వాన్ పిక్ కేసును కోర్టు నిజంగానే కొట్టేసిందా?
posted on Jul 29, 2022 @ 9:02PM
వాన్ పిక్ కేసు కోర్టు కొట్టివేసిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతుంటే అదే నిజమైపోతుందా? ఆవును కొనుక్కు తీసుకు వెళుతున్న వ్యక్తికి నలుగురు దొంగలు ఒకరి తరువాత ఒకరు అది ఆవు కాదు కుక్క అంటూ చెప్పేసరికి నిజమని నమ్మినా ఆయన దానికి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని ఓ కథ ఉంది.
ఇప్పుడు వాన్ పిక్ విషయంలో సాంకేతిక కారణంపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మొత్తం వాన్ పిక్ కేసునే కోర్టు కొట్టివేసిందని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చినంత మాత్రాన ఆ కేసు కొట్టేసినట్లు అవుతుందా? ఇక వాన్ పిక్ క్విడ్ ప్రొకో కేసు విచారణ కోర్టులో జరగదా? అన్న సందేహాలు ఎవరికైనా వచ్చి తీరుతాయి.
నిజానికి వాన్ పిక్ కేసులో కోర్టు ఇచ్చిన ఉత్వర్వులు దేనికి సంబంధించిని అంటే ఆ కేసు నుంచి వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కంపెనీ పేరును తొలగింపునకు సంబంధించి మత్రమే. అంతే కాని వాన్ పిక్ క్విడ్ ప్రొకో కేసు అలాగే ఉంది. ఆ కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్ కి కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఊరటా లభించేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వ లేదు. క్విడ్ ప్రొకో కేసులో వాన్ పిక్ చైర్మన్ నిందితుడుగా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీని నిందుతుల జాబితాలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
అందుకే కంపెనీ పేరు తొలగించాలంటూ వాన్ పిక్ వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు అనుమంతి ఆ కంపెనీ పేరును నిందితుల జాబితా నుంచి తొలగించింది. వాన్ పిక్ కంపెనీ పేరును నిందితుల జాబితా నుంచి తొలగించినంత మాత్రాన కేసు మొత్తం కొట్టివేసినట్లు అవ్వదు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులపై విచారణ కొనసాగుతుంది.
అంతే కానీ కేసు మొత్తాన్ని కొట్టి వేయలేదు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సీఎం జగనమోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా వాన్ పిక్ స్కాంలో ఉన్న వారందరిపై విచారణ కొనసాగుతుంది.