్చారు.   ఇది కేవలం ఒక పేపర్ పై సంఖ్య మాత్రమే అంటే ప్రపంచ వ్యాప్తం గా అయాదేసాలు ఆర్ధికంగా దేబ్బతిన్నాయో. పోర్తిసమాచారం డేటా అనడంలేదు. అయితే ఆ నష్టంఎప్పటికి పూడ్చుకోగల మన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?గతంలో లాగా ఇతర దేశాలతో పూర్తి స్నేహ సంబందాలు నేలకోల్పడం పేఅస్పర ఆర్ధిక సహకారం అందించుకోడం సాధ్యమా? అన్నది మరో ప్రశ్న ఇలా వాణిజ్యం, పరిశ్రమ పెట్టుబడులు. ఇలా అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక వాస్తవ విషయాన్ని చెప్పాలంటే సహజమైన ప్రకృతి కి కాస్త విరామం లభించినట్లయ్యింది. అందుకే కొన్ని సంవత్సరాల తరువాత కాలుష్య కోరల్లో కొట్టు మిట్టాడిన ప్రకృతి పరవసించిపోయింది.ఆ ప్రకృతి పై ఆధార పడే జీవజాలం పండగ చేసుకుంది. ఓజోన్ పోర మామూలు స్థాయికి వచ్చింది సమయానికి వర్షాలు కురిసాయి సముద్రాలు నదులలో నీరు స్వచ్చంగా మారింది మానవుడి ముఖ చిత్రాని ఆనీతిలో చాలా స్పష్టంగా కనపడింది అంటే ప్రకృతిని కాలుష్యపు కోరల్లో చిక్కుకుందో అంచనా వేయచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మానవుడు ఎంతగా సంలేతికఅభివృధి సాధించినా. ప్రకృతి ఒడిలో సేదదీరే ప్రకృతి ప్రేమికులకు  ఇతర దేశాలలో ఉన్న అందాలను ఆస్వాదించాలన్న కోరిక ఉన్న ఒక ప్రాంతం నుంది మారో ప్రాంతానికి వెళ్ళడం వల్ల కొంత పరిసోదించే అవకాశం కోవిడ్19 లేకుండా చేసిందని.వాటికి బ్రేక్ వేయక తప్పని స్థితి ఏది ఏమైనా కోవిడ్19 ప్రకృతికి కొంచం ఉపసమనం. ప్రకృతి పై ఆధారపడ్డ సహజ జంతు సంపద లాభం పొందింది అనేది నిజం.రెండవ విడత మూడవ విడత కోవిడ్ ప్రభావం తీవ్రత ఇంకా ప్రపంచ ముఖ చిత్రం ఎలా ఉంటుందో అంచనా వేయడం ఆసాధ్యం అని అంటున్నారు శాస్త్రజ్ఞులు.                                                          

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి.. 

అది కృష్ణా జిల్లా. ఆయన పేరు కాగితపు వెంకట్రావ్. పెడన మాజీ ఎమ్మెల్యే. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నాయకుడు. ఆయన మరణం టీడీపీ ఒక లోటు.. మొన్నటికి మొన్న వెస్ట్ గోదావరి జిల్లా యువజన నాయకుడు మరణించాడు. అది మారిపోక ముందే కాగిత వెంకట్రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా కాగిత వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మచిలీపట్నంలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. కాగిత వెంకట్రావు స్వగ్రామం నాగేశ్వరరావు పేట. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ రాజకీయ వారసత్వం అందుకోగా, కుమార్తె వైద్య నిపుణురాలు. కాగిత వెంకట్రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగితపు వెంకట్రావ్ బీసీల  అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని. వెంకట్రావు మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు తమ  ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని  చంద్రబాబు అన్నారు. లోకేశ్ స్పందిస్తూ.... కాగిత వెంకట్రావు టీటీడీ మాజీ చైర్మన్ గానూ విశేష సేవలందించారని, తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా నిలిచారని కొనియాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన నేతగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చిరస్మరణీయం అని కీర్తించారు. కాగితపు వెంకట్రామ్ మృతి పట్ల కృష్ణ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

రంగంలోకి ఆర్మీ.. మోదీ రివ్యూ..

ఇండియ‌న్ ఆర్మీ. స‌రిహ‌ద్దుల్లో చెల‌రేగే సోల్జ‌ర్స్‌. వారికి దేశ భ‌ద్ర‌త ఎంత ముఖ్య‌మో.. దేశంలోని ప్ర‌జ‌ల‌ భ‌ద్రతకూ అంతే ప్రాముఖ్యం ఇస్తారు. అందుకే, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో మేముసైత‌మంటూ ప్ర‌జాసేవ‌కు సిద్ధంగా ఉన్నారు. గ‌తంలో తుఫానులు, వ‌ర‌ద‌లు, భూకంపాల స‌మ‌యంలో సైన్యం త‌మ వంతు సాయం చేసింది. ఇప్పుడు వైర‌స్ విప‌త్తులోనూ రోగుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తోంది.  కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రజలకు సేవలందించడానికి సైన్యం సన్నద్ధతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో సైన్యం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కొవిడ్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత దేశాన్ని వేధిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనేతో మోదీ సమావేశమయ్యారు.  కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై చర్చించారు. సైన్యంలోని వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచినట్లు జనరల్ నరవనే తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను సైన్యం నిర్మిస్తోందని చెప్పారు. సాధ్యమైన చోట ప్రజల కోసం ఆసుపత్రులను నిర్మించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. సమీపంలోని సైనిక ఆసుపత్రులను సందర్శించి, వైద్య సేవలు పొందాలని ప్రజలను కోరారు. దిగుమతి చేసుకున్న ఆక్సిజ‌న్‌ ట్యాంకర్ల కోసం అవసరమైన సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న‌ వారిని కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోదీతో చెప్పారు ఆర్మీ చీఫ్‌. అవ‌స‌ర‌మైతే ఎలాంటి సేవ‌కైనా సైన్యం అన్ని వేళ‌లా సిద్ధంగా ఉంద‌న్నారు.

షాకింగ్.. మే1 నుంచి వ్యాక్సినేషన్ లేదు! 

కొవిడ్ టీకా కోసం ఎదురు చూస్తున్నారా? కొవిన్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అయినా మీకు టీకా ఇప్పట్లో అందదు. కొవిడ్ టీకాల కొరతే ఇందుకు కారణం. దేశంలో అవసరానికి సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో మే1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ అమలుపై రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో 18-44 వయసు వారికి  కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వలేమని  వైద్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా అవసరాలకు సుమారు మూడున్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమని, దానిపై స్పష్టత లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయలేమన్నారు. కేంద్రం నుంచి ఎంత కోటా వస్తుందో కూడా అంచనా లేదన్నారు. అక్కడి నుంచి అందే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా తెలంగాణలో అమలు ఆధారపడి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా మే1  నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదని ప్రకటించింది.  రాష్ట్రాలకు సహకారం అందించాల్సిన బాధ్యతను తుంగలో తొక్కి పెత్తనం చేయడం, నియంత్రించడంపైనే దృష్టి పెట్టిందన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రాల విజ్ఞప్తులకు కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడంలేదన్నారు.కరోనా సెకండ్ వేవ్‌ను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. దానికి నిదర్శనమే ఎన్నికలు, కుంభమేళా లాంటి నిర్వహణ అని ఉదహరించారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.తీవ్రతను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైనందువల్లనే ఆక్సిజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్ తదితరాలకు కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మూడు వేల రూపాయలకు అమ్మాల్సిన రెమిడెసివిర్ ఇప్పుడు మార్కెట్‌లో రూ. 30 వేలకు అమ్మే పరిస్థితిని చూస్తున్నామని, ఎక్కువ ధరకు అమ్మేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ముందుగానే సెకండ్ వేవ్ తీవ్రతను, దాని ప్రభావాన్ని అంచనా వేసి రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఇప్పుడున్న పరిస్థితిని చూసేవారం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోడానికి దోహదపడి ఉండేదన్నారు. రాష్ట్రాలకు ’ఫ్రీ హాండ్’ ఇవ్వకుండా కేంద్రం అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, ప్రాణవాయువు అందని కారణంగా వందలాది మంది చనిపోతున్నారని గుర్తుచేశారు. వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్, రెడ్డీస్ లాబ్ సంస్థల ప్రతినిధులతో ప్రధాన కార్యదర్శి చర్చలు జరిపారని ఈటల చెప్పారు. 

ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం అవ‌మాన‌క‌రం! 

