పంచాయితీల నిధులకు రెక్కలు
posted on Sep 3, 2022 @ 1:29PM
మాయలు, మంత్రతంత్రాలూ సినిమాల్లోనే చూస్తాం. కొండకచో పురాణకథల్లో వింటాం. కానీ వాస్తవంగా మాయాజాల ప్రదర్శన నిధుల విషయంలోకూడా అవుతుందనేది ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌లో గమనిస్తు న్నారు. కొన్ని ఊహించనివిధంగా జరిగిపోతూంటాయి. కొన్ని చూస్తుండగానే మాయమైపోతూంటాయి. ఇలాగని చెబుతూంటే వినడమే గాని ఈరోజుల్లో చూసిన దాఖలాలు తక్కువే. కానీ పంచాయితీ నిధుల విషయంలో మరోసారి నిధుల మాయం చిత్రం ప్రదర్శితమయింది.
కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని చెబుతున్న రూ. 569 కోట్ల ఆర్థిక సంఘ నిధులు ఎక్కడని పంచా యతీ సర్పంచ్‌లు ఆరా తీస్తున్నారు. కరెంట్ బిల్లుల బకాయిల రూపంలో పంచాయతీలకు వస్తున్న నిధులను నొక్కేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను కూడా అలా మింగేసిందేమోనని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధు లను పంచాయతీలు ఓపెన్ చేసిన ప్రత్యేక అకౌంట్లలో జమ చేయాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు. ఈ అకౌంట్లలో కేంద్రం నుంచి వచ్చే నిధులను జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు నిధులు జమ కాలేదు.
పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ, మురుగునీటి పునర్ వినియోగానికి సుమారు రూ. 569 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇందులో 60 శాతం నిధులు తాము సూచించిన అంశాలకు, మిగి లిన 40 శాతం నిధులు స్థానిక అవసరాలను తెలుసుకుని కేటాయించుకోవచ్చునని కేంద్రం సూచిం చింది. అయితే కేంద్రం నిధులను విడుదల చేసినట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ నేటి వరకు పంచాయతీలకు జమ కాలేదు. పది రోజుల్లోగా స్థానిక సంస్థలకు ఈ నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది.