మునుగోడు ‘మరో చరిత్ర’ సృష్టిస్తుందా?

గత ఏడాది (2021)  అక్టోబర్ మాసంలో  జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక చరిత్రను సృష్టింది. అలాగే, ఈ సంవత్సరం చివర్లో  జరిగే మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు రంగం  సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హుజురాబాద్ చరిత్రను మునుగోడు తిరగ రాస్తుందా? మరో చరిత్రను సృష్టిస్తుందా? ఇప్పుదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.    నో ... నో... మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఎన్నికల ఫలితాల గురించి కాదు. హుజూరాబాద్ ఫలితం మునుగోడులో పునరావృతం అవుతుందా, కాదా అని అసలే కాదు.  ఓటర్ల చైతన్యం గురించి అంతకంటే కాదు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరక గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయింది.   హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాల ఇన్ని కోట్లని చెప్పలేము. తక్కువలో తక్కువ ఒక వెయ్యి కోట్ల పైమాటగానే, చెప్పుకుంటున్నారు. కానీ, శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలలో  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, అధికారిక గణాంకాలే సూచిస్తున్నాయని అంటున్నారు.  ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల విషయం అయితే చెప్పనక్కరలేదు. అవును అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేశారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు కోట్లలో కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం జరిగింది.  కాబట్టే, హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ‘అత్యంత’ఖరీదైన ఉప ఎన్నికగా చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన, కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు తెరాస నాయకులను బహిరంగంగా నిల దీశారు. ధర్నాలు చేశారు. ఇది కూడా, హుజురాబాద్ ఉప ఎన్నిక సృష్టించిన మరో  ‘చరిత్ర’.  నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత, రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు కోరుకున్నారు. నిజానికి, ఒక హుజూరాబాద్ అనే కాదు, హుజూరాబాద్   మోతాదు లో కాకున్నా, ఉప ఎన్నికలు జరిగిన అన్ని నియోజక వర్గాల్లోనూ తెరాస ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు తీయించింది. తెరాస  రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు నియోజక వర్గాల్లోనూ  ప్రభుత్వం, అధికార పార్టీ  ఆకాశమే హద్దు అన్న విధంగా నిధులను ఖర్చు చేయడం జరిగింది. అఫ్కోర్స్, హుజూరాబాద్ ను ముఖ్యమంత్రి ఇజ్జత్ కి సవాల్ గా  తీసుకున్నారు కాబట్టి  అక్కడ మోతాదు మరింతగా పెరిగింది. ఫ్యామిలీకి పదిలక్షలు ఇచ్చే దళిత బంధు పథకం అనివార్యంగా బయటకు వచ్చింది.  సరే, అదలా ఉంచి మళ్ళీ మనం, మన మునుగోడు... విషయానికి వస్తే,హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం, అధికార పార్టీ కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. అయితే, కొత్త పథకాల జోలికి వెళ్లకుండా పాత పెండింగ్ లో ఉన్న పెన్షన్లు, మండలాల ఏర్పాటు, ఇప్పటికే నిధులు మంజూరై పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను కానిచ్చేయడం, అవసరమనుకున్న చోటే అభివృద్ధి పనులను చేయడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా హుజూరాబాద్ లో ఎదురైన పరాభవం ఒక కారణం అయితే, మూడేళ్ళుగా అభివృద్ధికి నోచుకోని నియోజక వర్గంలో ఎంతో కొంత అభివృద్ధి సాధించేందుకే రాజీనామా చేస్తున్నానని, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి చేస్తున్న చేస్తున్న ప్రచారానికి భయపడి, అధికార తెరాస ప్రస్తుతానికి అయితే కొంత ముందు చూపుతో, మెల్ల మెల్లగా అడుగులు వేస్తోందని అంటున్నారు.  అయితే, మునుగోడు ఓటర్లు మాత్రం, ఉప ఎన్నికపై  చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల విషయం ఎలా ఉన్నా, తెరాస, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా పోటీలో ఉన్న నేపధ్యంలో ఓటు రేటు భారీగా పెరుగుతున్నదని, ఓటర్లు లెక్కలు వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.  దీంతో ఈ నియోజకవర్గానికి చెందిన, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారందరి దృష్టి ఇప్పుడు మునుగోడుపై పడింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వారంతా మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా తమ ఓటును బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటిదాకా ఓటు హక్కు రానివారు కూడా పెద్ద సంఖ్యలో ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 2 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి 13 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.  మరో వంక నియోజక వర్గం పరిధిలో, మద్యం ఘుమఘుమలు ఇప్పటికే మొదలయ్యాయి నియోజకవర్గానికి సమీప మండలాల్లోనూ మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆగస్టు 1 నుంచి 29వ తేదీ వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.43.19 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫంక్షన్‌ హాళ్లను తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల్లో పార్టీల ఫిరాయింపు బేరసారాలతో రాత్రివేళ అధిక సంఖ్యలో మద్యం సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. అయితే, హుజురాబాద్ తో మునుగోడు పోటీ పడుతుందా? హుజూరాబాద్ మలిన చరిత్రను మునుగోడు చెరిపేస్తుందా? ఇంకా ఎక్కువ చేస్తుందా, అంటే, పరిశీలకులు  చూడాలి మరి ..అంటున్నారు.

టీ20 కి బై చెప్పిన బంగ్లా వికెట్‌కీప‌ర్‌ ముష్ఫికర్

బంగ్లాదేశ్ వికెట్కీపర్ ముష్ఫికర్ రహీమ్ సోమవారం టీ20 అంత ర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెం ట్‌ను అధికారికంగా ప్రకటిం చాడు. రహీమ్ మిగతా ఫార్మా ట్లలో కూడా ఆడనున్నా డు. ర‌హీమ్ వికెట్ కీప‌ర్‌గా, బ్యాట్స్‌ మ‌న్‌గా బంగ్లాదేశ్‌కు అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తున్నాడు. బంగ్ల‌దే శ్  క్రికెట్ విజ‌యాల్లో అత‌ని పాత్ర ఎన్న‌ద‌గిన‌ది. ర‌హీమ్ 2006లో టీ20టోర్నీల్లోకి వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి 15 ఏళ్ల కెరీర్‌లో 102  టీ20 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.  ముష్ఫికర్ రహీమ్ ఆ ట్వీట్‌లో, టెస్టులు, వన్డేలపై దృష్టి పెట్టాలనుకుంటున్నందున పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కారణాన్ని వివరించాడు. ఫలితంగా, ప్రారంభ ఎడిషన్ నుండి ప్రతి టీ 20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ముష్ఫికర్ రహీమ్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే మార్క్యూ ఈవెంట్‌కు అందుబాటులో ఉండడు. ముష్ఫికర్ ఇలా వ్రాశాడు, నా సుదీర్ఘ కెరీర్‌లో మీరందరూ నా పక్కన ఉన్నందుకు నేను కృతజ్ఞుడను. త‌న గరిష్ఠ స్థాయిలలో మీ మద్దతు  స్ఫూ ర్తిగా నిలిచింద‌ని ట్విట‌ర్ పోస్టులో పేర్కొన్నాడు. 2022 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ తమ పేర్లపై విజయం సాధించకుండానే నిష్క్రమించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. రహీమ్ తన అధికా రిక ట్విట్టర్ ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు . ఆటలోని ఇతర రెండు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించడా నికి ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. తాను టీ20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నాను కానీ  టెస్ట్  వ‌న్డే ఫార్మాట్‌లపై దృష్టి పెట్టాలను కుంటున్నానన్నాడు.  అవకాశం వచ్చినప్పుడు తాను ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడటానికి అందుబాటులో ఉంటాన‌న్నాడు. రెండు ఫార్మా ట్లలో త‌న‌ దేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించడానికి ఎదురుచూస్తున్నానని రహీమ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

భూ పోరులో అలిసి ఒరిగిన రైతు

త‌న రెండ‌క‌రాల భూమిని ర‌క్షించుకోవ‌డానికి ఒక‌టి రెండు కాదు ఏకంగా అయిదేళ్లు పోరా డాడు ఆ రైతు. న్యాయ‌స్థానం కూడా అది అత‌నిదేన‌న్న‌ది. కానీ తహ‌సీల్దార్ కార్యాల‌యం మాత్రం నిరాక‌రించింది. గ‌త అయిదేళ్లుగా కార్యాల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూనే ఉన్నాడు,అధికారులను బ‌తిమా లుతూనే ఉన్నాడు. ఆఖ‌రికి క‌లె క్ట‌ర్‌, ఆర్డీఓల‌నీ ప‌ట్టించుకోని ఆ త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ద‌గ్గ‌ర దీక్షచేస్తూ అల‌సి ప్రాణం విడిచాడు.   చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీలోని 918-4 సర్వే నంబరులోని 2.52 ఎకరాల ఫారెస్టు భూమి... ఇదే గ్రామానికి చెందిన రత్నం బోయెడు (70) పూర్వీకుల స్వాధీనంలో ఉండేది. ఈ భూమిపై రత్నం బోయెడుకు హక్కు కల్పిస్తూ.. 1973లో ప్రభుత్వం ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చింది. ఈ భూమిలో రత్నం పండ్ల చెట్లు సాగుచేస్తూ చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుని అక్కడే నివ సిస్తున్నాడు. ఈ భూమి రోడ్డుకు దగ్గరగా ఉండటం.. రత్నంతో తిమ్మిరాజు కండ్రిగ గ్రామస్థులకు గొడవలు ఉండటంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 1981లో భూమిలోని చెట్లను, షెడ్డును ధ్వంసం చేశారు. ఆ భూమిలో ఇళ్లు వేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై రత్నం కోర్టుకు వెళ్లడంతో.. అతడికి పర్మినెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అధికారులకు చూపి, భూమిపై తనకు పూర్తి హక్కులు కల్పించి, గ్రామస్థుల ఆక్రమణలను అడ్డుకోవాలని కోరినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యా లయం వరకూ తిరుగుతూ అర్జీలు ఇస్తూనే ఉన్నాడు.  మరోవైపు  ఆ భూమిలో గ్రామస్థులు ఇళ్లు కూడా వేసుకున్నారు. తన భూమి నుంచి వారిని ఖాళీ చేయించాలని, గ్రామస్థులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రత్నం మళ్లీ కోర్టుకు వెళ్లారు. మరోవైపు 2002 ఆగస్టు 22న తన భూమిలో ఉన్న ఇళ్లను జేసీబీతో కూల్చివేసేందుకు రైతు ప్రయత్నించగా.. వీఆర్వో వెళ్లి అడ్డుకున్నాడు. ‘కోర్టులో కేసు వేశావుగా. అక్కడే తేల్చుకో’ అని చెప్పి రైతు ప్రయత్నాలకు అడ్డం తగిలారు. అధికారుల అండతో రెచ్చిపోయిన గ్రామస్థులు అక్కడ మరో నాలుగు ఇళ్లు వేసుకోవడమేగాకుండా.. 30వ తేదీన వినాయకుడి విగ్రహం కూడా పెట్టి ఉత్సవాలు ప్రారంభిం చారు. మరోవైపు అధికారులు కూడా ఆ భూమి ఆక్రమణకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలోనే సచివాలయాన్ని నిర్మించారు. రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి కూడా సన్నద్ధమయ్యారు.   తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ శుక్రవారం నుంచి తహ సీల్దార్‌ కార్యాలయం ముందు దీక్షకు దిగాడు. శుక్రవారం రాత్రి అక్కడే పడుకున్నాడు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చు కుని కార్యాలయం ముందే కూర్చున్న రైతు రత్నంను అధికారులు పిలిపించారు. ఆందోళన విరమించి వెళ్లిపోవాలని హెచ్చరించ గా.. న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటానని, ఇళ్లు కూలుస్తుంటే తనను అడ్డుకున్న అధికారులు.. వినాయకుడి విగ్రహం పెట్టి, వాళ్లు కొత్తగా ఇళ్లు వేసుకుంటుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. వారిని ప్రశ్నిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. రెవెన్యూ సిబ్బంది పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి రత్నంను తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. న్యాయం చేసేవరకూ కదలంరత్నం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వడ్డెర సంఘం, టీడీపీ, జనసేన నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేసేవరకు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లబోమని ఆయన బిడ్డలు తెగేసి చెప్పారు. జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశాలతో చిత్తూరు ఆర్డీవో రేణుక తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని రత్నం కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ కూడా వారితో మాట్లాడారు.

బౌల‌ర్ల గురించి ద్రావిడ్ స‌ర‌దా క‌బుర్లు

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో జట్టు కు ఉన్న బౌలింగ్ ఎంపిక లపై భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతృప్తి చెందాడు. మేము గ్లామర్‌గా కనిపించక పోవచ్చు, కానీ ఫలితాలను అందించే కుర్రాళ్లను  పొందామని చెప్పాడు. ఆసియా కప్ 2022 లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు మొత్తం ప‌ది వికెట్లు తీయడానికి సంచ లన ప్రదర్శన చేశారు. ప్రస్తుత జరుగుతున్న ఆసియా కప్ లో జస్ప్రీత్ బుమ్రా, మహ మ్మద్ షమీ, హర్షల్ పటేల్ వంటి ప్రీమియర్ పేసర్ల సేవలు టీమ్ ఇండియాకు లేకుండా పోయినప్పటికీ, భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అందుబాటులో ఉన్న ఎంపికయిన కుర్రాళ్ల‌తో సంతోషంగా ఉన్నాడు. 2022 ఆసియా కప్‌లో, టీమ్ ఇండియా ముగ్గురు పేసర్లు భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లతో ఉంది, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌, య‌జువేంద్ర‌ చాహల్‌లలో చాలా పూర్తిస్థాయి స్పిన్న‌ర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా జట్టులో భాగమే, మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా ఆడాడు, కానీ ఇప్పుడు మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడు. అతను రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరంగా ఉండబోతున్నాడ‌నీ ద్రావిడ్ అన్నాడు. జడేజా స్థానంలో, మెన్ ఇన్ బ్లూ కి అక్షర్ పటేల్‌ను భర్తీ చేసింది. మాజీ చెన్నై సూపర్ కింగ్స్ సారథి వలె, అక్షర్ కూడా ఎడమ చేతి వాటం బ్యాటర్, అతను కూడా చాలా సులభ స్పిన్ బౌలింగ్ ఎంపిక. ఈ సంవత్సరం ఆసియా కప్‌లోని మొదటి మ్యాచ్‌లో, భారత్‌ దుబాయ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ఆ గేమ్‌లో, భారత పేసర్లు వారి పాకిస్తాన్ ప్రత్యర్ధులను అధిగమించారు. వాస్తవా నికి, టీ 20 మ్యాచ్‌ల చరిత్రలో మొదటిసారి, అంతేగాక వారు మొత్తం 10 వికెట్లు తీయ‌డం గ‌మ‌నార్హ‌మ‌న్నాడు కోచ్‌. సూపర్ ఫోర్ దశలోని వారి మొదటి మ్యాచ్‌లో జట్లు ఆదివారం (సెప్టెంబర్ 4) ఒకదానితో ఒకటి తలపడనున్నాయి, ఆట ముందు, భారత ప్రధాన కోచ్ ద్రవిడ్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉల్లాసమైన క్షణాన్ని అందించాడు. అతను టీమ్ ఇండియా దాడిని వివరించడానికి ఒక ఆసక్తికరమైన పద్ధతిని ఉపయోగించాడు. అతను భారత బౌలర్లను పాకిస్తాన్ బౌలర్ల వలె సెక్సీగా వర్ణించడానికి  ప్రయత్నించాడు, అయినప్పటికీ ఉత్సాహంగా ఉన్నా డు. ద్రావిడ్‌ ఆ పదాన్ని తాను ఉపయోగించకపోయినా అక్కడ ఉన్న విలేకరులు మాత్రం ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుని నవ్వులు పూయించారు. భారత కోచ్ తన బౌలర్లకు వారి సహచరులకు సమానమైన పేస్ ఉండకపోవచ్చని, కానీ వారు ఎంతో ప్ర‌భావం చూపుతారని, అదే ముఖ్యం అని సూచించాడు. తాను ఆ పదాన్ని ఉపయోగించాలనుకున్నానని, కానీ తాను ఆ పదాన్ని ఉపయోగించలేన‌ని,  మనస్సులోనిది నోటి నుండి వస్తుంది, కానీ తాను దానిని ఉపయోగించలేన‌న్నాడు.  చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే.. అది  ఆంగ్ల ఎస్ అక్ష‌రంతో మొదలయ్యే నాలుగు అక్షరాల పదం. అయినాసరే.  గ్లామర్‌గా కనిపించకపోవచ్చు, కానీ ఫలితాలను ఇచ్చే కుర్రాళ్లను కలిగి ఉన్నామని ద్రవిడ్ చెప్పాడు.  మెన్ ఇన్ బ్లూ వలె, మెన్ ఇన్ గ్రీన్ కూడా ఆసియా కప్‌లో వారి పేస్ స్పియర్‌హెడ్ షాహీన్ షా అఫ్రిది సేవలు లేకుండానే ఉంది. అతను లేనప్పుడు, హరీస్ రవూఫ్ యువ నసీమ్ షా, షానవాజ్ ధని, మహ్మద్ హస్నైన్ , హసన్ అలీ సహాయంతో దాడికి నాయకత్వం వహిస్తున్నాడు. భారత్‌తో జరిగే సూపర్4 గేమ్‌లో ధని నిష్క్రమించినందున, హసన్ అలీ లేదా హస్నైన్‌ లలో ఒకరు ప్లేయింగ్ లెవెన్‌లోకి వ‌స్తారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో  జ‌డేజా ఆడ‌డేమో!

అత‌ను జ‌ట్టులో ఉంటే ఏదో విధంగా గెలుస్తామ‌న్న న‌మ్మ‌కం క‌లుగుతుంది, అత‌ను జ‌ట్టులో ఉంటే ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ ఇబ్బంది ప‌డతాడు, అత‌ను ఫీల్డింగ్ చేస్తుంటే ఫోర్లు ఆగిపోతాయి, సిక్స్‌ల‌కు అవ‌కాశం ఉండ‌దు. అత‌ను బౌల‌ర్‌గా బ్యాట‌ర్‌ను ముప్ప‌ తిప్ప లు పెట్టగ‌ల‌డు. భార‌త్ క్రికెట్ జ‌ట్టుకు అత‌ను ఎంతో వెన్నుద‌న్ను. అత‌నే ర‌వీంద్ర జ‌డేజా అనే జ‌ద్దు!    అత‌ని కుడిమోకాలికి గాయ‌మ‌యింది. శ‌స్త్ర‌చికిత్స అనివార్య‌మైంది. అందుకే ఆసియాక‌ప్ మిగ‌తా మ్యాచ్‌ల‌కు దూర‌మ‌ య్యాడు. అత‌ను త్వ‌ర‌లో జ‌ట్టులోకి తిరిగి రావాల‌ని, ఫైన‌ల్ లో భార‌త్‌ను గెలిపించే  భార‌త్ స్టార్స్‌లో  అత‌ని పాత్ర కీల‌క‌మ‌ని అంద‌రూ ఎంతో ఆశించారు. కానీ శ‌స్త్ర‌చికిత్స త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో అత‌ను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు అన్నారు. ప్ర‌స్తుత ఆసియాక‌ప్‌కి అలా దూర‌మ‌య్యాడు. కానీ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌నకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇది జ‌డేజా వీరాభిమానుల‌ను బాధిస్తోంది.  ఆసియా కప్‌లో పాకిస్థాన్‌, హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లలో జడేజా మెరుగైన ప్రదర్శనతో జట్టులో సమతూకం తీసుకు వచ్చా డు. ఇలాంటి ఆటగాడు ప్రపంచకప్‌ టీమ్‌లో లేకపోనుండడం రోహిత్‌ అండ్‌ కోకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. టీమ్​ ఇండియా కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటికే కుడి మోకాలి నొప్పితో బాధపడుతూ ఆసియా కప్‌టోర్నీకి దూరమయ్యాడు స్టార్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా. అతడి అంతర్జాతీయ పునరాగమనం గురించి ఎన్‌సీఏ వైద్య బృందం స్పష్టత ఇవ్వలేదు. రానున్న మూడు నెలలు అతడు క్రికెట్ కు దూరమయ్యే అవకాశాలున్నాయ‌ని బీసీసీఐ సీనియర్‌ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే.. ప్రపంచకప్​కు ఇంకా చాలా సమయం ఉందని.. జడేజాపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని స్పష్టం చేశాడు టీమ్​ ఇండియా కోచ్​ రాహుల్​ ద్రవిడ్​. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్నాడు.ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్ల త‌ర్వాత‌ మోకాలి గాయం కారణంగా అతడు ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా..బౌలింగ్‌లో కీలక వికెట్‌ తీశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఉత్తమ సేవలందించే ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ పెద్ద టోర్నీకి దూరమవడం టీమ్‌ఇండియాకు పెద్దలోటే.

