30ఏళ్ల క్రితం మృతి.. ఇటీవలే పెళ్లి!
posted on Jul 30, 2022 @ 10:01AM
పిల్లలకు పెళ్లిచేసి కలకాలం సుఖంగా, ఆయురారోగ్యాలతో ఉండాలనే సమస్తం దీవిస్తారు. ఇదే మన సంప్రదాయం. అందులో ఆ రెండు కుటుంబాలే కాదు బంధువర్గం, స్నేహితులూ, హితులూ, కాస్తంత పరిచయం ఉన్న చుట్టుపక్కలవారూ ఒకవిధంగా భాగస్వాములే. వారి ఆనందాన్ని కళ్లారా చూడాలనే అనుకుంటారు.
అయితే కన్నడ సంప్రదాయంలో మరో విచిత్ర సంప్రదాయం కూడా ఉంది. అది తెలిస్తే ఆశ్చర్య పోతారు. వధూవరులిద్దరూ సుమారు 30 సంవత్సరాలక్రితం మరణించారు, అయినప్పటికీ వారి కుటుం బ సభ్యులు వారికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అదీ వారి బంధం!
అనిల్ అనే వ్యక్తి స్నేహితుడి పిలుపుతో ఒక పెళ్లికి హాజరయ్యాడు. తీరా చూస్తే పెళ్లి హడావుడి తక్కువగా అనిపించింది. అసలు ఘట్టం ఆరంభానికి ఇంకా సమయం ఉందనుకున్నాడు. తర్వాత కొంతసేపటికి అసలు సంగతి తెలిసి ఖంగారుపడ్డాడు. ఆ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చనిపోయి 30ఏళ్లయిందిట! కానీ వారికి ఇప్పటికీ ఆ పెళ్లిరోజున పెళ్లి తంతు చేయడం దక్షిణ కన్నడ సంప్రదాయమని తెలిసి అతనికి నోట మాట రాలేదు. ఇక్కడ మరణించిన వధూవరుల కుటుంబాలు పాల్గొంటాయి. అయితే పిల్లల్ని మాత్రం అనుమతించరు.
ప్రసవ సమయంలో మరణించిన వారికి, వారు సాధారణంగా ప్రసవ సమయం లో మర ణించిన మరొక బిడ్డకు వివాహం చేస్తారు. అన్ని ఆచారాలు ఏ వివాహమైనట్లే జరుగుతాయి. నిశ్చితార్థం కోసం రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్తారు. ఇది వేడుకకు తక్కువ కాదు. ఇది ఒక నిరాడంబ రమైన వ్యవ హారం కాదు. పెళ్లి బరాత్ కూడా పెద్ద స్థాయిలో చేశారు. ఇది నిజమా అబద్ధమా అంటే ఆ ప్రాంతా నికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. కొన్ని సంప్రదాయాలు ఇలా చిత్రంగానే ఉంటాయి. ఎవరి నమ్మకాలు వారివి.