కొవిడ్ వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివివ‌ర్ మందుల కేటాయింపులో కేంద్ర  ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదన్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. కేంద్రంతో పాటు తెలంగాణ‌ బీజేపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారని,  అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుందని బీజేపీ నేతలకు సూచించారు రాజేందర్.  తెలంగాణ‌లో 4 రాష్ట్రాలకు  చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని ఈటల తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డిలో దేశంలోనే స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాష్ర్టం తెలంగాణ అని స్ప‌ష్టం చేశారు. సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే ప‌రిస్థితి భార‌త్‌కు వ‌చ్చింద‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. క‌రోనా రోగులు స‌రిపడా ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం దేశానికి అవ‌మాన‌క‌రం అని మంత్రి ఈట‌ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయే అవ‌కాశం ఉంటుందన్నారు. అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్‌ను కేంద్రం యుద్ధ ప్ర‌తిపాదిక‌న స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. తెలంగాణ‌కు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కోరితే.. కేవలం 306 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే కేటాయించిందని చెప్పారు.  ద‌గ్గ‌ర ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్ ఇవ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్ ను కేటాయించడం ఏంటని ఈటల ప్రశ్నించారు.  కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని మంత్రి ఈట‌ల డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ డోసుల ఉత్ప‌త్తి యుద్ధ ప్రతిపాదిక‌న పెర‌గాలన్నారు.వ్యాక్సిన్ లేక‌పోతే గంద‌రగోళ‌మ‌వుతుంద‌ని అధికారులు చెప్తున్నారు. రాష్ర్టంలో 18-44 ఏండ్ల మ‌ధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్ప‌త్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్ విష‌యంలో కేంద్రం స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించాలి అని ఈట‌ల డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు తప్ప‌ుబ‌డుతున్న కేంద్రం ఏం చేసిందని ఈటల ప్రశ్నించారు. రెమ్‌డెసివివ‌ర్ త‌క్కువ‌కు త‌యారు చేసి ఎక్కువ‌కు అమ్ముతున్నా కేంద్రం నియంత్రించడం లేదన్నారు. ఔష‌ధాలు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాల‌న్నారు. క‌రోనా టెస్టింగ్ కిట్ల ధ‌ర‌లు కూడా పెంచారని, కేంద్రానికి అన్నింటిపైనా నియంత్ర‌ణ ఉండాలన్నారు.  మూడున్నర కోట్ల టీకాలు 3 నెల‌ల్లో ఇవ్వాల‌ని అనుకుంటున్నాం.. దిగుమ‌తి చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇస్తుందా? అని ఈటల అడిగారు. జాతీయ విప‌త్తు స‌మ‌యంలో కేంద్రం అన్నింటినీ నియంత్ర‌ణ చేయ‌లేదా? అని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

హైదరాబాద్ లో ఫైరింగ్.. ఇద్దరికి సీరియస్ 

హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కూకట్ పల్లిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కూకట్ పల్లి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా కాల్పులు జరిగాయి. సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎంలో డబ్బులు పెడుతున్న ఉద్యోగి టార్గెట్ గా కాల్పులు జరిపారు దుండుగులు. సెక్యూరిటీ గార్డుతో పాటు ఉద్యోగి తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయారు. దీంతో ఏటీఎంలో పెట్టేందుకు తీసుకొచ్చిన నగదు తీసుకుని దుండగులు పరారయ్యారు. కూకట్ పల్లిలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు.. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. డబ్బులతో పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 

తిరుపతి దొంగ ఓటర్లకు కరోనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు పట్టుబడటం కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి వందలాది బస్సులు, కార్లలో వచ్చిన దొంగ ఓటర్లను టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు రెడ్ హ్యాడెండ్ గానే పట్టుకున్నారు. అధికార పార్టీ నేతలు ఫేక్ ఓటరు ఐడీ కార్డులు స్పష్టించి లక్షలాదిగా దొంగ ఓట్లను వేయించుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. తిరుపతి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దొంగ ఓటర్ల అంశంపై కోర్టుల్లోనూ కేసులు ఉన్నాయి.  అయితే తిరుపతి పోలింగ్ కు సంబంధించి సంచలన విషయాలు బయటపెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో బయటి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వారు కరోనా బారిన పడ్డారని చెప్పారు.  పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసి, కరోనాకు గురై ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు చింతా మోహన్. పోలింగ్ రోజున విధుల్లో ఉన్న సిబ్బంది కోట్లాది రూపాయలను వైసీపీ ఇచ్చిందని రెండు రోజుల క్రితం ఆరోపించారు చింతా మోహన్.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని చింతా మోహన్ డిమాండ్ చేశారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. తన అవినీతి ఆరోపణల కేసుల్లో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మీ సహా పలువురు ఐఏఎస్ అధికారులకు జగన్ కీలక పోస్టులు ఇచ్చారని... కీలక శాఖల బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. సాక్షులను తన అధికారంతో జగన్ ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తుంటే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. కోర్టులకు కళ్లు లేవా? అని చింతా మోహన్ నిలదీశారు.  ప్రజలు కూడా న్యాయస్థానాల చిత్తశుద్ధిని శంకిస్తున్నారని చింతామోహన్ అన్నారు. లక్ష రూపాయలు తీసుకున్నారనే కేసులో దళితనేత బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపారని... వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ విషయంలో కోర్టులు కళ్లు మూసుకున్నాయని చెప్పారు. జగన్ కు ఒక న్యాయం, బంగారు లక్ష్మణ్ కు మరో న్యాయమా? అని చింతా మోహన్ అసహనం వ్యక్తం చేశారు.

చార్‌ధామ్‌ యాత్ర రద్దు.. కుంభ‌మేళా ఎఫెక్ట్‌..

ప‌విత్ర చార్‌ధామ్ యాత్ర ర‌ద్దు అయింది. ఉత్త‌రాఖండ్‌లో ఏటా జ‌రిగే చార్‌ధామ్ యాత్ర‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ ప్రకటించారు. నాలుగు ఆలయాల్లోకి భక్తులెవరినీ అనుమతించేది లేదని, కేవలం అర్చకులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.    ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌,యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మే 14 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా దృష్ట్యా ఈ సారి యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 6వేలకు పైగా కేసులు బయటపడగా.. 108 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.    ఇటీవ‌ల జ‌రిగిన కుంభ‌మేళాపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. కుంభ‌మేళా కార‌ణంగా వేలాది మంది సాధువులు, భ‌క్తులు క‌రోనా బారిన ప‌డ్డారు. కొవిడ్ సంక్షోభం స‌మ‌యంలో కుంభ‌మేళా నిర్వ‌హించ‌డంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో.. మ‌ళ్లీ ఈ స‌మ‌యంలో చార్‌ధామ్ యాత్ర‌కు అనుమ‌తిస్తే క‌రోనా కేసులతో పాటు విమ‌ర్శ‌లూ మ‌రింత పెరుగుతాయ‌ని భావించింది ప్ర‌భుత్వం. ఈ ఏడాదికి చార్‌ధామ్ యాత్ర‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

జర్నలిస్టులపై కరోనా పంజా.. ప్రభుత్వాలకు లేదు కరుణ! 

కరోనా మహ్మమారి జర్నిలిస్టులను బలి తీసుకుంటోంది. గత పది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు 20 మంది వరకు జర్నలిస్టులు  ప్రాణాలు కోల్పోయారు. వీరిలో స్ట్రింగర్లు మాత్రమే కాదు… జిల్లా స్థాయి రిపోర్టర్లు .. సీనియర్ జర్నలిస్టులు.. డెస్క్‌లో పని చేసేవాళ్లు కూడా ఉన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారిలో సీనియర్ జర్నలిస్టులు అమర్‌నాథ్, శ్రీనాద్ కూడా ఉన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన అమర్ నాథ్.. కరోనాతో పది రోజుల పాటు పోరాడి నిమ్స్‌లో చనిపోయారు. మెదక్ జిల్లా ఈనాడు స్టాప్ రిపోర్టర్,  శ్రీకాకుళం ఎన్టీవీ రిపోర్టర్ , కడప జిల్లా సాక్షి రిపోర్టర్, కృష్ణా జిల్లాలో ఎన్టీవీ రిపోర్టర్, బతుకమ్మ టీవీ సీఈవో  ప్రాణాలు కోల్పోయారు. సాక్షి కడప జిల్లా స్టాఫర్ తో పాటు డెస్క్‌లో పని చేసే రామచంద్రరావు అనే సబ్ ఎడిటర్ కూడా కరోనా కారణంగా చనిపోయారు. మండల రిపోర్టర్లు వైరస్ భారీన పడి ప్రాణాలు వదిలారు. వందలాది మంది జర్నలిస్టులు కరోనా సోకి మృత్యువుతో పోరాడారు. కొందరు ఉన్న ఆస్తులన్ని అమ్మి ప్రాణాలు దక్కించుకున్నారు.ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో జర్నలిస్టులు మహ్మమారి భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.  జర్నలిస్టుల కోసం సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన అమర్‌నాథ్ చనిపోతేనే.. పెద్దగా ఎవరూ పట్టిచుకోలేదు. ఇతర జర్నలిస్టుల గురించి ఎవరు పట్టించుకుంటారు.ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం మానేశాయి. బతికి ఉండి.. పత్రిక కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే వారి అవసరం నేతలకు ఉంది. చనిపోయిన తర్వాత వారి గురించి పట్టించుకునే తీరిక కూడా నేతలకు లేదు. దీంతో జర్నలిస్టులు.. అంపశయ్యమీద ఉన్నట్లు అయింది. ఏపీలో జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏపీలో జర్నలిస్ట్ లకు అక్రిడేషన్స్ లేవు.. హెల్త్ కార్డ్స్ లేవు.. ఆరోగ్య భీమా.. ప్రమాద బీమా లేవు.. గత రెండేళ్లుగా కనీసం గుర్తింపు కూడా లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తే వారికి చికిత్స అందడం లేదు. అక్రిడేషన్లు లేకపోవడంతో కనీసం బస్ పాస్ కూడా ఏపీ జర్నలిస్టులకు లేకుండా పోయింది. అయినా వృత్తి పట్ల ఉన్న మక్కువ తో జర్నలిస్ట్ లు గానే బతుకు బండి సాగిస్తున్నారు. ఎలాగోలా బతుకు బండిని లాగుతున్న జర్నలిస్ట్ ల పాలిట కరోనా శాపంగా మారింది. మంత్రులు.. ముఖ్య మంత్రులు..అధికారులు.. ప్రోగ్రామ్స్ ను వారికంటే ముందుగా వెళ్లి గంటల తరబడి వేచి వుండి కవరేజ్ ఇచ్చే జర్నలిస్టులకు బతుకు కవరేజ్ కి గ్యారంటీ లేకుండా పోయింది.  ప్రాణాలు తెగించి పని చేస్తున్నా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కూడా జర్నలిస్ట్ లను గుర్తించడం లేదు. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే భరోసా కూడా జర్నలిస్ట్ లకు లేదు. కనీసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటే జర్నలిస్ట్ అంటే ఏ పాటి గౌరవం ఉందొ అర్ధం చేసుకోండి. పరుగులు పెట్టి.. పోటీ పడి న్యూస్ కవర్ చేసి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు కరోనా కాటుకు బలి అవుతున్న కనీసం స్పందన లేదు. జర్నలిస్ట్ ల కుటుంబాలకు రక్షణ.. ఆదరణ అసలే లేదు.. పాలకులారా.. మావైపు చూడండి.. ఏళ్ళ తరబడి మీకు సేవలు అందించిన జర్నలిస్ట్ లను కాపాడుకోండి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని విన్నవించుకుంటున్నాయి ఏపీ జర్నలిస్ట్ సంఘాలు.  తెలంగాణలోనూ అదే పరిస్థితి. హెల్త్ కార్డులు ఇచ్చినా అవి పని చేయడం లేదు. పెండింగ్ బిల్లులను సర్కార్ క్లియర్ చేయకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్లు జర్నిలిస్టు హెల్త్ కార్డులను తీసుకోవడం లేదు. కరోనా సమయంలో అసలు వాటిని చూడటం కూడా లేదు. దీంతో కరోనా సోకిన జర్నలిస్టులు చికిత్సకు డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారు. అంతంత జీతాలతో కాలం వెళ్లదీసే జర్నలిస్టులు లక్షలాది రూపాయలతో చికిత్స ఎలా తీసుకుంటారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతున్నా.. ప్రభుత్వాలు కాని, మీడియా యాజమాన్యాలు కాని పట్టించుకోవడం లేదు. విధులకు మాత్రం పంపిస్తున్నారు. ఇంతటి పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు కోవిడ్ హాస్పిటల్స్, టెస్టింగ్ సెంటర్ల దగ్గర రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు స్పందించి జర్నలిస్టుల బతుకులకు భరోసా కల్పించాలని సంఘాలు కోరుతున్నాయి. 

జైల్లో పెట్టినా.. చంపినా.. ప్ర‌శ్నిస్తూనే ఉంటా..

‘‘22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నామీద తప్పుడు కేసులు పెట్టి.. నా గొంతు నొక్కలేరు. నన్ను రాజమండ్రి జైలులో పెట్టినా.. చంపినా.. ప్రశ్నిస్తూనే ఉంటాను. పోరాడుతూనే ఉంటాను’’ అంటూ టీడీపీ సీనియ‌ర్ నేత‌ దేవినేని ఉమ మండిప‌డ్డారు.  సీఎం జగన్‌ మాటల మార్ఫింగ్‌ వీడియో కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో పోరాడతానని చెప్పారు.హైకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూ విచారణకు హాజరయ్యానని ఉమా అన్నారు.  ‘‘ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ, గుంటూరు ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలన్నారు ఉమా. ప్రభుత్వానికి మానవత్వం లేదు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. వ్యాక్సిన్ వేయించలేని పరిస్థితి ఉంది. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోని సీఎం.. పాలనను గాలికొదిలేశారంటూ దుయ్యబట్టారు దేవినేని ఉమా. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటి? అమూల్‌ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ప్ర‌యత్నం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు’’ అని దేవినేని మండిపడ్డారు. 

ప్రాణాలా? ఎన్నికలా? హైకోర్టు సీరియ‌స్‌..

ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? యుద్ధం వచ్చినా.. ఆకాశం విరిగి మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? శుక్ర‌వారంతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది.. వాట్ నెక్ట్స్‌? ఇలా.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని, తెలంగాన ప్ర‌భుత్వాన్ని ఓ రేంజ్‌లో క‌డిగిపారేసింది హైకోర్టు. స‌ర్కారు, ఎస్ఈసీ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ఎన్నిక‌లు, కొవిడ్ క‌ట్ట‌డి విష‌యంలో ఈ రెండు వ్య‌వ‌స్థ‌లూ పూర్తిగా వైఫ‌ల్యం చెందాయ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.  కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న మినీ పుర పోరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరునూ తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత చర్యలేంటని న్యాయస్థానం ప్రశ్నించగా.. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’’ అని సూచించింది.  మరోవైపు, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్‌ఈసీని ప్రశ్నించింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించినట్టు ఎస్‌ఈసీ అధికారులు తెలిపారు. దీంతో  కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది. అధికారులు కరోనా కట్టడిని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందంటూ మండిపడింది. ఎస్‌ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  తెలంగాణ‌లో రోజుకు 10వేల‌కు పైగా పాజిటివ్ కేసులు వ‌స్తున్న త‌రుణంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో కేసుల సంఖ్య మ‌రింత భారీగా పెరుగుతోంది. లాక్‌డౌన్ పెట్టాల్సిన ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు పెట్ట‌డం వ‌ల్లే.. క‌రోనా విజృంభిస్తోంద‌ని అంటున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా.. న్యాయ‌స్థానం సైతం క‌రోనా క‌ల్లోలంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై తీవ్ర స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. ఘాటైన విమ‌ర్శ‌లు చేసింది. 

రిజైన్​ మోడీ హాష్​ ట్యాగ్​ బ్లాక్.. ​పొరపాటు జరిగిందన్న ఫేస్ బుక్ 

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా సోకి చికిత్స అందక జనాలు చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరతతో పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరోనా కట్టడిలో కేంద్ర సర్కార్ విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో  #ResignModi అంటూ హాష్ ట్యాగ్  వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది. అయితే  #ResignModi హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దానిపై విమర్శలు రావడంతో ఫేస్ బుక్ స్పందించింది. పొరపాటున జరిగిందంటూ ప్రకటించింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని స్పష్టం చేసింది. కొన్ని పోస్టులు తమ కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడి లేవని, అందుకే వాటిని బ్లాక్ చేశామని తెలిపింది. రిజైన్ మోదీ హ్యాష్‌ట్యాగ్‌ పొరపాటున బ్లాక్ అయిందని, అది బ్లాక్ అవడానికి కారణం ప్రభుత్వ ఆదేశాలు కాదని ఫేస్‌బుక్ పేర్కొంది. పీరియాడికల్‌గా హ్యాష్‌ట్యాగ్‌లను బ్లాక్ చేస్తామని, దీనికి చాలా కారణాలు ఉంటాయని తెలిపింది. కొన్నిటిని మానవ ప్రమేయంతో బ్లాక్ చేస్తామని, చాలావాటిని ఆటోమేటెడ్ ఇంటర్నల్ గైడ్‌లైన్స్ ఆధారంగా బ్లాక్ చేస్తామని వివరించింది. లేబుల్‌కు సంబంధించిన కంటెంట్ వల్ల ఈ పొరపాటు జరిగిందని, స్వయంగా ఆ హ్యాష్‌ట్యాగ్ అందుకు కారణం కాదని పేర్కొంది.    కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు విమర్శిస్తున్నారు. తీవ్రమైన ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వంటి వాటి నేపథ్యంలోనే వారు ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ హాష్ ట్యాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో #ResignModi హ్యాష్ ట్యాగ్ బ్లాక్ కావడం చర్చగా మారింది. కేంద్ర సర్కార్ ఆదేశాల వల్లే ఫేస్ బుక్ అలా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే కేవలం భారత్ లో మాత్రమే వాటిని నిషేధించింది. దాదాపు 3 గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. అయితే  బ్లాక్ చేసిన ఆ కొద్ది సేపూ విదేశాల్లో ఆ పోస్టులు యథావిధిగా కనిపించాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ట్విట్టర్ కూడా పలువురి ట్వీట్లను తొలగించింది. అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కొన్ని రోజుల పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్టాగ్రామ్ బ్లాక్ చేశాయి. ఇండియాలోనూ రైతుల ఉద్యమంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను బ్లాక్ చేశారు. మోడీ సర్కార్ ఆదేశాల వల్లే అలా జరిగిందని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. రైతుల ఉద్యమం చాటున సంఘ విద్రోహ శక్తులు చేరారనే ఆరోపణలు రావడం వల్లే కేంద్రం అలా చేసిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఉప్పెనలా విరుచుకుపడుతున్న కొవిడ్ మహ్మమారి విషయంలో ప్రజలను గందరగోళంలో పడేసేలా ఉంటున్న పోస్టులను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా మాద్యమాలను కేంద్ర సర్కార్ కోరి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం #ResignModi హాష్ ట్యాగ్ ను బ్లాక్ చేయడంపై మండిపడుతున్నాయి. ప్రజా వ్యతిరేకతను దాచాలని మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.  #రిజైన్‌మోడీ హాష్ ట్యాగ్ వివాదంపై కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. బ్లాక్ చేయాలని ఫేస్‌బుక్‌ను కోరలేదని  స్పష్టం చేసింది. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రికలో ప్రచురితమైన కథనాలు దురుద్దేశంతో కూడినవని మండిపడింది.  ఫేస్‌బుక్ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించడాన్ని ప్రజల అసమ్మతిని అణచివేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా పేర్కొంటూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనం యథార్థాల విషయంలో తప్పుదోవపట్టించడం, దురుద్దేశపూరితమని పేర్కొంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించాలని కోరుతూ ఎటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున బ్లాక్ చేసినట్లు ఫేస్‌బుక్ ప్రకటించిందని గుర్తు చేసింది.  2021 మార్చి 5న కూడా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ బూటకపు వార్తను ప్రచురించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫేస్‌బుక్‌, ట్విటర్, వాట్సాప్ ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తామని భారత ప్రభుత్వం బెదిరిస్తోందని ఓ బూటకపు వార్తను ప్రచురించిందని తెలిపింది. ఇది పూర్తిగా బూటకపు, కల్పిత వార్త అని అధికారికంగా ఆ పత్రికకు తెలియజేసినట్లు పేర్కొంది.   

టెస్ట్ కి వచ్చి.. మృతి చెందిన వ్యక్తి.. 

అది యాదాద్రి భువనగిరి జిల్లా.  చౌటుప్పల్ సామాజిక ఆరోగ్య కేంద్రం. ఉదయం సమయం పది గంటలు. ఒక  వ్యక్తి నడుచుకుంటూ  ఆసుపత్రి గేట్ లోకి ఎంటర్ అయ్యాడు. సడన్ గా ఏమైందో ఏదో ఆ వ్యక్తి కింద పడ్డాడు. ఆ తర్వాత అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా ఆసుపత్రి  ఏరియా అంతా  కలకలం రేపుతోంది. ఈరోజు ఉదయం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి నడుచుకుంటూ వస్తూ ఆకస్మాత్తుగా కిందపడిపోయి.. ఓ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ వెల్లడించారు. ఆ వ్యక్తి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిస్థితి విషమించడం వలనే ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.