ప‌వ‌ర్ టెన్నిస్ మారు పేరు  సెరెనా విలియ‌మ్స్‌

టెన్నిస్ అన‌గానే ఖ‌రీద‌యిన ఆట‌గా భావించ‌డంతో పాటు అది మ‌గాళ్లకే సంబంధించిన‌ద‌న్న ఆలోచ‌న క్రీడాలోకంలో ప్ర‌చారంలో ఉంది. అలాంటి ఆలోచ‌న‌లు, భ్ర‌మ‌ల‌కూ తెర‌దింపి త‌న స‌త్తాతో టెన్నిస్‌లో మ‌హిళ‌లేమీ త‌క్కువ‌కార‌ని, ముఖ్యంగా త‌న‌కు మిం చిన ప్లేయ‌ర్ ఉండ‌ర‌ని తానే ఆట‌తీరుతో, స్ప‌ష్ట‌మైన అభిప్రాయంతో క్రీడాలోకానికి తెలియ‌జేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప్ర‌పంచ ప్ర‌ముఖ క్రీడాకారిణి సెరెనా విలియ‌మ్స్. టెన్నిస్ అన‌గానే తెల్ల‌వాళ్ల ఆట‌గానే ప‌రిగ‌ణించే భావజాలానికి అడ్డుక‌ట్ట వేసిన మేలిమి బంగారం సెరినా విలియ‌మ్స్‌. రాకెట్ ప‌ట్టుకుని కోర్టులోకి వ‌స్తోంద‌నే ప్ర‌క‌ట‌న‌తోనే స్టేడియాలో ప్రేక్ష‌కులంతా ఒక్క‌సారిగా ఎల‌ర్ట్ అయి ఆమెనే చూస్తుండిపోతారు. మెలితిరిగిన కండ‌రాల‌తో, విజేత ల‌క్ష‌ణాల‌తో, ప్ర‌త్య‌ర్ధి ఎవ‌ర‌యినా ఎంత‌టివార‌యినా ఏమాత్రం కాస్తంతయినా భ‌య‌ప‌డని, భ‌య‌పెట్టేంత ప‌వ‌ర్ స్ట్రోక్స్‌తో త‌న స్థాయిని ప్ర‌క‌టించిన సూప‌ర్ స్టార్‌.  14ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రొఫెష న‌ల్ స్టార్ అని పించుకున్న సెరెనా  రాకెట్ ప‌ట్టిన నాటినుండి కేవ‌లం విజ‌యాలే అప‌జ‌యాల మాట చాలా త‌క్కువ‌. కెరీర్ మొత్తం ప్ర‌త్య‌ర్ధి పై వేగ‌వంత‌మైన ఆట‌తో క్ష‌ణాల్లో విజ‌యాన్ని ఆశించిన సివంగి సెరెనా . సెరెనా  అంటే టెన్నిస్‌, టెన్నిస్ అంటే సెరెనా  లా కెరీర్ సాగించింది. ఆట‌లో టెక్నిక్‌, అందం కంటే ప‌వ‌ర్ స్ట్రోక్స్‌, స‌ర్వీస్ అంటే చూపుకి అంద‌ని వేగంతో కూడిన నిప్పుక‌ణం అన్న అభిప్రా యాన్ని ప్ర‌త్య‌ర్ధికి క‌ల్పించిన శ‌క్తిమంత‌మైన ప్లేయ‌ర్ సెరెనా . ఇలాంటి గొప్ప ప్లేయ‌ర్‌ని మ‌ళ్లీ  యు.ఎస్ ఓపెన్‌, వింబుల్డ‌న్‌, ఫ్రెంచ్ ఓపెన్‌ల‌లో  భ‌విష్య‌త్‌లో చూడ‌డం దుర్ల‌భం. న్యూయార్క్‌లోని అర్థర్ ఆషె స్టేడియం వేదికగా ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోన్న యూఎస్ ఓపెన్ 2022 మూడో రౌండ్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి చవి చూసింది. తొలి రెండు రౌండ్లల్లో అలవోకగా విజయం సాధించినప్పటికీ.. మూడో రౌండ్‌లో ఆ దూకుడును కొనసాగించలేకపోయింది.  ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టోమ్లానోవిక్‌తో చేతిలో 7-5, 6-7 (4), 6-1 తేడాతో ఓడిపో యింది.  దీంతో ఆమె ఆట‌కు గుడ్ బై చెప్పిన‌ట్టే. ఆమె క‌న్నీటిప‌ర్యంత‌మ‌యి చేసిన ప్ర‌సంగం అలానే అనిపిస్తుంది. త‌న సోద‌రి వీన‌స్ విలియ‌మ్స్‌, త‌ల్లిదండ్రుల స‌హాయ‌స‌హ‌కారాలు లేకుండా త‌న టెన్నిస్ జీవిత‌మే లేద‌ని అన్న‌ది.  గత నెల రెండో వారం ఒహాయోలో జరిగిన వెస్ట్రన్‌ అండ్‌ సదరన్‌ ఓపెన్‌లో ప్రేక్షకులు అదేపనిగా  జీఓఏటీ.. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ అంటూ ఒకటే అరుపులు.. స్టేడియంలో అదే పేరుతో బ్యానర్లను ప్రదర్శించారు. వీరంతా అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలి యమ్స్‌ను ఉద్దేశించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సెరెనా కెరీర్‌లో 319 వారాలపాటు నెంబర్‌వన్‌గా కొనసాగగా.. ఇందులో 186 వారాలు ఏకధాటి గా ఆమెదే అగ్రస్థానం. ఐదుసార్లు ఓ ఏడాదిని నెంబర్‌వన్‌గా ముగించింది. ఓపెన్‌ ఎరాలో 23 గ్రాండ్‌స్లామ్స్‌.. మొత్తంగా 73 టైటిళ్లు ఆమె సొంతం. ఆమె అక్క వీనస్‌తో పాటు, సెరెనా విలియమ్స్‌కు ఆమె తల్లిదండ్రులు ఒరాసిన్ ప్రైస్ మరియు రిచర్డ్ విలియమ్స్ శిక్షణ ఇచ్చా రు. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన ఆమె 1999 యు.ఎస్‌. ఓపెన్‌లో తన మొదటి మేజర్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. 2002 ఫ్రెంచ్ ఓపెన్ నుండి 2003 ఆస్ట్రేలియన్ ఓపెన్ వరకు, ఆమె అన్ని నాలుగు ప్రధాన సింగిల్స్ టైటిళ్లను (ఫైనల్‌లో వీనస్‌పై ప్రతి సారీ) గెలుచుకుని, క్యాలెండర్-యేతర సంవత్సర గ్రాండ్ స్లామ్  కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను సెరెనా అని పిలుస్తారు. తరువాతి కొన్నేళ్ల లో ఆమె మరో రెండు సింగిల్స్ మేజర్లను క్లెయిమ్ చేసింది, కానీ గాయం ,ఫామ్ కోల్పోవ‌డంతో బాధ‌ప‌డింది. 2007 నుండి  ఆమె నిరంతర గాయాలు ఉన్నప్పటికీ క్రమంగా ఫామ్‌కి తిరిగి వచ్చింది, ప్రపంచ నంబర్ 1 సింగి ల్స్ ర్యాంకింగ్‌ను తిరిగి పొందింది. 2012 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రారంభించి, విలియమ్స్ ఆధిపత్యానికి తిరిగి వ‌చ్చిం ది, ఒలింపిక్ స్వర్ణం సాధించి, సింగిల్స్ డబుల్స్ రెండింటిలోనూ కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన మొదటి టెన్నిస్ క్రీడా కారిణిగా అవతరించింది. ఆమె 2014 నుండి వరు సగా నాలుగుతో సహా పదమూడు సింగిల్స్ మేజర్‌లలో ఎనిమిదింటిని గెలుచు కుంది. –15 రెండవ సెరెనా స్లామ్ ను సాధించ గ‌లిగింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, ఆమె తన 23వ ప్రధాన సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది, స్టెఫీ గ్రాఫ్ పేర ఉన్న‌ ఓపెన్ ఎరా రికార్డును అధిగమించింది. ఆమె గర్భవతి అయిన తర్వాత ప్రొఫెష నల్ టెన్నిస్ నుండి విరామం తీసుకుంది. ఆడటానికి తిరిగి వచ్చినప్పటి నుండి నాలుగు ప్రధాన ఫైనల్స్‌కు చేరుకుంది. విలియమ్స్ తన సోదరి వీనస్‌తో కలిసి 14 ప్రధాన మహిళల డబుల్స్ టైటిళ్లను కూడా గెలుచుకుంది . అంతేకాదు, ఈ జంట గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫైనల్స్‌లో అజేయంగా నిలిచింది. ఇందులో 2009 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లు మరియు 2010 ఫ్రెంచ్ ఓపెన్ మధ్య క్యాలెండర్-యేతర సంవత్సరం గ్రాండ్ స్లామ్ కూడా ఉంది, ఇది సోదరీమణులకు డబుల్స్ ప్రపంచ నంబర్ 1 ర్యాం కింగ్‌ను అందించింది. ఆమె నాలుగు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకుంది, మహిళల డబుల్స్‌లో మూడు-ఆమె సోద రితో కలిసి ఆల్-టైమ్ ఉమ్మడి రికార్డు నెల‌కొల్పింది. ఆమె 1998లో రెండు ప్రధాన మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను కూడా గెలుచు కుంది. ఆగస్ట్ 2022లో, విలియమ్స్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి తన రిటైర్మెంట్‌ను ప్రకటించింది. విలియమ్స్ ఎప్పటికప్పుడు గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడ్డాడు. విలియమ్స్ సోదరీమణుల రాక మహిళల వృత్తిపరమైన టెన్నిస్ టూర్‌లో శక్తి , అథ్లెటిసిజం కొత్త శకానికి నాంది పలికింది. యాక్టివ్ ప్లేయర్‌లలో సింగిల్స్, డబుల్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, సింగిల్స్‌లో 39:23, మహిళల డబుల్స్‌లో 14,మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండు. ఆమె ఆల్-టైమ్ జాబితాలో ఉమ్మడి-మూడవ.. మొత్తం ప్రధాన టైటిల్స్ కోసం ఓపెన్ ఎరాలో రెండవది. నాలుగు ప్రధాన సింగిల్స్ టైటిల్స్ (2002–03 2014–15) ఏకకాలంలో సాధించిన ఇటీవలి మహిళ, సర్ఫేస్ స్లామ్ (అదే క్యాలెండర్ సంవత్సరంలో హార్డ్, క్లే , గ్రాస్ కోర్ట్‌లలో ప్రధాన టైటిల్స్) గెలుచుకున్న సూప‌ర్ స్టార్ ఆమె., 2015లో అలా సాధించింది. వీనస్‌తో కలిసి మొత్తం నాలుగు ప్రధాన మహి ళల డబుల్స్ టైటిల్స్ (2009–10) ఏకకాలంలో సాధించిన ఇటీవలి క్రీడాకారిణి కూడా. విలియమ్స్ 2016లో దాదాపు 29 మిలియన్ డాల‌ర్లు సంపాదించి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకా రిణి అనిపించుకుంది. 2017లో ఫోర్బ్స్ అత్యధికంగా చెల్లించే 100 మంది అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక మహిళగా, 27 మిలియన్ డాల‌ర్ల  ప్రైజ్మనీ,  ఎండార్స్‌మెంట్‌లతో ఆమె ఈ ఘనతను పునరావృతం చేసింది. ఆమె లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నాలుగు సార్లు (2003, 2010, 2016, 2018) గెలుచుకుంది మరియు డిసెంబర్ 2015లో స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మ్యాగజై న్ ద్వారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 2021లో ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యున్నత వ్య‌క్తుల జాబితాలో 28వ స్థానంలో నిలిచింది. సెరెనా కి సాటి సెరెనాయే!

జగన్ కుందేటికి మూడేకాళ్లు..!

ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు కావాల్సిందే. సీఎం జగన్ ఇదే చెబుతున్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని న్యాయస్థానం చెప్పినా.. ఇంతవరకు ఒక్క అడుగైనా జగన్ సర్కార్ ముందుకు వేస్తే ఒట్టు. హైకోర్టు విధించిన గడువు తీరిపోయినా లెక్క లేనట్లు వ్యవహరిస్తున్న జగన్ తాను పట్టన కుందేటికి మూడేకాళ్లని భీష్మిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై తన వైఖరి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అఫిడవిట్లతో కాలయాపన చేస్తున్నారు. ఇంతలా అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్న జగన్ చివరికి ఏం సాధిస్తారన్నది ఆయనకే తెలియాలి?  ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించి, మూడు ముక్కలు చేసేందుకు జగన్ తన వ్యర్థ ప్రయత్నాలను ఇంకా కొనసాగించేందుకే పూనుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందే అని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పు గడువు శనివారంతో తీరిపోయింది. అమరావతిలో రాజధాని నిర్మాణంపై హైకోర్టు తీర్పు వెలువరించి శనివారం నాటికి ఆరు నెలలు పూర్తయ్యింది. కానీ రాష్ట్ర సర్కార్ లో ఎలాంటి స్పందనా లేదు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించకూడదనే మొండి పట్టునే ఇప్పటికీ ప్రదర్శిస్తోంది. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం శిరసావహిస్తే.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పాలకులు అనుకుంటే.. ఇప్పటికే అక్కడ శరవేగంగా పనులు జరుగుతూ ఉండాలి. గత ఆరు నెలల్లో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా చేసిన ప్రయత్నం ఒక్కటీ లేదు. హైకోర్టు చెప్పిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఒకసారి, నిధుల కొరత ఉందని ఇంకోసారి, బ్యాంకులతో మాట్లాడుతున్నామని మరోసారి.. ఇలా కోర్టులో అఫిడవిట్లు వేస్తూ ఈ ఆరు నెలలూ కాలం గడిపేసింది.  సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58కి లోబడి రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన యజమానులు, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి, స్థలాల్ని నివాసయోగ్యంగా చేసి, మూడు నెలల్లోగా అప్పగించాలని పేర్కొంది. భూసమీకరణలో రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. అయితే.. నిర్ణీత గడువు లోగా మౌలిక వసతుల పనులు పూర్తిచేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పనులు ప్రారంభించేందుకే 8 నెలలు పడుతుందని, పూర్తిచేయడానికి 60 నెలలు కావాలని ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వడానికి అయిదేళ్లు పడుతుందని జూన్ తొలి వారంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కోర్టులో మరో అఫిడవిట్ వేశారు. ఏపీలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధానిని మార్చాలనుకోవడం భూములిచ్చిన రైతుల హక్కుల్ని కాలరాయడమే అంది. అయితే.. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే అడ్వకేట్ జనరల్, సీఆర్డీఏ అధికారులతో, ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులతో సీఎం జగన్ సమీక్షించారు. మూడు రాజధానులపై ముందుకే వెళ్లాలని నిర్ణయించారు. అధికార వికేంద్రీకరణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరతామని సీఎంతో సమావేశం అనంతరం అప్పటి పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడం గమనార్హం. కోర్టు అంత స్పష్టంగా చెప్పినా ప్రభుత్వ వైఖరి మారలేదు. మంత్రులు, వైసీపీ నేతలు ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతున్నారు. రాజధానిలో గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తవ్వుకుపోతున్నా, కంకర, మట్టి, ఇసుక తరలించుకుపోతున్నా కనీస రక్షణ చర్యలు లేపోవడం అమరావతిపై ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి తార్కాణం అని పలువురు మండిపడుతున్నారు.

టిఆర్ ఎస్, బీజేపీ ట్వీట్ వార్‌!

తిట్టుకోవ‌డానికి, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డానికి ఇపుడు రాజ‌కీయ‌నాయ‌కులు  ట్విట‌ర్‌ను వేదిక చేసుకున్నా రు.  రోడ్లు మీద‌కి వ‌చ్చి మ‌రీ బ‌జారు రౌడీల్లా తిట్టుకోవ‌డం కాకుండా టెక్నాల‌జీని బాగా వినియోగించు కుంటున్నారు. ట్విట‌ర్‌లో  అభిప్రాయాలు, విమ‌ర్శ‌ల‌తో  అధికార‌, విప‌క్షాల నాయ‌కులు  విమ‌ర్శ‌ల దాడికి  దిగారు.  ము ఖ్యంగా ప్ర‌ధాని మోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్ ఫోటోల గురించి ఆ రెండు పార్టీల నాయ‌కులు మ‌రీ రెచ్చిపోతున్నారు.  కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామన్  తెలంగాణా  ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఒక గ్రామంలో  ప‌ర్య‌టించిన‌పుడు  ఒక రేష‌న్ దుకాణా నికి వెళ్లి ప్ర‌ధాని మోదీ ఫోటో లేక‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం కొంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రి చింది, చాలామందికి మ‌రీ కామెడీగా అనిపించింది.  బీజేపీ నేత‌లు  ఏదో విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వం, నాయ‌కుల మీద విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అల‌వాటుగా చేసుకున్నారు. ఆమె ఆ విధంగా అన‌డంతో తెలంగాణా మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణాలో ఒక గ్రామంలో సిలెండ‌ర్ల మీద మోడీ బొమ్మ‌తో సిలెండ‌ర్లు కొన్ని రిక్షాలో వెళుతూండ‌డం క‌న‌ప‌డుతుంది. ఆ సిలెండ‌ర్ మీద ధ‌ర రూ.1105 అని ఆ ప‌క్క‌నే మోదీ బొమ్మ ఉంది.  బీజేపీవారు గొంతు చించుకున్న‌ట్టే మేము ప్ర‌ధానికి గౌర‌వం ప్ర‌ద‌ర్శించామ‌న్నారు.  దీనికి ఓ అభిమాని ఇలా స‌మాధానం పెట్టాడు.. నిర్మ‌లాజీ, మీరు కంగారుప‌డ‌కండి.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ లు  సిబిఐ,ఈడీ , ఐటీ  సంస్థ‌ల‌కీ మోదీజీ ఫోటో పెట్టేస్తే మీరు క‌ష్ట‌ప‌డి ఎవ‌రినీ మోదీజీ ఫోటో పెట్ట‌మ‌ని ప్ర‌చారం చేయ‌న‌వ‌స‌రం లేదేమో అని ! ఇదిలాఉండ‌గా, ఇటీవ‌లే బీజేపీ పార్టీలో చేరిన కోమ‌టిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి టీఆర్ ఎస్ మీద మ‌రింత వెట‌కారంగా ట్వీట్ చేశారు. ప్రతి రేషన్ షాపులో ప్రధాని ఫోటో పెట్టిన పెట్టక పోయినా పర్వాలేదు ఎందుకంటే ప్రధాని తెలంగాణ ప్రజా గుండెల్లో ఉన్నారని అన్నారు.  తెలంగాణలో ప్రతి వైన్ షాపులో కెసిఆర్ ఫోటో పెట్టాలని, ప్ర‌తీ మందు బాటిళ్లు పైన పింక్ లేబుల్ వెయ్యాలన్నారు. అంతేకాదు ఢిల్లీలో కూడా ప్రతి వైన్ షాపులో కేసీఆర్‌, క‌విత ఫోటోలు పెట్టాల‌ని గ‌ట్టిగానే స‌మా ధానం చెబుతూ ఒక ట్వీట్  చేశారు. 

వేలుముద్ర‌మార్చే స‌ర్జ‌రీతో విదేశాల‌కు!

గ‌ళ్ల‌లుంగీ, చార‌ల టీష‌ర్టు వేసుకోగానే సినిమాల్లో హీరో కూడా దొంగ‌గా మారిపోతాడు. దొంగ, రౌడీ అన‌గానే అదే డ్ర‌స్ కోడ్‌. వెధ‌వ ప‌నుల‌కు వేయి మార్గాల‌న్నారు. టికెట్ లేకుండా దొంగ‌ప్రాయాణానికి వేయి మార్గా లు అనుస‌రిస్తారు. ఉద్యోగానికి స‌ర్టిఫికెట్లు మార్చేవారున్నారు. చిత్రంగా ఫింగ‌ర్‌ప్రింట్ తెలీకుండా స‌ర్జ‌రీ లు చేసుకుని మ‌రీ ఉద్యోగాలు కొట్టేసే ప్ర‌య‌త్నాలుచేసేవారున్నారు. ఇదుగో ఈ చివ‌రి గ్యాంగ్‌నే ఇటీవ‌ల తెలంగాణాలో ప‌ట్టుకున్నారు.  ఇల్లాకూడా ఉద్యోగాలు కొట్టేస్తారా అంటే అవున‌నే అంటున్నారు తెలంగాణా పోలీసులు. కువైట్‌నుంచి కొంత‌మంది దేశంలోకి చొర‌బ‌డ్డారు. వారేమీ మామూలుగా వ‌చ్చిన‌వారు కాదు. వారి ఆచూకీ తెలుసుకోవ‌డా నికి పోలీసులు ఫింగ‌ర్ ప్రింట్లు సేక‌రించి ప‌ట్టుకుంటార‌న్న అనుమానంతోనే వారంతా ఫింగ‌ర్ ప్రింట్స్ మార్చుకుని రాగ‌లిగారు. వీరికి ఒక ముఠా స‌హ‌క‌రించింది. అలా వ‌చ్చేవారికి స‌ర్జ‌రీ చేసి మ‌రీ దేశంలోకి వ‌దులుతున్నార‌ట‌. అంటే బొట‌న‌వేలుకి స‌ర్జ‌రీ చేసి అనుమానం రాకుండా చేస్తున్నారు. అంటే ఎక్క‌డ న్నా ఫింగ‌ర్ ప్రింట్ ఇవ్వాల్సి వ‌చ్చినా ద‌ర్జాగా ఇవ్వొచ్చు. మామూలుగా అయితే భ‌య‌ప‌డ‌తాం. కానీ దేశం బ‌య‌టికి వెళ్లేట‌పుడు ఫింగ‌ర్ ప్రింట్స్ అడుగుతారు. అక్క‌డ దొరికిపోతారు. ఇపుడు ఆ అడ్డు కూడా తొల గించుకోవడానికి  ఒక స‌ర్జీరీ ద్వారా  మార్గం ఏర్ప‌డింది. స‌ర్జ‌రీ చేసి మ‌రీ యువ‌త‌ను దేశం దాటిస్తు న్నార‌ట‌. చిత్ర‌మేమంటే, ఈ ఆప‌రేష‌న్ వ్య‌వ‌హార‌మంతా క‌డ‌ప‌కి చెందిన గ‌జ్జ‌లకొండ నాగ‌మునీశ్వ‌ర్ రెడ్డి అనే రేడి యోగ్రాఫ‌ర్, సాగ‌బాల వెంక‌ట‌ర‌మ‌ణ అనే అనెస్తీషియా టెక్నీషియ‌న్ ఈ ప‌నులు చేప‌డుతున్న‌ట్టు పోలీసు ల విచార‌ణ‌లో తేలింది. ఆ గ్యాంగ్ కువైట్ నుంచి వ‌చ్చే వారికి, వెళ్లేవారికి వీసా ప‌నులు కూడా చేసేవార‌ని పోలీసు అధికారులు తెలిపారు. అస‌లు అన్నింటికంటే ఆశ్చ‌ర్య‌మేమంటే, మునీశ్వ‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి గ‌తంలో కువైట్ వెళ్లొచ్చాడ‌ట‌, అదీ శ్రీ‌లంక‌లో ఫింగ‌ర్‌ప్రింట్ ఆల్ట‌ర్ స‌ర్జ‌రీ చేయించుకుని. అదే పోలీసుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ అనుభ‌వంతోనే ర‌మ‌ణ‌తో క‌లిసి ఈ వ్యాపారం సాగించాడు. రాజ‌ స్థాన్‌లో రెండు స‌ర్జరీలు, కేర‌ళ‌లో ఆరు, తెలంగాణాలో మూడు స‌ర్జ‌రీలు చేశార‌ట‌. ఓర్నాయ‌నో ఎంత ధైర్యం!

గెలిపించండి మంత్రిప‌ద‌విస్తా.. జ‌గ‌న్ తాయిలాల ప్ర‌క‌ట‌న‌!

ఎవ‌రు హోంవ‌ర్క్ త్వ‌ర‌గా పూర్తి చేస్తే వారికి చాక్లెట్ అంటూ త‌ల్లి, ఎవ‌రు ప‌రీక్ష బాగా రాస్తే వారికి  పుస్త కాలు ఫ్రీ అని హెడ్‌మాస్ట‌రు, ఎవ‌రు బాగా ఆడితే వాళ్లే కెప్టెన్ అని ఆట‌ల్లో పిల్ల‌ల‌కి తాయిలాలు ప్ర‌క‌టించి వారిని ఊరించ‌డం చూస్తూనే ఉంటాం. రాజ‌కీయాల్లోకి ఇది వ‌చ్చేసింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ద్వారా తెలి సింది.  ఎవ‌రు గెలిస్తే వారికి, ఎవ‌రిని గెలిపిస్తే ఆ విజేత‌కీ మంత్రిప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ తాయిలాల ప్ర‌చా రం మొద‌లెట్టారు.  రాజ‌కీయాల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఎద‌గాల్సి ఉంటుంది. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఆయా ప్రాంతాల్లో వారికి కాస్తం త మంచిపేరు ఉండాలి, మంచి ఫాలోయింగ్ అవ‌స‌రం. అలాంటివారికి ఎలాగూ పెద్ద‌గా ప్ర‌చారం అవ‌స రం లేదు. కానీ ప్ర‌త్య‌ర్ధిని అనుస‌రించి ప్ర‌చారం గ‌ట్టిగానే చేయాల్సివ‌స్తుంది. కానీ గెల‌వ‌డానికి అభ్య‌ర్ధి లేదా అభ్య‌ర్ధిని గెలిపించి మ‌హా వీరాభిమానులు కాళ్లు చేతులు విరిగేలా ప‌నిచేసుకుని మెజారిటీ సాధిం చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి తోడు జ‌గ‌న్ కొత్త‌గా తాయిలాల ప‌ద్ద‌తి ఆరంభించారాయె. క‌నుక ఇపుడు గెలిచి తీరాలి. గెలిస్తే బ‌తిమాల‌కుండానే ఆయ‌న మంత్రిప‌ద‌వి ఇస్తాన‌ని హామీ కూడా ఇచ్చేశారు. అంటే ఇలా పార్టీని మంచి మెజారిటీతో నిల‌బెట్ట‌డానికి వ్యూహం అయిన‌ప్ప‌టికీ అది ఆ అభ్య‌ర్ధికి ఏ మేర‌కు నిజం గానే ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది త‌ర్వాత చూడాలి. నానా అవ‌స్థాప‌డి గెలిచాక జ‌గ‌న‌న్న కాస్తా మొండిచేయి చూపితే ప‌డిన క‌ష్టంతో ఒళ్లుపులిసి, కాసులు పోయి ఇంటికి ప‌రిమితం కావాల్సి వ‌స్తుంది.  రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది!  కానీ... వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గెలిస్తే నువ్వే మంత్రి. గెలిపిస్తే మీ నాయకుడికి మంత్రి పదవి ఇస్తా నం టూ నేతలను, కార్యకర్తలను ఊరిస్తున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు... పార్టీ బలహీనంగా ఉన్నచోట, గెలు పు సందేహాస్పదంగా ఉన్నచోటల్లా ‘గెలిస్తే మంత్రి పదవి నీకే’ అని మాట ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం లో భాగంగా గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాపులు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమా వేశాలు నిర్వహిస్తున్నారు. మీ నాయకుడిని గెలిపించుకుని రండి.  మంత్రిని చేస్తా అంటూ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలకు చెబుతున్నారు. అస‌లే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంతో అవ‌మానాలు ఎదుర్కొ న్న‌వారు ఇపుడు ఎన్నిక‌ల్లో గెలిచేందుకు మ‌ళ్లీ ఇంటింటికీ వెళ్లి మొహం చూప‌డం క‌ష్ట‌మే. మ‌రి జ‌గ‌న‌న్న ఆశ‌పెట్టారు గ‌నుక అవ‌మానాలు, తిట్లూ ఒక లెక్కా అనుకుంటే అలాగే ముందుకు సాగిపోతారు, తిట్ల‌కంటే, అవ‌మానాల‌కంటే మంత్రిప‌ద‌వి అత్యుత్త‌మం అన్న‌ది రాజ‌కీయ‌ప్ర‌భోద క‌దా.   ఉదాహ‌ర‌ణ‌కు కుప్పంలో భరత్‌ను గెలిపించుకు రావాలని, ఆయనను మంత్రిని  చేస్తానని  చెప్పారు. రాజాంలో  కంబాల  జోగులును గెలిపించుకుని వస్తే  ఆయనకూ మంత్రి  పదవి ఇస్తానని  తెలిపారు.  మీ నాయకుడిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాన‌ని జగన్‌ చెప్పడం ప్రసార మాధ్యమాల్లోనూ రావడం పరిపాటిగా మారింది.   రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులయ్యే వీలుందని .. ముఖ్యమంత్రి జగన్  ఇస్తున్న హామీలు  చూస్తుంటే.. ఆ సంఖ్య  దాటేస్తుందని  వైసీపీ నేతలు అంటున్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు. ఎంతకైనా తెగించేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు.  జగన్‌ మంత్రి పదవి హామీ ఇచ్చిన తర్వాతే కుప్పంలో చంద్రబాబును భరత్‌ వర్గం అడ్డుకునే ప్రయ త్నం చేసిందని రాజకీయవర్గాలు పేర్కొంటు న్నాయి. గత ఎన్నికల సమయంలోనూ...ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల ఆశ చూపి... చివరికి చెయ్యివడం జగన్‌కు కొత్తేమీ కాదని గత అనుభవాలు చెబుతున్నాయని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. 2019 ఎన్ని కల ముందు కూడా ఇలాంటి హామీలు అనేక మందికి ఇచ్చారని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మె ల్యే సీటును ఆశించిన మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇస్తానని జగన్‌ హామీలు గుప్పిం చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. మంత్రిపదవి పక్కనపెడితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మె ల్సీ కూడా దక్కలేదు.  తాజాగా 2023లో మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా పలు జిల్లాల్లో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంటూ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మ‌రి ఈ నేప థ్యంలో నాయ‌కుని హామీకి త‌లొగ్గి  వైసీపీ నేత‌లు ఏమాత్రం ఉత్సాహ‌ప‌డ‌తారో చూడాలి.

రాజుగారి మ‌హ‌త్యం ఏపీ తెర‌ మీద కొత్త చిత్రం

రాజుగారి ప్ర‌తిభ అంద‌రికీ తెలియాల‌ని పూర్వం మంత్రి, సేనాధిప‌తి, ఆయ‌న అసిస్టెంటు అన్ని పెద్ద గ్రామాల్లోకి వెళ్లి ప్ర‌చారం చేసి దేశ‌భ‌క్తి, స్వామిభ‌క్తీ పెంచాల‌నుకున్నారు. ద‌రిదాపుల్లో ఏ యుద్ధ‌మూ వ‌చ్చేది లేకున్నా ఈ రెండు ర‌కాల భ‌క్తి త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల‌కు ఉండి తీరాల‌ని వారి ల‌క్ష్యం. అనుకున్న‌దే త‌డ‌వుగా అస‌లు విష‌యం రాజుగారికి చెప్ప‌కుండానే న‌లుదిక్కులా న‌లుగుర‌యిదుగురితో క‌లిసి ఒక జ‌ట్టుగా పంపేరు మంత్రిగారు. ఆన‌క తీరిగ్గా మామిడితోట‌లో రాజుగారితో క‌లిసి విందు చేస్తూ రాజుగారికి ఈ విష‌యం విన్న‌వించారు. కానీ ఆయ‌న‌కు పెద్ద‌గా సంతోషం క‌ల‌గ‌లేదు.  ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటేనేమి మ‌నం చేసేది ఎలాగూ చేసేస్తాము, చేసేసేము క‌దా మంత్రీ అన్నారు. అవున ను కోండి కానీ ఇంకేమ‌న్నా చేస్తారే మోన‌ని వారికీ తెలియాలి క‌దా! అందువ‌ల్ల హెచ్చ‌రిక‌గా బృందాల‌ను పుర‌మాయించార‌న‌న్నారు మంత్రి. రెండురోజుల త‌ర్వాత వెళ్లిన‌వారు రాజ‌ధాని న‌గ‌రానికి తిరిగి వ‌చ్చారు. చేతికి గాయంతో చెంచ‌య్య‌, కాలి వేలు తెగి వెంక‌డు, బుజం దెబ్బ‌తో భుజంగం, వీపు విమానం మోత మోగించుకుని వీర‌మ‌ల్లుడు వ‌చ్చారు. ఏమ‌ర్రా ఏమ‌యింది? ఏమి విన్నారు? ఏమి తెలుసుకున్నారో రాజుగారికి విన్న‌వించుకోండి అని మంత్రి స‌భ‌కి వారిని ఆహ్వానించారు.  అయ్యా, మీరు చెబితే న‌మ్మ‌రుగాని, మీ పాల‌న గురించి బ‌హు దొడ్డ‌గానే చెప్పుకుంటున్నారు. మొన్న‌టి ప‌థ‌కం గురించి అడిగితే అదేమీ అర్ధంగాన‌ట్టు చూశారు. మీకు అందాల్సిన పైకం అందిందా అంటే మాకు తెలియ‌ద‌న్నారు. ప‌క్కీదిలో పాత్ర‌డుగారికి రెండు బియ్యం మూట‌ల‌ని చెప్పి ప‌ది కేజీల బియ్యం మూట ఇచ్చిపోయారంటండీ. రెండు బ‌జార్ల‌వ‌త‌ల పెన్ష‌ను డ‌బ్బుల గురించి అడిగితే యేలు ముద్ర స‌రిగా ప‌డ‌లేద‌ని స‌గ‌మే ఇచ్చారంటండి. అదండి మ‌రి. అంచేత అంతా ఓపాలి మీ స‌న్నిదికి వ‌ద్దామ‌నే అనుకుంటున్నారంటే, ద్వార‌పాల‌కులే చిల్ల‌ర అడుగుతున్నారు! మ‌రి నువ్వు మంగాపురం వెళ్లావుగా నీ సంగ‌తేంది మ‌ల్ల‌న్నా.. అని మంత్రిగారు గ‌ర్వంగా చూస్తూ పిలిచారు. ఏం వూరండీ.. ఎడ్లేమో ఛ‌ల్‌పో అన్న క‌ద‌ల‌లేదు. ఈ రోడ్లంట మేం రావ‌ని భీస్మించాయి. స‌రేలే అని నేనే దిగి నెమ్మ‌దిగా న‌డ‌చుకుంటూ ఎల్లేనండి.. త‌మ‌రి గురించి వివ‌రంగా ఏదో చెబుదామ‌ని, అచ్చం మంత్రి గారిచ్చిన చీటీ పెకార‌మే చెప్ప‌బోయానండీ.. అంతే.. అమాంతం ఓ రాయి వొచ్చి త‌ల‌కి త‌గిలిందండి.  గ‌మ్మున లేచి తుండుగుడ్డ త‌ల‌కు క‌ట్టుకున్నానండి. అవ‌త‌ల‌కి బోయి చెంబెడి నీళ్లు తాగి వొచ్చి మ‌ల్లీ చెప్పానండీ.. ఇనుకుంటున్నార‌నుకున్నానండి. ఆల్లు ఇన‌డం లేదు అన్న‌ది త‌ర్వాత తెలిసింది. వాళ్ల‌లో వాల్లే ఏదో అనుకుని ఇల్ల‌కి ఎల్లారండీ.. బోజ‌నానికి ఏర్పాట్లు చేత్తార‌ని మేం అనుకున్నామండి.. అర‌గంట త‌ర్వాతండీ.. క‌ర్ర‌ల‌తో వొచ్చి వీపు ఇమానంమోత మోగించేసీరండీ.. ద‌ణ్ణం బెట్టి ఎడ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చాం. వాటికీ ఎట‌కార‌మేనండీ.. త‌లాడించి బండెక్క‌మ‌న్నాయి! య‌వ్వారం స‌రిగా లేకుంటే యిట్ట‌నే అన్నీ అవుతాయండీ.. అచ్చ‌న్న‌గారి మాటే ఇనుకుంటున్నారండీ అంద‌రూ. ఆయ‌నెవ‌రో అచ్చ‌న్న‌గారంటండి ఎగ‌స్పార్టీ ఓరంటండీ.. అమాంతం గుర్రంమీద వొచ్చి గ‌బ గ‌బా ఏందేందో మాటాడి ప‌చ్చ‌టి జెండా వూపి ఎల్లారండి.. అంద‌రూ న‌వ్వుకుంటా ఆయ‌నెంటే కొంత దూరం ఎల్లారండీ. మొన్న‌టికి మొన్న రాజ‌ధాన్నుంచి ఇద్ద‌రొచ్చి అయిచ్చాం, ఇయిచ్చాం అందిన‌యా, అంతా బాగున్నారా అని అడిగారండి. మాకేమీ రాలేద‌నే చెప్పావండి. నిజంగూడా అదేగ‌దండీ మ‌రి. కాదు అంద‌రికీ పించ‌న్లుచ్చాం, గింజా పంచాం అన్నారండి. అయి తీసుకున్నారేమో ఎటో పోయారండి, మ‌రి మా గ్రామంలో మాత్రం ఏమీ ఇవ్వ‌లేదంటే న‌మ్మ‌రే. మా ప‌క్కింటి పెద్ద రైతుకి, టీచ‌ర‌మ్మ‌కీ కోపం వ‌చ్చి తిట్టారండీ. ఇదేమ‌న్నా తాయ‌త్తు మ‌హిమా.. ఇవ్వందే ఇల్లంతా నిండ‌డానికి? గ‌ట్టిగా అరిచేస‌రికి తిరిగెల్లారు.  అంత‌లో మ‌రొక‌డు అందుకున్నాడు. ఆ గుర్రం మీదొచ్చిన ప‌చ్చ‌జెండాయ‌న మాత్రం అన్నీ అడిగి మీకు నేనున్నాను ఏం బ‌య‌ప‌డొద్దు, మీకురావ‌ల‌సిన‌దాన్ని గెట్టిగా అడ‌గండ‌ని చెప్పారండి. అందుకే అంద‌రం మ‌రి నిలదీసామండి. వ‌చ్చినోల్లు మ‌రి మీకేం చెప్పారో తెలీదండి. మ‌మ్మ‌ల్ని కొట్టించ‌డానికేమ‌న్నా చెప్పార‌నే బ‌యంతో  ఇట్టొచ్చామండీ.. మ‌రి రేపు ఎల్లాలా వొద్దా అని అడ‌గ‌నీకి వ‌చ్చామండీ.. మ‌రి మీరు సెల‌వీయాలండీ! రాజుగారు మంత్రి వంక చూసి కోప‌గించుకున్నారు. మంత్రి మొహం తిప్పుకున్నాడు. మ‌రో మంత్రి టిఫిన్‌కి  ప‌క్కంటికి ఎల్లి ఇడ్లీలు లేవంటే రెండు మిర్చీలన్నా ఇయ్య‌మ‌న్నాడు. పిండి రేటు పెంచిన‌వ్ ఇట్టెట్టాన య్యా దొరా అన్న‌దా హోట‌ల్ ఓన‌ర్‌.   ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ప్రస్తుతం సరిగ్గా ఇలాగే ఉంది. మూడేళ్ల పాలనలో అద్బుతాలు చేసేశాం. మీట నొక్కి పేదల అవసరాలన్నీ తీర్చేశాం. మా ఘనతలు ఇవీ అంటూ గడపగడపకూ చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలను పురమాయించారు. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వీరంతా తిరుగుతుంటే ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన సెగలు రగులుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో అద్వాన పరిస్థితి, ఊహాతీతంగా పెరిగిపోయిన నిత్యావసారల ధరల కు నిరసనగా విపక్షం చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష జన స్పందన లభిస్తోంది. గడపగడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహ జ్వాలలకు గురౌతుంటే.. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజలకు వివరించేందుకు వెళుతున్న విపక్ష నేతలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రభుత్వ గడపగడపకూ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతుంటే... బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా దూసుకుపోతోంది.

ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్‌.. అదంతే! 

ఎన్టీఓడు అని తెలుగువాళ్లు ప్రేమ‌గా పిలుచుకునే వెండితెర వేలుపు ద‌ర్శ‌నీయుడు. ఆయ‌న్ను చూడాల ని ఎక్క‌డెక్క‌డినుంచో మ‌ద్రాసు వెళుతూండేవారు. అప్ప‌ట్లో తెలుగు నేల నుంచి మ‌ద్రాసు రైలెక్కెళు తోంటే ఎన్టీఆర్‌ని సూడ్డానికా? అని అడిగేవార‌ట‌. ఇందులో అతిశ‌యోక్తి లేదు. నిజ్జంగానే అలా వీరాభిమా నులు వెళుతూండేవారు. తెర‌మీద హీరోగా, వీరాధివీరుడుగా, రాముడు, కృష్ణుడిగానూ ప్ర‌జ‌ల మ‌న‌సులో సుస్థిరస్థానం సంపాదించుకున్న‌ మ‌హా న‌టుడు ఎన్‌.టి.రామారావు. ఏ పాత్ర‌లోనైనా లీన‌మై పాత్ర‌ను పం డించడంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఎంతో దీక్ష‌తో న‌టించ‌డం అంటే ఆయ‌న్ను గురించే ప్ర‌స్తావి స్తారు ఇప్పటికీ. చూసి నవారు, ఆయ‌న‌తో మాట్లాడిన‌వారు, ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్న‌ వారు ల‌క్ష‌ల్లో ఉంటారేమో!  తెర‌మీద స‌మ్మోహ‌ నాస్త్రం! క్రికెట్ లోకంలో అర‌వీర‌భ‌యంక‌రులు వెస్టిండీస్. 1960ల్లో వారిని ఢీకొన‌డానికి ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల సైతం ధ‌డిసేవారు. సోబ‌ర్స్ వంటి దిగ్గ‌జాలు ఉండేవారు. ఆయ‌న గొప్ప ప్లేయ‌ర్‌గా లోక‌మంతా ప్ర‌సిద్ధి. ఆయ‌న ఆట‌ను చూడ్డానికి వెస్టిండీస్ ప‌ర్య‌టించే ప్రాంతాల‌కు వెళ్లే జ‌నాలు ఉండేవారు పూర్వం. అంతెందుకు 1967లో భార‌త్‌కి వెస్టిండీస్ వ‌చ్చిన‌పుడు సోబ‌ర్స్‌ను చూడ్డానికి ప‌నిగ‌ట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మారుమూల ప్రాంతం నుంచి కూడా మ‌ద్రాస్ వెళ్లారు. ఆ టెస్ట్‌లో ఆయ‌న బ్యాటింగ్ విరుపులు చూసి ఆశ్చ‌ర్య‌ పోయారు. చాలా సింపుల్‌గా క‌నిపించే ఈయ‌నే బ్యాట్‌ప‌ట్ట‌గానే బౌల‌ర్ల‌కు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించే ప‌రుగుల వ‌ర‌ద‌నే సృష్టించేవాడు. ముఖ్యంగా క‌వ‌ర్‌డ్రైవ్‌, మిడ్‌వికెట్ లోకి ఫోర్లు కొట్ట‌డం బ‌హు ముచ్చ‌ ట‌గా ఉంటాయ‌ని ఇప్ప‌టికీ చెబుతూంటారు, ఆనాటి వారు. రేడియోలో కామెంట్రీ విన‌డం అనేది ఆయ‌న ఆట‌తీరును వినడానికే చెవికి రింగులా ట్రాన్సిస్ట‌ర్స్ పెట్టుకు తిరిగేవారు. అంత‌టి వీరాభిమానులు ఉండేవారాయ‌న‌కు.  అదుగో అంత‌టి సోబ‌ర్స్  మ‌న ఎన్టీఆర్‌ను చూడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ్డాడు.  అది 1967. భార‌త్ వెస్టిండీస్‌ ల మ‌ధ్య మ‌ద్రాసులో టెస్ట్ మ్యాచ్ జ‌రిగింది. ఆట చూడ్డానికి చాలామంది వెళ్లారు. చూసి త‌రించారు. అంద రూ సోబ‌ర్స్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కానీ ఆయ‌న మ‌న‌సులో కోరిక  బ‌య‌టికి చెప్పే స‌రికి చుట్టూ ఉన్న వారు ఆశ్చ‌ర్య‌పోయారు.  అదేమంటే.. ఐ వాంట్ టు సీ మిస్ట‌ర్ ఎన్‌.టి. రామారావు, యువ‌ర్ సినీ యాక్ట‌ర్‌!.. అని అడిగాడు ఆ క్రికెట్ లెజండ్ . ఈడేందీ వెట్టిండీసోడు.. మ‌న ఎన్టీఓర్ని సూత్తానం టాడేంది మావా!.. అనుకున్నారు తెలుగు వారంతా. ఎన్టీఆర్‌ను ఎలాగ‌యినా చూడాల‌ని, క‌ల‌వాల‌ని సోబ‌ర్స్ క‌ల‌వరించాడు. చాలామందిని ఎన్టీఆర్‌ని క‌లిసే మార్గం అడిగాడ‌ట‌. అయితే అప్ప‌ట్టో ఆయ‌న్ను క‌ల‌వ‌డం క‌డుదుర్ల‌భం. సినిమా షూటింగ్‌లు మ‌ద్రాసులో జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అమాంతం వెళ్లి చూడ్డా నికి అస్స‌లు వీలుండేది కాదు.. అది సోబ‌ర్స్ అయినా సాంబ‌య్య అయినా. అంతే. ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌ డానికి  ప్ర‌యత్నించి విఫ‌లమయిన‌వారు అనేకానేకం. సోబ‌ర్స్ వ‌చ్చాడ‌ని ఎన్టీఆర్ క‌ల‌వ‌డానికేమీ సిద్ధం గా  ఉండ లేదు. అవ‌త‌లా య‌న గొప్ప క్రికెట‌ర్ కావ‌చ్చు, కానీ ఇవ‌త‌ల ఉన్న‌ది ఎన్టీఆర్‌. అంత సులువుగా ద‌ర్శ‌నం  దొరక‌దు.  అప్ప‌ట్లో మ‌ద్రాసులో కంచుకోట సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ చాలా బిజీ, అంత‌కంటే సీరియ‌స్‌. స‌ర‌దా మాట‌ల‌కు, స‌ర‌దాల‌కు అస్స‌లు ఛాన్స్ లేదు. కానీ ఆయ‌న్ను క‌ల‌వాలనుకున్నాడు సోబ‌ర్స్. అంచేత షూటింగ్ విరామం స‌మ‌యంలో క‌లిసేందుకు ప్ర‌య‌త్నిం చాడు. అస‌లు ఎన్టీఆర్ గురించి సోబ‌ర్స్‌కి ఏం తెలుసు?  పోనీ ఎవ‌రు చెప్పార‌న్న సంగ‌తి అలా ఉంచితే, వాళ్లిద్ద‌రినీ చూడ్డానికి అక్క‌డి సినీజ‌నానికి, బ‌య‌టివారికీ వెయ్యి క‌ళ్లు స‌రిపోలేదేమో!  స‌రే మాట‌లెం దుకు మీరూ ఆ అద్భుత వ్య‌క్తుల క‌లియిక నాటి ఫోటో చూడండి.  ఫోటోలో.. సోబ‌ర్స్‌, ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, సావిత్రి, జెమినీ గ‌ణేష‌న్‌, ధూళిపాళ‌,జ‌గ్గారావు త‌దిత‌రులు ఉన్నారు. 

పంచాయితీల నిధుల‌కు రెక్క‌లు  

మాయ‌లు, మంత్ర‌తంత్రాలూ సినిమాల్లోనే చూస్తాం. కొండ‌క‌చో పురాణ‌క‌థ‌ల్లో వింటాం. కానీ వాస్త‌వంగా మాయాజాల ప్ర‌ద‌ర్శ‌న నిధుల విష‌యంలోకూడా అవుతుంద‌నేది ఈమ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌మ‌నిస్తు న్నారు. కొన్ని ఊహించ‌నివిధంగా జ‌రిగిపోతూంటాయి. కొన్ని చూస్తుండ‌గానే మాయ‌మైపోతూంటాయి. ఇలాగ‌ని చెబుతూంటే విన‌డ‌మే గాని ఈరోజుల్లో చూసిన దాఖ‌లాలు త‌క్కువే. కానీ పంచాయితీ నిధుల విష‌యంలో మ‌రోసారి నిధుల మాయం చిత్రం ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది.  కేంద్ర‌ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని చెబుతున్న రూ. 569 కోట్ల ఆర్థిక సంఘ నిధులు ఎక్కడని పంచా యతీ సర్పంచ్‌లు  ఆరా తీస్తున్నారు. కరెంట్ బిల్లుల బకాయిల రూపంలో పంచాయతీలకు వస్తున్న నిధులను నొక్కేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను కూడా అలా మింగేసిందేమోనని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధు లను పంచాయతీలు ఓపెన్ చేసిన ప్రత్యేక అకౌంట్లలో జమ చేయాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు. ఈ అకౌంట్లలో కేంద్రం నుంచి వచ్చే నిధులను జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు నిధులు జమ కాలేదు.   పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ, మురుగునీటి పునర్ వినియోగానికి సుమారు రూ. 569 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇందులో 60 శాతం నిధులు తాము సూచించిన అంశాలకు, మిగి లిన 40 శాతం నిధులు స్థానిక అవసరాలను తెలుసుకుని కేటాయించుకోవచ్చునని కేంద్రం సూచిం చింది. అయితే కేంద్రం నిధులను విడుదల చేసినట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ నేటి వరకు పంచాయతీలకు జమ కాలేదు. పది రోజుల్లోగా స్థానిక సంస్థలకు ఈ నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది.

ఇక బీజేపీ వారి ఫొటోల పంచాయితీ!

గొడ‌వ‌ ప‌డాల‌న్న ఆలోచ‌నే రావాలిగానీ దేనిక‌యినా గొడ‌వ‌ప‌డే జ‌నాలుంటారు. మా హీరో మీ హీరో అంటూ సినిమా జ‌నాలు ఫెక్సీల గొడ‌వ‌ల్లో పోలీస్ స్టేష‌న్ గుమ్మాలు ఎక్కుతూ దిగుతూంటారు. అది యువ‌త పిచ్చి. రాజ‌కీయాల్లోనూ ఇటీవ‌ల ఇలాంటి పోటీత‌త్వ‌మే ప్ర‌బ‌లుతోంది. మా నాయ‌కుడి ఫ్లెక్సీ చించేశారనీ, విప‌క్షాల  నేత ఫ్లెక్సీ తగలెట్టారనీ పంచాయతీలు గొడవలూ జరిగాయి. మ నాయకుడి విగ్రహం విరగ్గొట్టారు, మా నేత విగ్రహం ధ్వంసం చేశారంటూ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టుకోవడమే జరిగింది.  పార్టీని గెలిపించుకోవ డానికి, త‌మ పార్టీ ప్రాభ‌వాన్ని అన్ని ప్రాంతాల్లో విస్త‌రింప‌చేసుకోవ‌డానికి ఎంత‌టి చిత్ర విచిత్ర ఆలోచ‌న‌ల నైనా అమ‌లు చేయ డానికి రాజ‌కీయ పార్టీలు వెనుకాడ‌టం లేదు. మ‌రీ ముఖ్యంగా బీజేపీవారు.  కేంద్రంలో బీజేపీ నాయ‌క‌త్వంలోని మోదీ ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీయే గెలిచి అధికారం చేజిక్కించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో అన్ని రాష్ఠ్రాల మీద దాదాపు రాజ‌కీయ దండ‌యాత్ర సాగిస్తున్న‌ది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల మీద క‌న్ను ప‌డింది. తెలంగాణాలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చి తాము అధికారం చేజిక్కించుకోవ‌డానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్ని ఎత్తులు  వేయాలో అన్ని వేస్తోంది కమలం పార్టీ. తాజాగా ఫోటోల పంచాయితీ ఆరంభించింది. రాజ‌కీయంగా అనేక ఎత్తుగ‌డ‌ల‌తో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని త‌మ చెప్పుచేత‌ల్లోకి తీసుకోవాల‌ని చేస్తున్న య‌త్నాలు అంత‌గా ఫ‌లించ‌డం లేదు. ఎవ‌రికీ ఎవ‌రూ త‌గ్గే ప్ర‌సక్తే లేద‌న్న స్థాయి లో పోటాపోటీ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయ‌కులు ప్ర‌తీరోజు కేసీఆర్ ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డ‌టం ఒక కార్య‌క్ర‌మంగా చాలా సిన్సియర్‌గా చేస్తున్నారు.  ఇపుడు తెలంగాణాలో కొత్త పంచాయితీ మొద‌ల‌యింది. అన్ని  రేష‌న్ దుకాణాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారి ఫోటో ఉండాలి అని. చాలా కాలం నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప్ర‌ధాని, గాంధీ ఫోటోలు ఉంటూన్నాయి. ప్ర‌ధాని మారిన‌పుడ‌ల్లా కొత్త ప్ర‌ధాని ఫోటో మారుతూంటుంది. అది స‌హ జం. కానీ ప్ర‌భుత్వం బియ్యం, ప‌ప్పు దినుసులూ అందిస్తోంది గ‌నుక రేష‌న్ దుకాణాల్లోనూ ప్ర‌ధాని ఫోటో ఉండి తీరాల‌ని ఏకంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌ల‌మ్మ‌గారు డిమాండ్ చేశారు. అంతేనా మోడీగారి ఫొటో ఎందుకు లేదంటూ   కలెక్టర్ నే నిలదీశారు. ఇక తాజాగా    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ ల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో  పర్య టించారు.  బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్   బిక్నూర్ లో ఒక రేషన్ షాప్ సంద ర్శించారు. అక్క‌డ దుకాణంలో ప్ర‌ధాని ఫోటో లేద‌ని ఆగ్ర‌హించారు. కలెక్టర్ ను నిలదీశారు.    రాజ‌కీయాంశాల్లో తెలంగాణా రాష్ట్రాన్ని నిల‌దీసి త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నంలో పెద్దగా సఫలం కాని బీజేపీ ఇపుడు ఇక ఫోటోల విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకోవడం  విడ్డూరంగా  ఉంద‌ని విశ్లేష‌కు లు అంటున్నారు.  అయితే ఇటు తెలంగాణా ప్ర‌భుత్వం కూడా కేసీఆర్ బొమ్మ‌ను ఉత్త‌రాదిన పెట్టుకోవా ల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని కేంద్రం నుంచి తెలంగాణకు అందుతున్న సొమ్ముల కంటే పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళుతున్న సమ్ములే అధికమని ఆయన గణాంకాలతో సహా వివరించి, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ గాలీ తీసేశారు. రేషన్ దుకాణాలలో మోడీ ఫొటోలు పెట్టాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలలో కేసీఆర్ ఫొటోలు పెట్టాల్సి ఉంటుంది పెడతారా అని నిలదీశారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బొమ్మల పంచాయతీ జోరుగా సాగుతోంది

స‌న్‌రైజ‌ర్స్ హెడ్ కోచ్‌గా  బ్రియ‌న్ లారా

రాబోయే ఐపిల్ సీజ‌న్‌లో పోటీ చేసే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా క్రికెట్ లెజెండ్ బ్రియా న్ లారాను తీసుకున్నారు. టామ్ మూడీ కోచ్‌గా హైద‌రాబాద్ జ‌ట్టు గ‌త టోర్నీలో పెద్ద‌గా రాణించ‌లేదు. అంత‌కు మించి ఎనిమిదో స్థానానికి ప‌డిపోవ‌డంతో మూడీని ఫ్రాంచైజ‌ర్లు వ‌ద్ద‌నే అనుకున్నారు. బ్రియాన్ లారా కుర్ర‌వాడు, బ్యాట‌ర్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్లో ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శించిన‌వాడు క‌నుక త‌ప్ప‌కుండా హైద‌రాబాద్ జ‌ట్టు బ్యాటింగ్‌ను కాస్తంత ప‌దును పెట్ట‌గ‌ల‌డ‌ని, వ్యూహ‌క‌ర్త‌గానూ జ‌ట్టుకు ఎంతో ఉప‌యోగ ప‌డ‌తాడ‌న్న‌ ధీమాతో లారాను ఫ్రాంచైజ‌ర్లు తీసుకుని ఉంటార‌ని క్రికెట్ పండితుల మాట‌.  టామ్ మూడీ 2013, 2019 మ‌ధ్య కాలంలో హైద‌రాబాద్ జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌ యంలో జ‌ట్టు అయిదుప‌ర్యాయాలు ప్లేఆఫ్స్ దాకా వెళ్లింది. కాగా 2016లో ఛాంపియ‌న్ అయింది. ఈ ఏడాది ఐపి ఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి, ఎనిమిది ఓడిపోవ‌డంతో ఎనిమిదో స్థానానికి  ప‌డిపోయింది. ఇది జ‌ట్టు స‌త్తా విష‌యంలో ఎంతో విచారించ‌ద‌గ్గ అంశం. కాగా 2016లో జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లారా రావ‌డం ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. అందుకే ఇపుడు ఏకంగా హెడ్ కోచ్‌గా తీసుకు న్నారు.  అయితే జ‌ట్టును ఉత్సాహ‌ప‌ర్చ‌డంలో టామ్ మూడీ కృషిని మ‌రువ‌లేమ‌ని, ఆయ‌న జ‌ట్టుకోసం ఎంతో సేవ చేశార‌ని ఫ్రాంచైజ‌ర్లు ట్వీట్ చేశారు. వాస్త‌వానికి 2020 ముందే టామ్ స్థానంలో ఆరంజ్ ఆర్మీకి ఇంగ్లండ్ సూప‌ర్ స్టార్ ట్రెవ‌ర్‌బేలిస్  కోచ్ గా వ‌చ్చాడు. అప్పుడు ఎస్ ఆర్ హెచ్ మూడ‌వ స్థానంలో నిలి చింది. 2020లో రెండో క్వాలిఫ‌య‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ఆరంజ్ జట్టు ఓడింది. ఆ త‌ర్వాత బేలిస్ స్థానంలోకి టామ్‌ని మ‌ళ్లీ తీసుకున్నారు. కానీ అదేమంత మంచి ఫ‌లితాల‌నివ్వ‌లేదు. హైద‌రాబాద్ జ‌ట్టు 11 మ్యాచ్‌ల్లో కేవ‌లం మూడింట గెలిచింది.  హైద‌రాబాద్ జ‌ట్టుకు వెస్టిండీస్ లెజండ్ లారా రాక‌తో కొత్త ఆశ‌లు రేకెత్తుతున్నాయి. ఈసారి టోర్నీలో ఊహించిన‌దానికంటే మంచి బ్యాటింగ్ స‌త్తా ప్ర‌ద‌ర్శించే అవ‌కాశాలున్నాయ‌నుకోవాలి. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ ను మార్చి  మంచి బ్యాట‌ర్‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌న్న టెక్నిక్‌తో లారా గ‌తంలో జ‌ట్టుకు ఉప‌ యోగ‌ పడిన కార‌ణంగా ఈ రాబోయే సీజ‌న్‌లో స‌న్రైజ‌ర్‌ను టైటిల్ పోటీ స్థాయికి సిద్ధం చేస్తాడ‌నే అనుకోవాలి. 

ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పొత్తుల పైనే చర్చలు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఒక విధంగా  సర్వామోదం పొందిన నానుడి. యూనివర్సల్ ట్రూత్.  సో .. పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం, పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం, పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు విచ్చుకోవడం, కొత్త విషయం కాదు. నిన్న గాక మొన్న బీహారులో ఏమి జరిగిందో చూశాం.  రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ రెండు సంవత్సరాలలో లోలోపల ఏమి జరిగిందో ఏమో కానీ, నితీష్ కుమార్ బీజేపీ చేయి వదిలి ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్ళీ ఆయనే పీఠం ఎక్కారు. నితీష్  ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సరే, నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే భేతాళ ప్రశ్నలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఇదొక లేటెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది.  అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల వరకు పొత్తుల మీదనే చర్చ నడుస్తోంది. ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని ఇటు బీహారు పెద్దాయనకు, అటు దేశ ప్రజలకు ఒకేసారి విశద పరిచే ప్రయత్నం చేశారు. అలాగే, అంతకు ఒక రోజు ముందే ఎన్సీపీ అధినేత  శరద పవార్  బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే అందులో తనది సలహాదారు పాత్ర మాత్రమే అని కూడా సెలవిచ్చారు. అలాగే, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరికి వారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గద్దెదించడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, నాయకత్వం విషయంలో ఎవరి దారిన వారు విడి పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పాట్నా పర్యటనలో ఇదే  తగవు తలమానికంగా నిలిచింది. చివరకు ఆయన వెళ్ళిన పని, పంచిన కోటి రూపాయల నజరానాలు అన్నీ పక్కకి పోయి, నాయకత్వం విషయంలో కేసీఆర్, నితీష్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయమే ప్రముఖంగా బయటకు వచ్చింది.నాయకత్వ విషయం వచ్చే సరికి నితీష్ కుమార్ లేచి పోవడం, కేసీఆర్ ఆయన్ని కూర్చో పెట్టిందుకు భైఠోజీ .. భైఠో అని బతిమిలాడుకోవడమే హైలైట్ గా నిలిచింది.  అదొకటి అలా ఉంటే, ఆంద్ర ప్రదేశ్ లో టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడుస్తోందని, త్వరలోనే టీడీపీ ఎన్డీఎలో చేరుతోదంటూ గత వారం పదిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా చుక్క(ఫుల్ స్టాప్) పెట్టారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ఇప్పడు కూడా అదే పద్ధతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు. అదలా ఉంటే తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వాలని ఉభయ  కమ్యునిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. నిజమే, కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలే కాదు అన్ని పార్టీలు ఎప్పుడో నిర్ణయించాయి.ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు  ఎద్దేవా చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, లెఫ్ట్ నేతలు కేసీఆర్ ను  ఏ భాషలో దూషించారు అనేది ఇప్పడు అప్రస్తుతం.  అయితే, ఇలా  పొత్తుల చుట్టూ తిరుగుతున్న చర్చలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోందని,  ఇన్ని పార్టీలు, ఇంత మంది మహా నాయకులు అందుకోసమే పనిచేస్తున్నారు, అని పిస్తుంది. కానీ... బీజేపీని, మోడీని ఓడించడం అయ్యే పనేనా అంటే రేపటి సంగతి ఏమో కానీ ఈరోజుకు అయితే కాదనే అనిపిస్తుందని విశ్లేషకులే కాదు, సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకలా ...?!

అమరావతికి ఇలా కూడా జగన్ ఎసరు!?

‘భార్య అంటే ఇష్టం లేని మొగుడు పడకగది అంతా పాడుచేశాడు’ అన్నట్టు ఉంది జగన్  అండ్ కో తీరు చూస్తుంటే.. మూడున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సర్కార్ అమరావతిని రాజధానిగా కొనసాగించే ఇష్టం లేక మూడు రాజధానుల గోలను తెర మీదకు తెచ్చింది. దీంతో 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అంద జేసిన ఆ ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, కౌలు రైతులు, దళిత రైతులు, మహిళలు  వివిధ రూపాలలో ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సర్కార్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని  గడువు కూడా విధించింది. కోర్టు మొట్టికాయలతో విధిలేని పరిస్థితిలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ రెడ్డి.. ఆ చట్టాన్ని మరింత పకడ్బందీగా తీసుకొస్తామంటూ అసెంబ్లీలోనే  తన వాచాలత ప్రదర్శించారు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ రెడ్డి అయితే వచ్చే ఎన్నికలలోగానే  మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో కోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. అమరావతి రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్ల పంపిణీ విషయం ఎంతవరకు వచ్చిందని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా నిలదీశింది. ఒక పక్కన అమరావతి రాజధాని రైతుల ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్కన కోర్టు కూడా ఆరా తీస్తున్నప్పటికీ విధ్వంస ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతుండడం పట్ల ఆ ప్రాంత  ప్రజలు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాజధాని శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన రహదారిని తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు గోవిందరెడ్డి  గత నెల 31న తవ్వేశారు. శంకుస్థాపన ప్రాంతానికి ఆ రహదారి కోసం వేసిన కంకర చిప్స్ ను రెండున్నర అడుగుల లోతులో 30 మీటర్ల పొడవున గోవిందరెడ్డి తవ్వేసి, ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోవడం సంచలనంగా మారింది. రాజధాని ప్రాంత రహదారిని గోవిందరెడ్డి తవ్వేయడంపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇతర ప్రాంతాల నుంచి అనుసంధానించే రహదారుల్లో అది కూడా ఒకటి కావడం విశేషం. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంకు ఈ రోడ్డు పశ్చిమ వైపున ఉంది. దీని నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. గోవిందరెడ్డి తవ్వేసిన రహదారి ప్రాంతాన్ని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రశాంతి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత రైతు గోవిందరెడ్డి నుంచి వివరణ తీసుకున్నారు. గోవిందరెడ్డి చెప్పిన సమాధానంతో ఆశ్చర్యపోవడం ఆర్ ఐ ప్రశాంతి వంతు అయింది. ఆ రహదారి ఉన్న పొలాన్ని తాను కొనుగోలు చేశానని, తన పొలాన్ని తాను చదును చేసుకోడానికే రహదారిని తవ్వేశానని గోవిందరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా రహదారిని తవ్వేసి తరలించుకెళ్లిన కంకర చిప్స్ ను తమ గ్రామంలో ప్రజోపయోగానికి వాడినట్లు కూడా చెప్పడం విశేషం. గోవిందరెడ్డి ఇచ్చిన వివరణతో తయారు చేసిన నివేదికను తాసిల్దారుకు ఆర్ ఐ ప్రశాంతి అందజేయడం గమనార్హం. ఆ నివేదిక ఆధారంగా పోలీస్ స్టేషన్ లో గోవిందరెడ్డిపై తాసిల్దారు ఫిర్యాదు చేశారు. రాజధాని రహదారిని తవ్వేసిన ప్రాంతంలో ఐకాస నేతలు నిరసనకు దిగారు. అమరావతిని నాశనం చేయాలనే దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్లే తరచు ఇలాంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటున్నారు. వైసీపీ నేతలే ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ రాజధాని ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే ఊరుకోవాలి కానీ ఇలా రాజధాని కోసం వేసిన రోడ్లను తవ్వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించడం సుతరామూ ఇష్టం లేని జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నారని, అమరావతి నిర్మాణాన్ని ఎలాగైనా కొండెక్కించాలనే కుట్రతోనే ఇలాంటి చర్యలకు దింపుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి.

ఆసియాక‌ప్ .. వారంలో మ‌ళ్లీ భార‌త్‌-పాక్ వార్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ పోటీ అన‌గానే యావ‌త్ క్రికెట్ వీరాభిమానుల‌కు గుర్తుచేసుకునే పోటీలు అతి పెద్ద‌వి రెండే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌, రెండోది భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య హోరాహోరీ జ‌రిగే  మ్యాచ్లు. వీటికే ప్రేక్ష‌కులు ఫిదా అయ్యేది. కార‌ణం యావ‌త్ క్రికెట్‌లో స‌త్తా ఉన్న ప్లేయ‌ర్లు, అస‌ లు ఉత్త‌మ స్థాయి ఆట ప్ర‌ద‌ర్శ‌న అనేది చూసి తరించ‌గ‌లిగేది ఈ నాలుగు జ‌ట్ల ధ‌నాధ‌న్ పోటీల్లోనే. ప్ర‌స్తు తం మ‌నం ఆసియా క‌ప్ పోటీలు చూసి త‌రిస్తున్నాం. ఆసియాక‌ప్ 2022 లో ఇప్ప‌టికే ఒక మ్యాచ్‌లో దాయాదులు క‌ల‌బ‌డ్డారు. మొద‌టి మ్యాచ్ భార‌త్ గెలిచింది. ఆసియా క‌ప్‌లో ఈసారి సూప‌ర్ 4 స్థాయికి రెండు వ‌చ్చాయి. వారం తిర‌క్కుండానే మ‌ళ్లీ ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త్ ఈ మ్యాచ్‌లో విజృం భించి గెలిస్తే ర‌వ్వంత స్వ‌ల్ప స్కోర్ తేడాతో గెలిచినా, పాక్ ఓడినా మ‌ళ్లీ ఫైన‌ల్‌కి త‌ల‌ప‌డే అవ‌కాశా లుంటాయి. అస‌లు సిస‌లు పోటీ అప్పుడు చూడ‌గ‌ల్గుతాం.  ఇక సూప‌ర్ 4 మ్యాచ్‌ల్లో భాగంగా భార‌త్‌, పాక్‌లు ఆదివారం (ఆగ‌ష్టు 4)న త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండు జ‌ట్లూ మంచి ప‌దును మీద ఉన్నాయి. రేపు జ‌రిగే మ్యాచ్ ప్ర‌క్ష‌కుల‌కు అత్యంత ఆస‌క్తిక‌ర, ఉత్సాహ‌భ‌రిత వాతావ ర‌ణంలో మ్యాచ్ ర‌క్తిక‌ట్టించే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే క్రికెట్ పండితులు అంటున్నారు. అంటే ఇది స‌హ‌జంగా దాయాదుల మ‌ధ్య జ‌రిగే పోటీ కాబ‌ట్టి అంతే స్థాయిలో జ‌రుగుతుంది, ఎక్క‌డ‌ యినా. కాకుంటే షార్జాలో గ‌నుక మ‌రింత ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఎవ‌రికి వారే ధీటుగా ఆడే ప్లేయ‌ర్ల‌తో రికార్డు స్థాయి పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌వ‌చ్చు.  భార‌త్‌కు విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌నే అంటున్నారు. ఈ టోర్నీలోనూ క‌ప్పును కాపాడుకుంటారన్న ధీమా కూడా వీరాభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. కార‌ణం  పాక్ జ‌ట్టులో అర‌వీర‌భ‌యంక‌ర లెఫ్టార్మ్ పేస‌ర్ షాహీన్ ఈ టోర్నీకి జ‌ట్టులోకి ఎంపిక కాలేదు. అత‌ని  మోకాటి గాయం కార‌ణంగా అత‌న్ని జ‌ట్టులోకి తీసుకోలేదు. వాస్త‌వానికి అత‌ను ఇటీవ‌ల భార‌త్ బ్యాట‌ర్ల‌కు పెద్ద ప‌రీక్ష‌పెట్టేడు. అచ్చం వాసిం అక్ర‌మ్ స్థాయి స్వింగ్‌తో బ్యాట‌ర్ల‌కు ద‌డ‌పుట్టించేడు.  కుర్రాడు, పొడుగ్గా వుండి ప‌రుగున వ‌చ్చి  బంతిని మ‌హా తెలివిగా స్వింగ్ చేస్తుంటే బ్యాట‌ర్లు బెంబేలెత్త‌క పోరు. ఆ అనుభ‌వం మ‌న వాళ్ల‌కి కొంత ద‌క్కింది. అత‌ను వ‌స్తే ఈ టోర్నీలో మ‌రింత గ‌ట్టి పోటీ ఉండేది. కానీ మ‌న‌వారికి అదృ ష్టం, పాక్‌కు దుర‌దృష్టం అత‌ను మోకాటి గాయంతో ఇంటికి ప‌రిమితం అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ వారి బౌలింగ్ విభాగాన్ని త‌క్కువ‌గా చూడాల్సిన‌దేమీ లేదు. పాక్‌కి మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, ఫ‌క‌ర్ జ‌మాన్ ఉన్నా రు. వారి ధాటిని ఎదుర్కొన‌డంలో కాస్తంత జాగ్ర‌త్త‌గా బ్యాట్ చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. శుక్ర‌వారం మ్యాచ్ అంత కు ముందు భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ పాక్ బౌల‌ర్లు మంచి నైపుణ్యాన్నే ప్ర‌ద‌ర్శించారు. అలాగే పాక్‌ను ఇబ్బందిపెట్ట‌గ‌లిగిన మ‌న ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా ఇక టోర్నీ లో ఆడ‌డు. అత‌ను కూడా మోచేతి గాయం కార‌ణంగా టోర్నీకి దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో జ‌ట్టులోకి మ‌రో ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ వ‌చ్చాడు. అయితే జ‌డేజా ఫీల్డ‌ర్‌గా అంత‌ర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సూప‌ర్ ప్లేయ‌ర్‌. మెరుపువేగంతో బంతిని ఆప‌డం, వికెట్లు ప‌డ‌గొట్ట‌డంలో ఏ గొప్ప అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్‌కీ తీసిపోడ‌ని పాక్ మాజీలు కూడా అంగీక‌రించారు. అత‌ని వేగం ముందు బ్యాట‌ర్లు బ‌హు జాగ్ర‌త్త‌గానే ఉంటారు. అంత‌టివాడు ఏకంగా ఇపుడు ఏకంగా టోర్నీకి గాయం కార‌ణంగా దూరం కావ‌ల‌సి వ‌చ్చింది. అలాగ‌ని అక్ష‌ర్ ప‌టేల్ త‌క్కువేమీ కాదు.  పోతే ఆసియా క‌ప్ టోర్నీల్లో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ , పాక్‌లు 16 మ్యాచ్‌ల్లో ఢీకొంటే భార‌త్ 9 మ్యాచ్‌లు, పాకిస్తాన్ 5 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫ‌లితాలు రాలేదు. అంటే ఒక‌టి టై కాగా, మ‌రొక‌టి ఫ‌ల‌తం తేల‌కుండానే ముగిసింది. ఆసియాక‌ప్‌లో భార‌త్ విజ‌యాలు 67.27 శాతం మేర‌కు ఉంది. కాగా మొత్తం మీద ఆసియా క్రికెట్ టోర్నీల్లో జ‌రిగిన 50 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 28 మ్యాచ్‌లు గెల‌చింది. అంటే ఇక్క‌డి పిచ్‌ల మీద వారికి సంపూర్ణ ఆధిప‌త్యం ఉంద‌నే అంగీక‌రించాలి. ఈ లెక్క‌లు, స‌త్తాల ప‌రంగా చూసుకుంటే రేప‌టి అంటే ఆదివారం ఆగ‌ష్టు 4వ తేదీ మ్యాచ్ రెండు సింహాలు ఢీకొన్న స్థాయిలో జ‌రిగే అవ‌కాశాలే ఉన్నాయి. ఇరు దేశాల క్రికెట్ వీరాభిమానుల‌తో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన వారూ మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ ఇలాంటి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఉత్కంఠ‌త‌కు ఆలవాల‌మ‌య్యే మ్యాచ్ చూడ‌టానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. జ‌య‌హో భార‌త్‌!

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. గుడివాడ అమర్నాథ్

కోర్టు తీర్పులు, ప్రజల ఆకాంక్షలు పట్టని నేతలు తాము చెప్పిందే వేదమని అంటారు. అనడమే కాదు అదే నమ్ముతారు. ఎవరేమన్నా, ఎన్ని విధాలుగా తప్పుపట్టినా వారికి పట్టనే పట్టదు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కూడా అదే వరుసకు చెందుతారు. ఒక వైపు కోర్టు మొట్టి కాయలు, మరో వైపు అమరావతి రైతుల ఆందోళన ఇవేమీ పట్టించుకోకుండావచ్చే ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం(సెప్టెంబర్ 2) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను జైలుకు పంపాలన్నారు. వారిరువురూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామన్న గుడివాడ అమర్నాథ్.. అయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తామెక్కడా చెప్పలేదన్న కొత్త వాదనకు తెరలేపారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబుకు జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానులపైనే చర్చ ఉంటుందన్నారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించడాన్ని మంత్రి అమర్నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు.