మోదీకి మద్దతు తెలిపింది.. మొగుడు తలాక్ తలాక్ తలాక్ అన్నాడు!
posted on Jul 29, 2022 @ 10:55PM
కొందరికి సినీ స్టార్ల పిచ్చి ఉంటుంది, మరికొందరికి క్రికెటర్ల పిచ్చ, ఇంకొందరికి రాజకీయనాయకుల పిచ్చ. పోనీ దీన్నే వీరాభి మానం అందాం. ఈ వీరాభిమానం మరీ రక్తంలోకి ఎక్కించుకుంటేనే ఇబ్బంది. ఆ స్టార్ సినిమా చూడకపోతే నిద్రపట్టదని, ఆ క్రికెట్ స్టార్ కనీసం హాఫ్ సెంచరీ కొట్టకపోతే తిండిమానేస్తాననడం, తమ నాయకుడు గెలవకపోతే కిరోసిన్ పోసుకుంటానని గోల చేయడం వంటివి వీరాభిమానానికి మించిన అభిమానం. అయితే దీనికి పరిమితి ఉంటుందనే నమ్మకమూ లేదు. ఈ అపరిమిత వీరాభిమానం ఒక్కోసారి జీవితాల్ని సమస్యల సుడిగుండంలోకి తోసేస్తుంది.
కానీ ఆలస్యంగా దాని ప్రభావం తెలుస్తుంది. ఒక నాయకుడంటే అభిమానం ఉండడంలో తప్పులేదు. కానీ వాస్తవ పరిస్థితుల అనుసరించి దాన్ని కొంత పరిమితిలో ఉంచుకోవాలి. పాపం షరా ఇరం కి ఈ సంగతి తెలియలేదు. ఆమె చేసిన తప్పు ప్రధాని మోదీకి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కూ తన మద్దతు తెలియజేయడం. అందులో తప్పేమిటో ఆమె భర్తకే తెలియాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇవ్వన పుడు కాపురం సక్రమంగా సాగదు. ప్రతీ విషయాన్ని తన ఆలోచనా అద్దాలతో చూస్తే విభేదాలు తారస్థాయికి వెళతాయి. ఇలాం టిదే ఆమెకు అనుభవం అయింది. మోడీకి మద్దతు తెలిపిన ఫలితంగా ఆమెకు భర్త త్రిబుల్ తలాక్ చెప్పేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పీఎం మోడీ, సీఎం ఆదిత్యనాథ్‌కి ఓటు వేయడం తో భర్త, అత్తింటి వాళ్లు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మార్చి 3న ఎఫ్‌ఐఆర్ నమోద య్యిందని పోలీసులు తెలిపారు. మొరదాబాద్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయిందని, దర్యాప్తు జరుపుతున్నా మని వెల్లడించారు. బాధితురాలి పేరు షనా ఇరం. కాగా ఈమెను డిసెంబర్ 2019లో మొహమ్మద్ నదీమ్ పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు.
తాను మోదీకి మద్దతిస్తున్న విషయాన్ని పెళ్లైన తర్వాత తెలుసుకుని ఈ హింసకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. త్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తనకు చెప్పాడని ఫిర్యాదులో వెల్లడించింది. భర్త తోబుట్టవులు కొన్ని రోజు లుగా తనను హింసిస్తున్నారని పేర్కొంది. దీంతో ఐపీసీ 376, 511 సెక్షన్ల కింది నిందితులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిలేష్ భదోరియా వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు.