వేలుముద్రమార్చే సర్జరీతో విదేశాలకు!
posted on Sep 3, 2022 @ 4:33PM
గళ్లలుంగీ, చారల టీషర్టు వేసుకోగానే సినిమాల్లో హీరో కూడా దొంగగా మారిపోతాడు. దొంగ, రౌడీ అనగానే అదే డ్రస్ కోడ్. వెధవ పనులకు వేయి మార్గాలన్నారు. టికెట్ లేకుండా దొంగప్రాయాణానికి వేయి మార్గా లు అనుసరిస్తారు. ఉద్యోగానికి సర్టిఫికెట్లు మార్చేవారున్నారు. చిత్రంగా ఫింగర్‌ప్రింట్ తెలీకుండా సర్జరీ లు చేసుకుని మరీ ఉద్యోగాలు కొట్టేసే ప్రయత్నాలుచేసేవారున్నారు. ఇదుగో ఈ చివరి గ్యాంగ్‌నే ఇటీవల తెలంగాణాలో పట్టుకున్నారు.
ఇల్లాకూడా ఉద్యోగాలు కొట్టేస్తారా అంటే అవుననే అంటున్నారు తెలంగాణా పోలీసులు. కువైట్‌నుంచి కొంతమంది దేశంలోకి చొరబడ్డారు. వారేమీ మామూలుగా వచ్చినవారు కాదు. వారి ఆచూకీ తెలుసుకోవడా నికి పోలీసులు ఫింగర్ ప్రింట్లు సేకరించి పట్టుకుంటారన్న అనుమానంతోనే వారంతా ఫింగర్ ప్రింట్స్ మార్చుకుని రాగలిగారు. వీరికి ఒక ముఠా సహకరించింది. అలా వచ్చేవారికి సర్జరీ చేసి మరీ దేశంలోకి వదులుతున్నారట. అంటే బొటనవేలుకి సర్జరీ చేసి అనుమానం రాకుండా చేస్తున్నారు. అంటే ఎక్కడ న్నా ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి వచ్చినా దర్జాగా ఇవ్వొచ్చు. మామూలుగా అయితే భయపడతాం. కానీ దేశం బయటికి వెళ్లేటపుడు ఫింగర్ ప్రింట్స్ అడుగుతారు. అక్కడ దొరికిపోతారు. ఇపుడు ఆ అడ్డు కూడా తొల గించుకోవడానికి ఒక సర్జీరీ ద్వారా మార్గం ఏర్పడింది. సర్జరీ చేసి మరీ యువతను దేశం దాటిస్తు న్నారట.
చిత్రమేమంటే, ఈ ఆపరేషన్ వ్యవహారమంతా కడపకి చెందిన గజ్జలకొండ నాగమునీశ్వర్ రెడ్డి అనే రేడి యోగ్రాఫర్, సాగబాల వెంకటరమణ అనే అనెస్తీషియా టెక్నీషియన్ ఈ పనులు చేపడుతున్నట్టు పోలీసు ల విచారణలో తేలింది. ఆ గ్యాంగ్ కువైట్ నుంచి వచ్చే వారికి, వెళ్లేవారికి వీసా పనులు కూడా చేసేవారని పోలీసు అధికారులు తెలిపారు. అసలు అన్నింటికంటే ఆశ్చర్యమేమంటే, మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కువైట్ వెళ్లొచ్చాడట, అదీ శ్రీలంకలో ఫింగర్‌ప్రింట్ ఆల్టర్ సర్జరీ చేయించుకుని. అదే పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఆ అనుభవంతోనే రమణతో కలిసి ఈ వ్యాపారం సాగించాడు. రాజ స్థాన్‌లో రెండు సర్జరీలు, కేరళలో ఆరు, తెలంగాణాలో మూడు సర్జరీలు చేశారట. ఓర్నాయనో ఎంత ధైర్యం!