జగన్ లో పీక్స్ కి చేరిన ఫ్రస్ట్రేషన్.. పదవుల నుంచి తొలగిస్తానంటూ మంత్రులకు వార్నింగ్

సొంత పార్టీలోనే తనకు మద్దతు కరవైందని జగన్ భావిస్తున్నారా? అంటే ఆయన మాటలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తున్నది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ లో ఏం చర్చించారు. ఏం నిర్ణయాలు తీసుకున్నారు అన్నది పక్కన పెడితే.. కేబినెట్ భేటీ తరువాత జగన్ తన మంత్రి వర్గ సహచరులతో మాట్లాడిన మాటలు ఆయన ఎంత ఫస్ట్రేషన్ లో ఉన్నారన్నది తేటతెల్లం చేసింది. కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు ఎవరూ తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తన సతీమణి భారతిపై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. తన సతీమణిపై విపక్ష నేతల ఆరోపణలను ఎవరూ దీటుగా ఖండించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష విమర్శలకు ఎప్పటికప్పుడు దీటుగా బదులివ్వాలని విస్పష్ట ఆదేశాలిచ్చారు. అలా చేయని మంత్రులను మార్చేస్తాను, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వనని హెచ్చరించారు. కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో మాట్లాడిన జగన్ ప్రధానంగా తన సతీమణి భారతిపై లిక్కర్ స్కాం విషయంలో విపక్షాలు చేసిన ఆరోపణలనే ప్రధానంగా ప్రస్తావించారు. తెలుగుదేశం విమర్శలను, ఆరోపణలను తిప్పి కొట్టే విషయంలో ఎవరూ సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంతో తానొక్కడినే పోరాడుతున్నాననీ, ఎవరూ పట్టించుకోవడం లేదనీ నిష్టూరమాడారు. ఇక ముందు ఇలా జరిగితే సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రులను మార్చేయడానికి కూడా వెనుకాడనని విస్పష్ట హెచ్చరిక చేశారు. ఒక్క విపక్షంపైనే కాదు.. వైసీపీ ప్రభుత్వానికీ, పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే మీడియా మీద కూడా ఎదురుదాడికి దిగాలని స్వయంగా జగన్ తన కేబినెట్ సహచరులకు పిలుపు నిచ్చారు. జగన్ మంత్రులకు తీసుకున్న క్లాస్ ప్రభావమో ఏమో కానీ ముఖ్యమంత్రి సతీమణిపై విమర్శలేమిటంటూ బొత్స మీడియా ముందు విపక్షాలపై విమర్శలు చేశారు. అయినా జగన్ క్లాస్ తీసుకున్నారని కాదు కానీ ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు చాలా వరకూ సైలెంటైపోయారని పరిశీలకులు సైతం అంటున్నారు. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం,  ఆఖరికి జగన్ సభలకు కూడా జనం హాజరు తక్కువైపోవడం ఆ వచ్చిన వారిలో కూడా చాలా మంది జగన్ ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోవడం వంటి సంఘటనలతో వైసీపీ నేతలు చాలా వరకూ సైలంట్ అయిపోయారు. మరీ ముఖ్యంగా గడపగడపకూ మన ప్రభుత్వంలో ఎదురైన నిరసన సెగలకు మంత్రులు కూడా చాలా వరకూ విపక్షంపై విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్న పరిస్థితి. అదీ కాక జగన్ దృష్టిలో పడాలంటే మామూలుగా విపక్ష నేతలను విమర్శిస్తే సరిపోదు. విమర్శల తీవ్రత బూతుల స్థాయిలో ఉండాలి. అందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ మంత్రి వర్గ సహచరులతో భేటీలో అసహనం వ్యక్తం  చేశారు. వాస్తవానికి పోతుల సునీత లాంటి వాళ్లు.. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను బండబూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టినా వాటిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఇక మహిళా మంత్రులు  రోజా, అనిత, విడదల రజనీ లాంటి వాళ్లు జగన్ సతీమణి భారతిపై విపక్షం విమర్శలపై పెద్దగా స్పందించలేదు. ద్దగా స్పందించలేదు. మంత్రోరులు జా, అనిత విదేశీ టూర్‌లో ఉన్నారు. వారిరువురిలో రోజా అయితే కేబినెట్ మీటింగ్ సమయానికి వచ్చారు. విడదల రజనీ విషయానికి వస్తే   సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం చేసుకోవడం మినహా   టీడీపీపై విమర్శలు చేయడానికి అస్సలు ముందుకు రారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

బెజవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున?

రాజ‌కీయాల‌కు సినీరంగానికి సంబంధాలు అనాదిగా ఉన్న‌దే. సినీహీరోలు, హీరోయిన్లు  రాజ‌కీయ‌పార్టీ నాయ‌కులతో ఉన్న స్నేహ‌బంధం అనుస‌రించి క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రావ‌డం జ‌రుగుతూ వ‌చ్చింది. కాలక్ర‌మంలో పార్టీ నాయ‌కులు సినీ ప్ర‌ముఖుల స్నేహాన్ని ఆశించ‌డం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఈ మైత్రి ప్ర‌భావం గురించిన చ‌ర్చ‌లే విన‌వ‌స్తున్నాయి. ఇటీవ‌ల అధికారంలో ఉన్న పార్టీలు కూడా విప‌క్షాల‌తో పోటీప‌డి మ‌రీ సినీరంగ ప్ర‌ముఖుల‌కు గాలం వేయ‌డం జ‌రుగుతోంది. ఈమ‌ధ్య‌నే బీజేపీ  సీనియ‌ర్ నాయ‌కులు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లోని టాలీవుడ్ హీరోల‌కు గాలం వేయ‌డానికి ప్ర‌య‌త్నిం చారు. అందులో భాగంగానే అమిత్ షా ఎన్టీఆర్‌ను, న‌డ్డా నితిన్‌నీ క‌లిశారు. స‌మావేశాల ఫ‌లితం  ఎలా ఉన్నా యంగ్ హీరోల ప్ర‌భావం ప్ర‌జ‌ల మీద ఉంటుంద‌న్న న‌మ్మ‌కం వారిలో బ‌లంగా నాటు కుంది. ఇలా నే ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా టాలీవుడ్ సూప‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌ను పార్టీలోకి లాగేయాల‌ని గాలం వేశారు.  జగన్కు ఆత్మీయ స్నేహితుడినని చెప్పుకున్న నాగార్జునపైనా వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఆయనను ఎలాగైనా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఒప్పించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. గతంలోనే ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ నాగార్జున సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం విజయవాడలో గట్టిపోటీ ఇవ్వాలంటే నాగార్జున లాంటి స్టార్ అవసరమని భావిస్తున్నారు. దీంతో నాగార్జున పోటీకి అంగీకరించారని కొన్ని ప్రో వైసీపీ సోషల్ మీడియాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లలోనూ లీకులు ఇప్పించారు.  అయితే నాగార్జున తీరు చూస్తే ఆయన రాజకీయాలకు అంటీ ముట్టనట్లే ఉన్నారు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజ కీయాల్లోకి రాలేదు. జగన్ తో అయినా ఇతరులతో అయినా పరిచయాల్ని వ్యక్తిగత స్నేహం వరకే ఉంచారు కానీ రాజకీయాల వరకూ తీసుకు రాలేదు. నొప్పింపక తానొవ్వక అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆయన చేసిన సాయం గురించి రాజకీయవర్గాలు కథలు కథలుగా చెప్పుకుం టాయి. కానీ ఆయన మాత్రం నేరుగా వైసీపీకి మద్దతు ప్రకటించలేదు. ఇప్పుడు ఆయనను ఎలాగైనా పార్టీ లో చేర్చుకోవాలని ప్రయత్ని స్తున్నట్లుగా తెలుస్తోంది. మీడియా ద్వారా లీకులిచ్చి.. ఆ తరవాత వైసీపీ హైకమాండ్ ఆయన వద్ద ఆ ప్రతిపాదన పెట్టి,  తిరస్కరించలేని విధంగా ఫిక్స్ చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగా ర్జున వ్యాపార, ఆర్థిక లింకుల కారణంగా ఈ సారి తప్పించుకోలేకపోవ చ్చున నే వాదన కూడా వినిపిస్తోంది. అయితే, హీరో నాగార్జున్  రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆస‌క్తి చూపుతున్నారా అన్న‌ది అనుమాన‌మే. గ‌తంలో వైఎస్ ఆర్ ప్ర‌బుత్వ హ‌యాంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన యాడ్స్‌లో క‌నిపించారు.కానీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆస‌క్తి అప్పుడూ ప్ర‌ద‌ర్శించ‌లేదు. ప్ర‌భుత్వం అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల ఆక‌ర్షితుడ‌యి యాడ్స్‌లో న‌టించాడు కానీ రాజ‌కీయాల‌ప‌ట్ల కాద‌న్న‌ది నాగార్జున మాట‌గా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి ఇలాంటి నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సినీ హీరోని త‌న వేపు తిప్పుకోగ‌ల‌డ‌న్న‌ది ప్ర‌శ్నార్ధ‌క‌మే. 

మునుగోడులోనూ మునక తప్పదా? కమలనాథుల్లో ఆందోళన

కమల వికాసం అంటూ బీజేపీ చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. వ్యూహాలు తల్లకిందులౌతున్నాయి. స్వల్ప వ్యవధిలో బీహార్ లో, జార్ఖండ్ లో కమల వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ప్రభుత్వాలను పడగొట్టేందుకు చేసిన ప్రయోగాలు వికటించాయి. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వమే కూలిపోయింది, జార్ఖండ్ లో బీజేపీ పరువు గంగలో కలిసి నవ్వుల పాలైంది. ఇప్పుడు ఇక మునుగోడులో ఉప ఎన్నికను బలవంతంగా తీసుకు వచ్చిన ఆ పార్టీ ఎత్తుగడ అయినా ఫలిస్తుందా అంటే పరిశీలకులు ఏమో అనే అంటున్నారు. బీజేపీయేతర   పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కమల నాథులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది బిజెపి నాయకత్వం. అందులో భాగంగానే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక కు తెరలేచింది. అయితే, దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు.. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందో తెలియని పరిస్థితి.   కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ప్రయోగాలు ఫలించి అధికారం దక్కడంతో    బీహార్, ఢిల్లీ,ఝార్ఖండ్ రాష్ట్రాలలోనూ అదే ప్రయోగాన్ని అప్లై చేసిన కమలనథులకు శృంగభంగమైంది.  ముఖ్యంగా బిజెపియేతర పార్టీలు పరిపాలన సాగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చైనా సరే అధికారం దక్కించుకోవాలనే వ్యూహంతో ఇటీవల బీజేపీ పావులు కదపడం ఎక్కువైంది. ఓ రెండు రాష్ట్రాలలో (కర్నాటక, మహారాష్ట్ర)   బీజేపీ  వ్యూహాలు ఫలించి, ఎత్తుగడలు విజయవంతమైనా, ఆదే బాటలో మరో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సర్కార్ లను కూల్చేయడానికి బీజేపీ ప్రయోగాలు వికటించాయి, వ్యూహాలు తల్లకిందులయ్యాయి. బీహార్ లో అయితే ఏకంగా బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం కూలిపోయింది. జార్ఖండ్, ఢిల్లీలలో ప్రయోగం వికటించడమే కాకుండా బీజేపీ పరువు గంగలో కలిసింది. పార్టీ అగ్రనాయకత్వం నవ్వుల పాలైంది.   డిల్లీ, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో  వరుసగా బీజేపీ పరువు బజారున పడటమే కాకుండా ప్రభుత్వాలు కూల్చడానికి కేంద్రం   దుష్టపన్నాగాలు పన్నుతోందన్న అప్రదిష్ట మూటగట్టుకుంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు  మునుగోడు ఉపఎన్నిక ను బలవంతంగా ముందుకు తీసుకువచ్చి విజయం సాధించి ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ విజయాన్ని అలంబన చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఈ వ్యూహమైనా ఫలిస్తుందా అంటే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఎందుకంటే తెలంగాణలో ఇంకా చెప్పాలంటే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలంలేదనీ, మొత్తం తెరాస నుంచి కమలం గూటికి చేరి బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టపైనే బీజేపీ పూర్తిగా ఆధారపడిందనీ అంటున్నారు. అందుకే ఇక్కడ బీజేపీ గెలుపు ఎంత మాత్రం నల్లేరుమీద బండి నడక కాదంటున్నారు. అలాగే మునుగోడు ఉప ఎన్నిక పై ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సర్వేలలోనూ కమలం పార్టీ మూడో స్థానంలో ఉండటం, ఇక్కడ తెరాస, కాంగ్రెస్ ల మధ్యే పోరు ఉంటుందని సర్వేలు తేల్చేశాయి.  కర్ణాటకలో జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చడంలో.. మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని దింపడంలో మాత్రమే బీజేపీ వ్యూహం ఫలించింది, ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత వరుసగా బీజేపీ ప్రయోగాలు వికటించాయి, వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు మునుగోడులో కూడా పరాభవం ఎదురైతే ఆ ప్రభావం తప్పని సరిగా 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందన్న ఆందోళన, భయం ఇప్పుడు కమలనాథుల్లో వ్యక్తం అవుతోంది.   

రూ.405 కోట్ల‌తో ప్ర‌ధానికి నివాసం..బీజేపీ నేత‌లు ఇప్పుడేమంటారు?

దేశంలో ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి, లోక్‌స‌భ స్పీక‌ర్‌, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌, రాష్ట్రాల సీఎంల‌కు నివాసాలు ఏర్పాటు చేయ‌డం ఆన‌వాయితీగా ఉన్న‌దే. అయితే ప్ర‌భుత్వాలు వాటికి ఒక ప‌రిమితి, నిబంధ‌న‌లు అనుస‌రించి చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. అయితే  మ‌రో రెండేళ్ల‌లో రూ.405 కోట్ల‌తో  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి నివాస భ‌వ‌న స‌ముదాయం ఏర్పాటు కానుంది.  వాస్త‌వానికి  అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్న‌వారికి  వారి ప‌ద‌వీకాలంలో ఉండే నివాసాలు ఎలాంటి  మార్పు చేర్పులు చేయించుకోవాల‌ని అనుకోరు. ప‌ద‌వుల్లో ఉన్నంత కాల‌మే ఆ భ‌వ‌నాల్లో ఉంటారుగ‌నుక వారికి తోచిన విధంగా  మార్చుకోవాల‌న్న ఆలోచ‌నా చేయ‌రు. అయితే తెలంగానా సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌లో సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌న‌స‌ముదాయం పురాత‌న‌మైన‌ద‌ని, మ‌రేవో కార‌ణాలు చెప్పి భారీ ఎత్తున కొత్త భ‌వ‌న స‌ముదాయాన్ని నిర్మిస్తున్నారు. కానీ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ప్ర‌జ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు  స్వీక‌రి స్తున్న ఉస్మానియా, గాంధీ  ఆస్ప‌త్రుల్లో ప‌రిస్థితులు మెరుగుప‌ర్చ‌డానికి మాత్రం ఆయ‌న ఎలాంటి  గ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోయారు. పాల‌నా సౌక‌ర్యాల‌కు అనుగుణంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల విష‌యంలో ప్ర‌ద‌ర్శించిన దూకుడు ప్ర‌జారోగ్య సంబంధిత ఆస్ప‌త్రుల విష‌యంలో ప్ర‌ద‌ర్శించ‌లేకపో యారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు, విప‌క్షాల నుంచి భారీ విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ ఉన్నాయి.  ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో  బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాల్లో చీమ చిట్టుక్కుమ‌న్నా బీజేపీ నాయ‌కులు, వీరాభిమానులు విరుచుకుప‌డ‌టం గ‌మ‌నిస్తున్నాం. స‌భ‌లు, స‌మా వేశాలు, ర్యాలీలు, రోడ్డు షోల‌కు ప్ర‌భు త్వ సొమ్ము పెడుతున్నార‌ని, జ‌నాన్ని పోగేయ‌డానికి స‌భ‌లు నిర్వ హించ‌డానికి ప్ర‌భుత్వం సొమ్మునే ఉప యోగిస్తున్నార‌ని, త‌మ స్వంత అవ‌స‌రాల‌కు పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వ సొమ్మును, వాహ‌నాల వినియోగం జ‌రుగుతోంద‌ని బీజేపీ విరుచుకుప‌డుతోంది. ఇది దాదాపు ప్ర‌తీరోజూ  ఏదో ఒక రాష్ట్రంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌.  న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివసించేందుకు ఓ కొత్త భవన సముదాయం సిద్ధం కానుంది.  రాష్ట్రపతి భవన్కు సమీపంలో సౌత్‌బ్లాక్‌ వెనుకవైపు ఈ భవనాన్ని 2,26,203 చదరపు అడుగుల విస్తీర్ణంలో  రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ప్రధాని నివాసాన్ని 36,328 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టనున్నారు. దీంతో పాటు ప్రధాని కాన్వాయ్‌ వెళ్లేందుకు భూగర్భంలో ఒక సొరంగం కూడా నిర్మించా ల న్న ప్రతిపాదన ఉన్నది. రెండేండ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టులో ప్రధానికి కార్యాలయం, ఇండోర్‌ క్రీడల సదుపాయం, సిబ్బందికి క్వార్టర్లు, ఎస్పీజీ ఆఫీసు, సేవా సదన్‌, భద్రతా కార్యాలయం ఉండను న్నాయి. సొరంగ మార్గాన్ని నేరుగా ప్రధాని ఇంటి నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌ క్లేవ్‌లోని ప్రధాన కార్యాలయానికి, నూతన పార్లమెంట్‌కు, ఉపరాష్ట్రపతి నివాసానికి అను సంధానిస్తారు.  ప్రస్తుతం మోదీ నివాసముంటున్న 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని భవనం పీఎంవోకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రధాని తన నివాసం నుంచి పీఎంవోకు వెళ్లే సమయంలో ప్రతిరోజు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఏర్పడుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది కానీ.. తెలంగాణలో సీఎం అధికార నివాసం కోసం ప్రగతి భవన్‌ను నిర్మిస్తే.. దానిలో వందల గదులున్నాయని, దాన్ని కూల్చేస్తామని ప్రతినలు బూనిన రాష్ట్ర బీజేపీ నేతలూ.. ప్రధాని కొత్త నివాసంపై ఏమంటారో చూడాలి. 

మునుగోడు.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు..!

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్. ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఉప ఎన్నిక గురించిన చర్చే జరుగుతోంది. ఆ చర్చలకు తగ్గట్టే అక్కడి రాజకీయాలు రంగులు మారుతున్నాయి.  మూడు ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీ.. ఇక్కడ గెలుపే లక్ష్యంగా వలస రాజకీయాలను భారీగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలూ పావులు కదుపుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా.. స్థానిక నాయకులు కూడా అటు నుంచి ఇటూ ఇటు నుంచి అటూ పార్టీలు మారుతూ.. తమ తమ డిమాండ్లను నెరవేర్చుకుంటున్నారు. తాజాగా.. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చండూరు మండలం దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్.. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో.. ఆయనపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్.. దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరేలా పావులు కదిపింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో దేవేందర్ మళ్లీ కారెక్కారు.   వలస రాజకీయాలను ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు సైతం ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. టీఆర్ఎస్  పార్టీలో ఆసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి.. తమ తమ పార్టీల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు బీజేపీ, కాంగ్రెస్ లు ముమ్మరంగా చేస్తున్నారు. కాంగ్రెస్ మాట ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ను  వేగం చేసింది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీలో చేరికలను పెంచుతున్నారు.  గతంలో ఉన్న పరిచయాలతో.. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల వరకు.. అందర్నీ బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక ముక్కు ద్వారా  కోవిడ్ టీకా

దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ కోవిడ్ విస్త‌రిస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. కోవిడ్‌-19 నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఈమ‌ధ్య వ‌ర‌కూ కోవాక్సిన్‌, కోవీషీల్డ్ ఇంజ‌క్ష‌న్‌లు రెండు విడ‌త‌లు తీసుకోవ‌డంతో  ప్ర‌జ‌లు కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే కోవిడ్ విస్త‌ర‌ణ తొలిద‌శ‌లో దాని గురించిన అవ‌గాహ‌న అంత‌గా లేక‌పోవ‌డం, ఈ ఇంజ‌క్ష‌న్‌లు అప్ప‌టికి పూర్తిగా అందుబాటులోకి రావ‌డం జాప్యం కార‌ణంగా ల‌క్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత వైద్య‌ప‌రిశోధ‌క సంస్థ‌ల స‌హాయంతో దేశంలో ఇంజ‌ క్ష‌న్‌ల ఉత్ప‌త్తి పెద్ద స్థాయిలో జ‌రిగింది. దేశంలోనేకాకుండా విదేశాల వారికీ ఈ ఇంజ‌క్షన్‌లు అందు బాటులోకి తెచ్చి భార‌త్ ప్ర‌తిష్ట పెరిగింది. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ ప్ర‌పంచ దేశాల కు చేసిన స‌హాయ స‌హ‌కారా ల‌ను ఏకంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది.   కోవిడ్ మూడో ద‌శ వ‌స్తోంద‌న్న భ‌యాందోళన‌లు వాస్త‌వానికి అంత‌గా లేవు. కార‌ణం ఇప్ప‌టికే దాన్ని గురిం చి పూర్తి అవ‌గాహ‌న ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌డం, ఇంజక్ష‌న్‌లు తీసుకోవ‌డం, బూస్ట‌ర్‌డోస్ పేర మ‌రో విడ‌త ఇంజ‌క్ష‌న్ తీసుకోవ‌డం కూడా జ‌రుగుతోంది. అయితే, ఈ త‌రుణంలో ఇంజ‌క్ష‌న్‌ల విష‌యంలో ఇబ్బందులు త‌ప్పించడానికి ముక్కు ద్వారా  ఇచ్చే టీకాను అందుబాటులోకి వ‌చ్చింది. అంతేకాక‌, దాని వినియోగానికి కేంద్ర ప్ర‌భుత్వం కూడా అనుమ‌తినిచ్చింది.  దేశంలోనే తొలి ముక్కు ద్వారా టీకా (నాజ‌ల్ ఇన్‌జ‌క్ష‌న్‌) అందుబాటులోకి వస్తుంది. ముక్కు ద్యారా  18 ఏళ్లు దాటినవారికి  ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. నాలుగు వేలమందిపై క్లినికల్  ట్రయల్స్ చేసిన తరువాత సురక్షితమని తేలి నట్లు వెల్లడించింది సంస్థవైరస్పై పోరులో ముందడుగు వేసింది భారత్ బయోటెక్  ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ టీకాకు  డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది.  ఇప్పటివరకు మనం తీసుకున్న కొవిడ్ టీకాలన్నీ సూది ద్వారా శరీరంలోకి ఇచ్చేవే. అయితే,  వాటికి  భి న్నంగా ముక్కు ద్వారా తీసుకునే టీకాఇకపై అందుబాటులోకి రానుంది. ఈ తరహాలో తొలిసారిగా.. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవిడ్ నాసల్ వ్యాక్సిన్ (బీబీవీ 154)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్  ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాను ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది.  ముక్కు ద్వారా ఇచ్చే టీకాకు నాలుగు వేల మంది వాలంటీర్ల మీద క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఎటువంటి  దు ష్ప్రభావాలు కనిపించలేదని బీబీవీ 154 సురక్షితమని తేలినట్లు పేర్కొంది.  కాగా, ఆగస్టులో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ టీకా కొవిడ్ కు  వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తుందని  తేలినట్లు వివరించింది. కాగా, ముక్కు ద్వారా  ఇచ్చే వ్యాక్సిన్ కు  అనుమతుల మంజూరు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్‌ మాండవీయ  స్పందిస్తూ,  కొవిడ్ పై  పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడిందని అభివర్ణిం చారు. మహమ్మారి మీద సమరంలో భారతీయుల సమష్టిపోరాటాన్ని ఇంకా బలోపేతం చేస్తుంద న్నారు. బీబీవీ 154.. దేశంలో ముక్కు ద్వారా ఇచ్చేందుకు అనుమతులు పొందిన తొలి కొవిడ్ టీకా. మార్పులు చేసిన చింపాంజీ అడినో వైరస్ వెక్టార్ సాయంతో రూపొందించారు. అమెరికాలోని సెయింట్ లూయీస్ లో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీతో కలిసి దీనిని తయారు చేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

అన్న క్యాంటిన్ అంటే వైసీపీకి ఇంత వణుకెందుకు?

నిరుపేద అన్నార్తులకు అతి తక్కువ ధరకే పట్టెడన్నం పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం.. అన్న అని అందరూ పిలుచుకునే ఎన్టీ రామారావు పేరు మీద టీడీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు సక్రమంగా నడిచాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఇంత అన్నం ముద్ద దొరికేది. అయితే.. అన్నా క్యాంటీన్లు అంటేనే వైసీపీ నేతల్లో వణుకు వచ్చేస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు సిద్ధమైనా వైసీపీ శ్రేణులు దాడులు, విధ్వంసాలకు దిగుతున్నారు. అయితే.. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో ఏర్పడ్డ వైసీపీ సర్కార్ అన్న క్యాంటీన్లను పట్టించుకోలేదు. దాంతో అన్నా క్యాంటీన్లను కొనసాగించాలనే డిమాండ్ అన్నార్తుల నుంచి గట్టిగా వినిపించింది. కానీ.. ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ ముద్ర ఈ క్యాంటీన్లపై ఉండడంతో జగన్ రెడ్డి సర్కార్ ఏ మాత్రం సహించలేకపోయింది. నిరుపేదల డిమాండ్ ఎక్కువైన క్రమంలో అన్నా క్యాంటీన్ల పేరు రాజన్న క్యాంటీన్లుగా మార్చేసి నడిపించాలని భావించింది. ఆ వెంటనే అన్న క్యాంటీన్ భవనాల రంగులు కూడా మార్చి, కొన్నాళ్ల తర్వాత వాటిని నిర్వహిస్తామని కాలయాపన చేసింది. ఆ తర్వాత క్యాంటీన్ల ఊసే లేకుండా వైసీపీ సర్కార్ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ పేరుతో కొన్నాళ్లు అన్నదానం నిర్వహించారు. పేదల కడుపు నింపే ఆ క్యాంటీన్ అతీ గతీ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఏపీలోని నిరుపేదల ఆకలి తీర్చేందుకు వైసీపీ సర్కార్ కు ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించిన ప్రతిపక్ష టీడీపీ నేతలే స్వయంగా రంగంలోకి దిగారు. పలు చోట్ల సొంత నిధులతో అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు టీడీపీ నేతలు రెడీ అయితే.. వైసీపీ శ్రేణులు, పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆ తదుపరి చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభించే సమయానికి వైసీపీ నేతలు, శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. అక్కడితో ఆగకుండా అన్న క్యాంటీన్ ను ప్రారంభించేందుకు వెళ్లిన చంద్రబాబుపై దాడికి యత్నించే దాకా పరిస్థితి వెళ్లింది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు ఆకలితో వచ్చిన నిరుపేదలపై ఆడా మగా తేడా లేకుండా పోలీసులు లాఠీలు ఝళిపించడం విమర్శలకు దారితీసింది. పేదలకు అన్నదానం చేసేందుకు వచ్చే టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇనుప ముళ్ల కంచెల, బారికేడ్లతో అడ్డుకున్నారు. ట్రాఫిక్ సాకు చూపించి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదేశారు. ఆహార పదార్థాలను బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తొక్కేశారు. తెనాలి మార్కెట్ సెంటర్ ను పోలీసులు రణరంగంలా మార్చేశారు. ఏపీలో ఎక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభం అవుతున్నా.. లేక ఇప్పటికే నడుస్తున్న చోట్ల వైసీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యకాండ జరిగిపోతూనే ఉంది. టీడీపీ నేతలను అరెస్టులు చేయించడం, కేసులు పెట్టించడం లాంటివి జనంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. పేదల పక్షాన టీడీపీ నేతలు నిలబడుతుంటే.. వైసీపీలో రోజు రోజుకూ ఆందోళన పెరిగిపోతోందంటున్నారు. అన్న క్యాంటీన్ల కోసం వేసిన పందిళ్లను, ఫ్లెక్సీలను తొలగిస్తోంది. అన్న క్యాంటీన్లు నడిస్తే.. టీడీపీ పట్ల ప్రజల్లో సింపతీ పెరిగిపోతుందనే వణుకు వైసీపీలో వచ్చేస్తోంది. అన్నా క్యాంటీన్లకు క్యూలు కట్టి మరీ నిరుపేదలు అన్నం కోసం పోటెత్తి వస్తుంటే.. చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ఇలా దారుణాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్న క్యాంటీన్లు ఒక విధంగా టీడీపీకి ప్లస్ పాయింట్ గా మారితే.. వైసీపీకి పెద్ద మైనస్ పాయింట్ అవుతున్నాయనే వాస్తవం అధికార పార్టీ అస్సలు సహించలేకపోతోందంటున్నారు. అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడవడం ఇష్టం లేకే ఇలా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నిధులతో హిందూపురం నియోజకవర్గంలో 2 రూపాయలకే నిరుపేదలకు చికెన్, గుడ్డుతో కూడిన ప్రత్యే మాంసాహార భోజనాన్ని కడుపు నిండా పెడుతున్న అన్న క్యాంటీన్ 100 రోజులగా నిరాటంకంగా సాగుతుండటం పూర్తిచేసుకోవడం కొసమెరుపు.

ఉండవల్లి అనూషకు నోటీసులు

తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు అనంతపురం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మావతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేటలోని ఉండవల్లి అనూషకు చెందిన బట్టల దుకాణానికి వచ్చి.. అనంతపురం పోలీసులు.. ఆమెకు 41ఏ నోటీసులు అందజేశారు. అయితే సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై పెట్టిన పోస్టులపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆమె పోలీసులు స్పష్టం చేశారు. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు తనకు అందిన నోటీసులపై ఉండవల్లి అనూష స్పందించారు. ఈ నోటీసుల్లో పేర్కొన్న సోషల్ మీడియా ఐడీలు తనవి కావని ఆమె స్పష్టం చేశారు. ఎవరో తప్పుడు ఫిర్యాదు చేస్తే... అనంతపురం జిల్లా పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇది ముమ్మమాటికి ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఉండవల్లి అనూష వెల్లడించారు. శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై అసభ్యకరపోస్ట్‌లు పెట్టారంటూ...భీమిశెట్టి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శింగనమల పీఎస్‌లో ఉండవల్లి అనూషపై పోలీసులు కేసు నమోదు చేసి... నోటీసులు జారీ చేశారు.   టీడీపీ కార్యకర్తగా ఉండవల్లి అనూష.. వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన.. చేస్తున్న తప్పులను.. సోషల్ మీడియా సాక్షిగా ఎత్తి చూపుతూ.. ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలోనే అధికార పార్టీ నేతలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంటే.. వాటికి సైతం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉండవల్లి అనూష.. కౌంటర్ ఎటాక్  ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు గుప్పిస్తే.. వారిపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేసి.. వారిని నోటీసులు జారీ చేస్తున్న విషయం విదితమే.

ఢిల్లీ , సెంటర్ సర్వీస్ ల  వివాదం... సుప్రీం ఖ‌రారుచేయ‌నున్న‌ టైమ్‌లైన్‌

ఢిల్లీలో సేవల నియంత్రణపై విచారణకు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు ఆగస్టు 22న సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని మే 6న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు. సర్వీసుల నియంత్రణపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల అధికారాల పరిధికి సంబంధించిన వివాదాస్పద అంశాన్ని సెప్టెంబర్ 27న విచారించేందుకు టైమ్‌లైన్‌ను నిర్ణయిం చనున్నట్లు సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. జస్టిస్ డి. వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇది గ్రీన్ బెంచ్ అని, విచారణలో ఎటువంటి పత్రాలను ఉపయోగించరాదని పేర్కొంది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణ మురారి, హిమా కోహ్లీ ,  పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం, అక్టోబర్ మధ్య నాటికి కేంద్రం ఢిల్లీ ప్రభుత్వ శాసన, కార్యనిర్వాహక అధికారాల పరిధికి సంబంధించిన వ్యాజ్యాన్ని తాత్కాలి కంగా విచా రణను ప్రారంభిస్తామని తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) అడ్మిషన్లు, ఉద్యోగాల్లో ప‌ది శాతం రిజర్వేషన్లు కల్పించా ల న్న కేంద్రం నిర్ణయం చెల్లుబాటుపై భారత  ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్  నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 13నుంచి విచారణ ప్రారంభించనుందని న్యాయవాదులు తెలియ జేసిన నేపథ్యంలో ఈ పరిశీలన జరిగింది.  ఢిల్లీ-కేంద్రం మ‌ధ్య స‌ర్వీసు వివాద‌ కేసులో పలువురు సీనియర్ న్యాయవాదులు ఈడబ్ల్యూఎస్ విషయం లో కూడా వాదిస్తారని, అందువల్ల వారికి వసతి కల్పించాలని ధర్మాసనానికి సూచించింది. ఈడబ్ల్యూఎస్ వ్యవహారంలో విచారణ దశను చూసి, తదుపరి ఎలా కొనసాగాలనే దానిపై ఆదేశాల కోసం సెప్టెంబర్ 27న జాబితా చేస్తామని కోర్టు తెలిపింది. కాగితాన్ని ఉపయోగించడం లేదని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు, పుస్త కాలు, కేసు చట్టాలు, వ్రాతపూర్వక సమర్పణలతో సహా అన్ని సంబంధిత విషయాలను స్కాన్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు షాదన్ ఫరాసత్ , పరమేష్ మిశ్రా తమ సంకలనాలను సిద్ధం చేసి స్కానింగ్ , సర్క్యులేషన్ కోసం కోర్టు మాస్టర్‌కు సమర్పిం చాలని బెంచ్ కోరింది. ఢిల్లీలో సేవల నియంత్రణపై విచారణకు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు ఆగస్టు 22న సుప్రీంకోర్టు పేర్కొంది.ఈ అంశాన్ని మే 6న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు. సేవలపై నియంత్రణ పరిమిత సమస్యను రాజ్యాంగ ధర్మాసనం అన్ని ఇతర చట్టపరమైన ప్రశ్నలను విపులంగా డీల్ చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ బెంచ్‌కి సూచించబడిన పరిమిత సమస్య, సర్వీస్ అనే పదానికి సంబంధించి కేంద్రం, ఎన్‌సీటీ ఢిల్లీ శాసన, కార్యనిర్వాహక అధికారాల పరిధికి సంబంధించినది. ఈ న్యాయస్థానం , రాజ్యాంగ ధర్మా సనం, ఆర్టికల్ 239ఏఏ(3)(ఏ)ని వివరిస్తుంది. రాజ్యాంగంలోని, రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 41కి సంబం ధించి అదే పదాల ప్రభావాన్ని ప్రత్యేకంగా వివరించడానికి ఏ సందర్భమూ కనుగొనబడలేదు. కాబట్టి, రాజ్యాంగ ధర్మాసనం అధికారిక ప్రకటన కోసం పైన పేర్కొన్న పరిమిత ప్రశ్నను సూచించడం సముచితమని మేము భావిస్తున్నామని  పేర్కొంది. 239ఏఏలోని సబ్ ఆర్టికల్ 3(ఏ) రాష్ట్ర జాబితా లేదా ఉమ్మడి జాబితాలో పేర్కొనబడిన విషయాలపై ఢిల్లీ శాసనసభ యొక్క చట్టాన్ని రూపొందించే అధికా రంతో వ్యవహరిస్తుంది. ఫిబ్రవరి 14, 2019న, ఇద్దరు న్యాయమూర్తులు-బెంచ్, దాని విభజన తీర్పును దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజధానిలో సేవల నియంత్రణ సమస్యను చివరకు నిర్ణయించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటుచేయాలని భారత ప్రధానన్యాయమూర్తికి సిఫార్సు చేసింది.    

పొడుస్తున్న పొత్తు.. కాంగ్రెస్, తెరాస జట్టు!

కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆ యాత్ర సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో ఇంతవరకు నిప్పూ ఉప్పులా ఉన్న  కాంగ్రెస్, తెరాస జోడీ జోడో యాత్ర అయితే మొదలైంది. తెలంగాణ రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయా? జాతీయ రాజకీయాల బాటలోనే రాష్ట్ర రాజకీయాలు అడుగులు వేస్తున్నాయా? కాంగ్రెస్, తెరాస చేతులు కలిపెందుకు సిద్దమవుతున్నాయా? అంటే, ఇటు కాంగ్రెస్, అటు  తెరాస నాయకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అవును, జాతీయ స్థాయిలో బీజీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, తెలంగాణలోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఒక్కటై జట్టు కట్టేందుకు సిద్దమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మాటున, బీజేపీ వ్యతిరేకత వంకన ఉభయ కమ్యూనిస్ట్  పార్టీలు ఇప్పటికే, తెరాసతో జట్టు కట్టాయి. ప్రగతి భవన్ పంచన చేరాయి. సరే, అదే మంత పెద్ద విషయం కాదు. నిరర్ధక ఆస్తులు ఏ ఖాతాలో కలిసినా, వామ పక్ష పార్టీలు ఎవరితో కలిసినా ఒక్కటే, అనే అభిప్రాయం వామపక్ష మేతావులే వల్లే వేస్తున్నారు. ఒక అంకెకు  ‘లెఫ్ట్’న  (ఎడం వైపు) ఎన్ని సున్నాలు చేరినా, ఆ అంకె విలువ పెరగదు. సో.. లెఫ్ట్ పార్టీలు ఎవరితో చేతులు కలిపాయి అనేది  పెద్దగా పట్టించుకోవలసిన విషయం కాదు.  కానీ, తెరాస నాయకత్వం కాంగ్రెస్ పార్టీతోనూ జట్టు కట్టేందుకు సిద్దంగా ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, చీటికీ మాటికీ ఢిల్లీ వెళ్లి వచ్చేది కూడా అందుకోసమే   అంటున్నారు. అదలా ఉంటే ఇంతకాలం, తెరాస, బీజేపీ తోడూ దొంగలని ప్రచారం చేయడంలో ముందున్న పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మీడియా ‘సాక్షి’ గా కేసీఆర్ కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు తహతహ లాడుతున్నారని చెప్పు కొచ్చారు. అయితే, కాంగ్రెస్ తో కలిసేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నా, తెరాసతో చేయి కలిపేందుకు హస్తం పార్టీ సిద్దంగా లేదని ఆయన చెప్పు కొచ్చారనుకోండి అది వేరే విషయం.అయినా, కీడెంచి మేలెంచాలని అనుకున్నారో ఏమో కానీ, ఢిల్లీలో కేసీఆర్ పలుకుబడి బాగా పెరిగిందని, చెప్పు కొచ్చారు.   నిజానికి, అద్దంకి దయాకర కంటే ముందే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు రాహుల్ గాంధీకి గురువుగా రాజకీయ పాఠాలు బోధించిన దిగ్విజయ్ సింగ్ ఇంకో అడుగు ముందు కేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో  తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే తెరాసని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. అంతే కాదు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడైనా, బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి రావచ్చు కదా, అని కేసీఆర్ కు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఒక విధంగా రెడ్ కార్పెట్ పరిచారు. ఆయన ఇంకా చాల విషయాలు చెప్పినా, కేసీఆర్ వస్తానంటే వద్దనే పరిస్థితి లేదని, అయన మాటలను బట్టి అర్ధం అవుతోంది.  మరో వంక  తెరాస ఎమ్మెల్యే బొల్లం ఎల్లయ్య యాదవ్ దేశంలో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని, ముఖ్యమత్రి కేసీఆర్ అదే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. అంతే కాదు, కేసీఆర్ నచ్చినా నచ్చక పోయినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ తెరాసతో చేతులు కలపాలని, ఒక విధమైన వినయ పూర్వక డిమాండ్ చేశారు. అలాగే,  బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రజలు కాంగ్రెస్ పార్టీకు పట్టం కడతారనే భ్రమల్లో ఆపార్టీ నాయకులు ఉంటే అది వారి ఇష్టమని, అదే జరిగితే ఉత్తర ప్రదేశ్ ఫలితాలే దేశంలోనూ పునరావృతం అవుతాయని, తెరాస ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చురకలు అంటించారు.  సూచన ప్రాయంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.  మొత్తానికి, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే  కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు తెరాస, తెరాసతో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సూత్ర ప్రాయంగా అంగీకరించి నట్లే కనిపిస్తోంది. అంతేకాదు, మునుగోడు ఉప ఎన్నికలకు ముందే, కాంగ్రెస్, తెరాసల మధ్య పొత్తు పొడిచినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అదలా ఉంటే, బీజేపీ నాయకత్వం జరుగుతున పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. నిజానికి, ఇది అనూహ్య పరిణామంగా కనిపించినా, అనూహ్య పరిణామం కాదని,  బీజేపీ నాయకులు  అంటున్నారు.  జాతీయ స్థాయిలో జరుగతున్న ప్రయత్నాలే,తెలంగాణలోనూ జరుగుతాయని, కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం లెఫ్ట్ పార్టీ కూటమి ఏర్పడుతుందని. బీజేపీ నాయకత్వం ముందుగానే పసికట్టిందని, అంటున్నారు. కాగా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక వైపు మిగిలిన పార్టీలు అన్నీ ఒక వైపు ఉంటాయని అనేక సందర్భాలలో టీవీ చర్చల్లో ప్రకటించారు.ఇప్పుడు అదే జరిగే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

గుర్తింపులేని  పార్టీల‌పై  విరుచుకుప‌డుతున్న ఆదాయ‌ప‌న్ను శాఖ 

దేశంలో చాలారాష్ట్రాల్లో పెద్ద పెద్ద రాజ‌కీయ‌పార్టీల‌తో పాటు అనేక చిన్న‌చిన్న‌రాజకీయ‌పార్టీలు  ఉన్నా యి. అయితే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల కంటే రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం, ఎన్నిక‌ల స‌మ‌యంలో  పుట్టి కొన్నాళ్లుగా రాజ‌కీయాల్లో క్రియాశీల‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌ని అనేక పార్టీలు ఉన్నాయి. వాటిలో చాలామ‌టుకు గుర్తింపులేని పార్టీలు కూడా ఉన్నాయి. ఇలాంటి అన్ని పార్టీల ఆర్ధికమూలాల‌ను వెలుగు లోకి తెచ్చేందుకు ఆదాయ‌ప‌న్ను శాఖ దాడులు చేప‌డుతోంది.  ఇప్ప‌టికే గుజ‌రాత్‌, ఢిల్లీ,ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, మ‌రికొన్ని రాష్ట్రాల్లో ఐటి దాడులు జ‌రిగా యని అధికారులు తెలిపారు. అయితే  దేశంలోని  గుర్తింపులేని పార్ఠీల జాబితాను ఇటీవ‌లే ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీ) విడుద‌ల చేసింది. దీని  ఆధారంగానే ఐటి శాఖ దాడులు చేప‌డుతోంద‌ని  రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.       గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, ఆపరేటర్లు,  ఇతరులపై పన్ను శాఖ సమన్వ య చర్య ప్రారంభించిందని వర్గాలు  తెలిపాయి. ఫిజికల్ వెరిఫికేషన్‌లో ఉనికిలో లేవని తేలినందున ఇటీవల రిజిస్టర్డ్ కాని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుండి 87 ఎంటిటీలను తొలగించిన ఈసీ సిఫారసు మేరకు శాఖ ఈ ఆశ్చర్యకరమైన చర్య తీసుకుంది. 2,100 కంటే ఎక్కువ నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు పోల్ ప్యానె ల్ ప్రకటించింది, ద్రవ్య విరాళాల దాఖలుకు సంబంధించిన నిబంధనలను, ఎన్నికల చట్టాలను ఉల్లం ఘించినందుకు, వారి చిరునామా,  ఆఫీస్ బేరర్‌ల పేర్లను మార్పులు చేర్పులు  విఫల మైంది. ఈ పార్టీ లలో కొన్ని తీవ్రమైన  ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది.

ఎమ్మెల్సీ కవిత సన్నిహితులను విచారిస్తున్న ఈడీ.. డొంక కదులుతోందా?

ఢిల్లి లిక్కర్ స్కాం కేసీఆర్ కుటుంబం మెడకు చుట్టుకుంటోందా? తనపై ఆరోపణలకు చేయరాదంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా.. ఈడీ దూకుడు పెంచడంతో ఎమ్మెల్సీ కవితకు ఊరట లబించడం లేదా? సీబీఐకి తోడు ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు విచారణలో వేగం పెరిగిందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో ఏకంగా తెలంగాణ సీఎస్ ప్రమేయంపై ఈడీ విచారణ ప్రారంభించడంతో తెలంగాణ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోందని,  మొత్తంగా ఈడీ దూకుడుతో తెలంగాణలో స్కాముల డొంక కదులుతోందనీ పరిశీలకులు అంటున్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆ కారణంగానే ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారం తెలంగాణలో ప్రపంకనలు సృష్టిస్తోంది. ఈ కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోనికి దిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఈడీ నిర్వహిస్తున్న సోదాలలో బాగంగా హైదరాబాద్ లో కూడా ఈడీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   లిక్కర్ స్కాం కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితులు ఆరుగురిని ఈడీ బుధవారం ఉదయం నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విచారణను హైదరాబాద్ కు చెందిన ఈడీ అధికారులు కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి హైదరాబాద్ లోఅరుణ్ రామచంద్రన్ పిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలలె ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఒక వైపు సోదాలు జరుగుతుండగానే కవిత సన్నిహితులను ఈడీ అధికారులు విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.   దీనికి తోడు    ఇటీవల హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి విదితమే.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్-45లోని ఫీనిక్స్ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేష్, కంపెనీ డైరెక్టర్ల నివాసాలపై  మదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్‌పైనా కూడా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫీనెక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు లింకులు ఉన్నట్లుగా అందిన సమాచారంపై కూడా ఈడీ విచారిస్తున్నట్లు తెలిసింది.   ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో ఫీనిక్స్ పెట్టుబడులు ఉన్నాయి. కాగా ఫీనిక్స్‌లో చాలా మంది రాజకీయ ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సురేష్ కుమార్ కు లింకులపై ఈడీ ఆరా తీయడం సంచలనం సృష్టించింది.                                          ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే  ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ  ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది. సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పోలీస్ ఆంటీ.. క‌ర్ర ఇస్తావా..!

పోలీసులు అన‌గానే క‌రకుగా ఉంటార‌న్న‌ది అంద‌రి మ‌న‌సులో ఉన్న స‌హ‌జ అభిప్రాయం. అది కొంత వ‌ర‌కే నిజం. పోలీసుల‌కు మ‌న‌సు ఉంటుంది. క‌ఠినంగా ఉండ‌డం అనేది ప‌రిస్థితుల‌ను అనుస‌రించి ఉంటుంది. దొంగల్ని ప‌ట్టిన‌పుడు, రోడ్డు మీద ఆక‌తాయిల్ని కొట్టేట‌పుడు, రోడ్డు సెన్స్‌లేకుండా వెళ్లే వాహ నాల‌ను ప‌ట్టిన‌పుడు ఆగ్ర‌హించ‌డం తిట్ట‌డం, కొండ‌క‌చో కొట్ట‌డ‌మూ చేస్తుంటారు. కానీ ఖాఖీల్లోనూ చ‌క్క‌గా స్పందించే మ‌న‌సు ఉంటుంది. చాలామంది ఇపుడు కొత్త‌గా స‌ర్వీసుల్లో చేరేవారిలో మంచి విద్యాబుద్ధులు ఉన్న‌వారు, మంచి చేయ‌డానికి దూకుడుగానూ వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది  ఉన్న‌మాట‌. ఇక్క‌డో పిల్ల పోలీసు క‌ర్ర‌కోసం మ‌హిళా కానిస్టేబుల్‌ని అడుగుతుం డ‌డం చూస్తున్నారు.  పిల్ల‌ల‌కు ప్ర‌తీదీ ఆట‌వ‌స్తువే. పోలీసు చేతిలో క‌ర్ర అయినా స‌రే! నిత్యం డ్యూటీతో విసిగెత్తి ఉండేవారికి ఇలాంటి పిల్ల‌ల ఆట‌లు కాస్తంత ప్ర‌శాంత‌త‌నిస్తాయి. అందుకే ఆ పోలీసామె ఆ పిల్ల‌ను కొంత ఆట‌ప‌ట్టిం చింది. క‌ర్ర అడ‌గ్గానే ఇవ్వ‌డం లేదు.. దాన్ని దాచే ప్ర‌య‌త్నం చేసింది. కానీ పిల్ల‌లు చూపు మ‌ర‌ల్చ‌రు. వారి దృష్టి ఎప్పుడూ కావాల్సిన దానిపైనే ఉంటుంది. ఒక్క‌సారి ఇవ్వ‌మ‌ని గోల చేసింది.  పిల్ల‌ల మొండిత‌నంలోనూ అందం, ఆక‌ర్ష‌ణా ఉంటాయి. దానికి ఎవ‌ర‌యినా ఫిదా కావాల్సిందే. ఈ  పోలీ సామె కూడా! అందుకే ఆట‌స‌ర‌దాలు ఆడినంతసేపూ ఆడి త‌ర్వాత ఓ క్ష‌ణం పాటు చేతికి ఇచ్చే ఉంటుం ది. దాన్ని ఆ చిన్నారి త‌న కంటే పెద్ద‌దిగా ఉంద‌ని ప‌ట్టుకోను ఇబ్బంది ప‌డే ఉంటుంది. క‌ర్ర ఎక్క‌డ త‌గిలి ఏడుస్తుందోన‌ని పోలీసామె కూడా అంతే జాగ్ర‌త్త‌గా మ‌రో చివ‌ర్న ప‌ట్టుకునే ఉంటుంది. పిల్ల త‌ల్లిదండ్రుల మాట అటుంచితే, ఓ స‌మ‌యంలో వీళ్లిద్ద‌రూ మంచి స్నేహితులు. ఇలాంటి స్నేహ‌మే పోలీసామె ఆశిం చింది. పోలీసులంతా ఆశించేది కూడా ఇదే. ప్ర‌జ‌ల నుంచి కూడా ఎక్క‌డ‌న్నా స్వ‌చ్ఛ‌ మైన స్నేహ భావాన్ని, 

 కోవూరు మినీమ‌హానాడుకు చంద్ర‌బాబు

ఏపీలో జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విముఖ‌త పెరిగిపోయి, విప‌క్షాలు అధికారంలోకి రావడానికి మంచి అవ కాశాలు ల‌భిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌చారం లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు 14 నుంచి నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించడానికి సిద్ధ‌మ‌య్యారు.  రాష్ట్రంలో  ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ‌ప‌రిస్థితుల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత అవ‌గాహ‌న  క‌ల్పించేందుకు తెలుగు దేశంపార్టీ అధినే చంద్ర‌బాబునాయుడు, నాయ‌కులు కూడా రెండింత‌ల ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తు న్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయ‌సేక‌ర‌ణ‌కు చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం ఘోరంగా విఫ‌ల‌మ‌యింది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను తిర‌స్క‌రించారు. మ‌రోవంక తెలుగు దేశం చేప‌ట్టిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం చేప‌ట్టి వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న, నాయ‌కుల ప‌నితీరు గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి ఆక‌ట్టుకునేందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన తెలుగు దేశం నాయ‌కులు, ఎమ్మెల్యేలు, వీరాభిమానుల‌ను ప్ర‌జ‌లు ఎంతో ఆద‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌జ‌లు దాదాపు  అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం నాయ‌కుల వైపు మొగ్గు చూపారు.  ఈ నేప‌థ్యంలో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టుంద‌ని చెబుతున్న నెల్లూరు జిల్లాలో టీడీపీ  అధినేత చంద్ర‌బాబు నాయు డు ప‌ర్య‌ట‌న ఖ‌రార‌యింది. నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు 14వ తేదీన కోవూరు నియోజ‌కవ‌ర్గంలో మినీ మ‌హానాడు నిర్వ‌హించ‌నున్నారు. 15న నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌ వ‌ర్గాల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. జిల్లాలో తెలుగుదేశం ప‌ట్ల ప్ర‌జ‌ల ఆద‌ ర‌ణ‌, జిల్లా నాయ‌కులు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాలు, ఇంత‌వ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌జాక‌ర్ష‌ణ అంశాల గురించి చ‌ర్చించవ‌చ్చని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. 16న వెంకటగిరి, శ్రీకాళహస్తిలో బాదుడే బాదుడు ర్యాలీలు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే జిల్లా వైసీపీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డి నందువ‌ల్ల  టీడీపీ ర్యాలీలు, స‌మావేశాల‌తో భారీ ప్ర‌చార వ్యూహాన్ని అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌మయింది.  ఇదిలా ఉండ‌గా, నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మిని మహానాడులు నిర్వ‌హిం చనున్నారు. మ‌హానాడు నిర్వ‌హ‌ణ ఏర్పాట్లు ప‌రిశీలించేందుకు టీడీపీ నేత లోకేష్ కావ‌లి వెళ్ల‌నున్నారు.  16న వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు రోడ్ షో లో పాల్గొంటారు.

గులాబి పార్టీలో అసమ్మతి భగ్గు..వలసలకు సిద్ధం.. సిట్టింగులకే సీట్లు ప్రకటనే కారణమా?

తెలంగాణలో అధికార తెరాసలో ఏం జరుగుతోంది? కేసీఆర్ తీరు దేనికి సంకేతం. పార్టీలో విభేదాలను పరిష్కరించి నేతలంతా సమన్వయంతో పని చేసేలా దిశా నిర్దేశం చేయాల్సిన కేసీఆర్ తన తీరుతో, ప్రకటనలతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లేలా, అసమ్మతి జ్వాలలో అజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సహజంగానే యాంటీ ఇంకంబన్సీని తెరాస ఎదుర్కొంటోంది. ప్రజా వ్యతిరేకతకు తోడు.. 2014 ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చి తెరాస గూటికి చేరిన ఎమ్మెల్యేల కారణంగా పార్టీలో అసమ్మతి పెరిగింది. ఈ మూడేళ్ల కాలంగా అది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ  నివురు తొలగి నిప్పు బయటకు వస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ దాదాపుగా పార్టీ నేతలలో విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా పెద్దదిగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో విభేదాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావలసిన పార్టీ అధినేత అందుకు భిన్నంగా సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు అంటూ ప్రకటించేసి విభేదాలకు అజ్యం పోసారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అసలే ఇప్పటికే పార్టీలోని పలు నియోజకవర్గాలలో భగ్గుమంటున్న అసమ్మతి, పార్టీ టికెట్ల కోసం ఇప్పటి నుంచే పోటాపోటీ ఈ నేపథ్యంలో సిట్టింగులకే టికెట్లు అంటూ కేసీఆర్ ప్రకటించి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చి ఉండేదేమో కానీ.. ప్రస్తతం రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ప్రకటన పార్టీలో వలసలను పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో అయితే అధినత వైఖరి పట్ల అసమ్మతి ఉన్నా ప్రత్యామ్నాయం లేక అసమ్మతి వాదులు మిన్నకున్నారు. పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టినా తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని పంటి బిగువుల అదిమిపెట్టి మౌనం వహించారు. అయితే ఇప్పుడు పరిస్ధితి గతానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అసమ్మతులకు, అసంతృప్తులకు ఇప్పుడు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో గట్టిగా పుంజుకున్నాయన్న అంచనాల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలలోకి వలసలు పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఆయా పార్టీలు తెరాస అసంతృప్తులకు గాలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తెరాసలో ఇప్పటికే ఆసంతృప్తి, అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు పీక్స్ లో ఉంది. వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. పలు నియోజకవర్గాలలో పార్టీలోని ముఖ్య నేతల మధ్యే మాటల యుద్ధం జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రంలో బలపడుతున్నాయి. బీజేపీ తరఫున ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి రాష్ట్రంలో వరుస పర్యటనతో, కేసీఆర్ పై విమర్శలతో రాజకీయ హీట్ పెంచేస్తున్న పరిస్థితి. అదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచీ పార్టీలో సమస్యలను పరిష్కరించుకుని పుంజుకున్న కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో తెరాస అధినేత పార్టీలో సమస్యలను, నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకుని పార్టీని ఏకతాటిపై నడిపించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సిట్టింగ్ లకు టికెట్లు, అదే పార్టీ సంప్రదాయం అని ప్రకటించేయడం ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో వారు అనివార్యంగా పక్క చూపులు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీలు అదికార పార్టీలోని అసంతృప్తులు, అసమ్మతీయులకు గాలం వేస్తున్నాయి. మరో వైపు   తెరాసకు చెందిన నేతల కంపెనీలు, ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు. ఇవి సరిపోవన్నట్లు కొత్తగా బీజేపీ తెరపైకి తెచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి వాటితో తెరాస డీలా పడిందన్నది ఖాయం. ఈ సమయంలో తెరాస అధినేత సిట్టింగులకే సీట్లు అన్న ప్రకటన కచ్చితంగా పార్టీపై ప్రతి కూల ప్రభావం చూపుతుంది. కాగా సిట్టింగులకే టికెట్లు అన్న ప్రకటన ద్వారా కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం చేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి  తెలంగాణలో అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్న కాంగ్రెస్-బీజేపీలకు ఆయనే   ఆయుధాలు అందించారని అంటున్నారు.  ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలున్న నియోజకవర్గాల సంఖ్య, 40 వరకూ ఉంది.  ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతితోపాటు.. అక్కడ వారి స్థానంలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ క్రమంలో.. సిట్టింగులకు వ్యతిరేకంగా ఇప్పటినుంచే ముఠాలు కట్టి, రోడ్డెక్కుతున్న ఘటనలు పార్టీ పరువు తీస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరిల విషయమే ఇందుకు ఉదాహరణ. ఇరువురూ కూడా  ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ   నర్సయ్యగౌడ్ మంత్రి జగదీష్‌రెడ్డి తనను, కర్నె ప్రభాకర్‌ను తొక్కేయాలని చూస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. ముందు ముందు ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి-మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాండూర్‌లో మహేందర్‌రెడ్డి-రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌లో మెతుకు ఆనంద్-సంజీవరావు, నకిరేకల్‌లో లింగయ్య-వీరేశం, ఆలేరులో సునీతా మహేందర్‌రెడ్డి-సందీప్‌రెడ్డి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇక వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్‌కు వ్యతిరేక వర్గం ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తోంది. పాలేరు, కొత్తగూడెం, సత్తుపల్లి, డోర్నకల్, రామగుండం, మంథని, చొప్పదండి, వేములవాడ, జగిత్యాల, ముథోల్, బోధ్, నారాయణఖేడ్, కొడంగల్, నాగర్ కర్నూల్, దేవరకద్ర ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పటన్‌చెరు, ఉప్పల్, ఎల్బీనగర్, హుస్సాబాద్, ఉప్పల్, జహీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సీట్ల కోసం సీనియర్లు సిట్టింగులకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ, ఆయా నియోజకవర్గాల్లో సొంత సైన్యం తయారుచేసుకునే పనిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో తప్ప, మిగిలిన జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఇక ఈటల రాజేందర్ గెలిచిన హుజూరాబాద్‌లో అయితే అరడజను మంది నేతలు సీట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో  సిట్టింగులకే మళ్లీ సీట్లు  అంటూ కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగులకు పోటీగా, నియోజకవర్గానికి ముగ్గురు-నలుగురు నేతలు సిద్ధమైన పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

గణేష్ నిమజ్జన శోభాయాత్రపై రాజకీయమా?

రాజకీయ ప్రయోజనమే ఏకైక లక్ష్యం. అందు కోసం సమాజానికి హాని జరిగే పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోకపోవడమే నేటి పార్టీల వైఖరిగా మారిపోయింది. కుల మతాలకు అతీతంగా ఒక సామాజిక ఉత్సవంలా ఏటా హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి రాజకీయ మకిలి అంటించేందుకు కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వెరవడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ అవకాశాన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలన్న ఆత్రం, తాపత్రయంతో పార్టీలు మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, తెరాసల ఈ విషయంలో  ముందు వెనుకలు ఆలోచించకుండా ఎన్నికల లబ్ధి కోసం వెంపర్లాడుతున్నాయి.  గణేష్ మండపాల నుంచి నిమజ్జనాల వరకూ పార్టీలు తమతమ రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయి. సామరస్య వాతావరణం దెబ్బతినే పరిస్థితి వచ్చినా వెనుకాడటం లేదు. ఇప్పుడు వినాయక నిమజ్జనం విషయంలో కూడా బీజేపీ, తెరాసలు ప్రమాదకరమైన రాజకీయ క్రీడకు తెర లేపాయి. వినాయక నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయడం లేదంటూ బీజేపీ తీవ్ర పదజాలంతో విమర్శలకు తెరలేపింది.  ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా చేయకున్నా ట్యాంక్ బండ్ పైకి నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తామనీ, హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామనీ బీజేపీ ప్రకటించింది.   హుస్సేసాగర్ జలాలు కలుషితం కాకూడదన్న ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో  అధికారికంగా హుసేన్ సాగర్ ఒడ్డున గణేష్ నిమజ్జనానికి  ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎందుకంటే గణేష్ మండపాలలో ప్రతిష్టించిన విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినవే.  అయితే గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని బీజేపీ విమర్శిస్తున్నది. కేవలం  హిందూ పండుగలపైనే ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తున్నారంటూ సున్నిత అంశాలను తెరపైకి తీసుకువచ్చి రచ్చ చేస్తున్నది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవాల ప్రభుత్వం చూస్తోందనీ, వచ్చే ఏన్నికలలో ఒక వర్గం మద్దతు కొసం ఆ వర్గం మెప్పు కోసమే సర్కార్ ఇలా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతే కాకుండా ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకుంటే వాటిని   ప్రగతి భవన్ కు తీసుకొస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో   గణేష్ నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడంతో వివాదం మరో లెవెల్ కు వెళ్లింది. ఓ వైపు గణేష్ ఉత్సవ కమిటీ మరో వైపు బీజేపీ   కేసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే నిరశన దీక్షకూ దిగాయి.  హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఉన్న ప్రాధాన్యత తెలిసి కూడా ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ పట్టనట్టు వ్యవహరించడం వెనుక కూడా రాజకీయమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ పరస్పర విమర్శలకు దిగడమే కాకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సమయం సమీపిస్తున్నా అందుకు సంబంధించిన ఏర్పాట్ల ఊసే లేకపోవడంతో నిమజ్జనం రోజున ఏ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం, అనంతరం గణేష్ శోభాయాత్రా ఒక సామాజిక కార్యక్రమంలా జనంలో సామరస్యం వెల్లివిరిసేలా నిర్వహించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తున్న తరుణంలో రాజకీయం కోసం ఇటువంటి వాతావరణం ఏర్పడేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాలుష్యం కారణంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం హుస్సేన్ సాగర్ లో నిర్వహించరాదంటూ గత చాలా కాలంగా పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. అదే సమయంలో కోర్టు కూడా కొన్ని ఆంక్షలతో సూచనలూ చేసింది. అయితే గణేష్ నవరాత్రులకు ముందు నుంచే పర్యావరణ హిత ఉత్సవాల కోసం ప్రజలలో అవగాహన పెంచేలా భారీ ఎత్తున ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం ఆ సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు గణేష్ నిమజ్జన విషయంలో ఆంక్షలున్నాయంటూ ఏర్పాట్లు చేయకపోవడాన్నీ పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వం నడుంబిగించి.. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

భారత్ 2029 నాటికి మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ : ఎస్‌బిఐ నివేదిక

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రచించిన నివేదిక ప్రకారం, 2029 నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని, దీనికి కారణం 2014 నుండి వచ్చిన నిర్మాణాత్మక మార్పులని తెలుస్తోంది. నివేదిక ప్రకారం, ప్రస్తుత వృద్ధి రేటును కొనసాగిస్తే 2027లో జర్మనీని, 2029లో జపాన్‌ను భారత్ అధిగమిం చి పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకుతుందని అధ్యయనం పేర్కొంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు భారత్ 10వ స్థానంలో ఉంది. నివేదిక అంచనా వాస్తవ రూపం దాల్చగలిగితే, 15 ఏళ్లలోపు ఏడు స్థానాలు ఎగబాకడం మోదీ ప్రభుత్వ వారస త్వం మాత్రమే కావచ్చు. నివేదిక ఆర్ధిక సంవ‌త్స‌రం2023 కోసం భారతదేశ జీడీపీ అంచనాను కొలిచింది, 6 శాతం నుండి 6.5 శాతం కొత్త సాధారణం అని జోడించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్ధిక సంవ‌త్స‌రం2023  కోసం భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తు త 6.7 శాతం నుండి 7.7 శాతం వరకు ఉన్నప్పటికీ, అది అసంపూర్ణమని గట్టిగా నమ్ముతున్నామని బ్యాంకు నివేదిక పేర్కొన్న‌ది. అనిశ్చితితో నాశనమైన ప్రపంచంలో,  6 శాతం నుండి 6.5 శాతంగా విశ్వ సిస్తున్నామ ని,  వృద్ధి కొత్త సాధారణమ‌నీ నివేదిక పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ ఎస్ ఓ) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ జీడీపీ ఒక సంవత్సరంలో దాని వేగవంతమైన రేటుతో విస్తరించిందని చూపించే డేటాను వెల్లడించింది. జూన్ 30, 2022తో ముగిసిన మూడు నెలల కాలంలో భారతదేశ జీడీపీ 13.5 శాతం పెరిగింది. చైనాలో వృద్ధి మాంద్యం నుండి భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుందనే  దాని గురించి  మాట్లాడుతూ, భారత దేశం లో తన సరికొత్త ఐఫోన్ 14 తయారీని ప్రారంభించాలని ఆపిల్ యొక్క ఇటీవలి నిర్ణయం ఆశాజనక దశ అని నివేదిక తెలిపింది. గ్లోబల్ టెక్ మేజర్ ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ఉత్పత్తిలో కొంత భాగాన్ని భారతదేశం నుండి ప్రపంచ వ్యాప్తంగా షిప్పింగ్ కోసం మార్చాలని నిర్ణయించుకుంది, అటువంటి ఆశావాదానికి సాక్ష్యంగా  ఉంది. అయితే, భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ను తయారు చేయడానికి, కొత్త  స్మార్ట్‌ఫోన్ తయారీ సమ యాన్ని తగ్గించడానికి ఉత్పత్తి వేగాన్ని వేగవంతం చేయడానికి ఆపిల్ ఇప్పటికే భారతదేశంలోని దాని స్థానిక సరఫరాదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. నివేదిక ప్రకారం, ఐ ఫోన్‌ 13 భారతదేశంలో తయారీని ప్రారంభించింది, ఇది గత సంవత్సరం సెప్టెం బర్ లో ప్రారంభించబడిన ఆరు-ఏడు నెలల తర్వాత. యాపిల్ గ్యాప్ తగ్గించి చైనాతో సమానంగా తీసు కురావడానికి ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన జీడీపీ గణాంకాల నేప థ్యంలో భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవత రించిన నేపథ్యంలో ఎస్‌బీఐ నివేదిక వచ్చింది. నామమాత్రపు' నగదుకు సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం మార్చి నుండి త్రైమాసికంలో సర్దు బాటు ప్రాతిపదికన మరియు సంబంధిత త్రైమాసికం చివరి రోజున డాలర్ మారకపు రేటును ఉపయో గించి 854.7 బిలియన్ డాల‌ర్లుగా ఉంది. దీనికి విరుద్ధంగా, యుకె  814 బిలియన్ డాల‌ర్ల‌  వద్ద ఉంది. అంతేకాకుండా, ఈ సంవత్సరం వార్షిక ప్రాతిపదికన డాలర్ పరంగా భారతదేశం యుకేని అధిగమించ గలదని ఐఎంఎఫ్‌ అంచనాలు చూపుతున్నాయి, ఆసియా పవర్‌హౌస్‌ను యుఎస్‌, చైనా, జపాన్, జర్మనీ ల వెనుక ఉంచింది.

ఐటి సంస్థ‌ల‌తో క‌ర్ణాట‌క మంత్రుల భేటీ

బెంగుళూరులో భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రం స్థంభించిపోయింది. దీంతో బెంగుళూరులోని ఐటి సంస్థ‌ల వారు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తోంది. ఉద్యోగులు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోవ‌డంతో ఆయా ప‌రి శ్ర‌మ‌ల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇన్‌ఫోసిస్‌,విప్రో, టిసిఎస్‌, ఇంటెల్ ఇత‌ర దిగ్గ‌జ ఐటి సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో రాష్ట్ర మంత్రి సిఎన్‌. అశ్వ‌ర్థ‌నారాయ‌ణ స‌మావేశ‌మై  ఒక ప‌రిష్కార మార్గాన్ని సూచించ‌వ‌చ్చున‌ని అంతా ఆశిస్తున్నారు.  ప్ర‌భుత్వ ప్ర‌ధానకార్య‌ద‌ర్శి, బృహ‌త్ బెంగుళూరు మ‌హాన‌గ‌ర్ పాలిక (బిబిఎంపి) ఛీఫ్ క‌మిష‌న‌ర్‌, బెంగు ళూరు నీటిపారుద‌ల‌శాఖ అధికారులు, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌లు కూడా రాష్ట్ర అసెంబ్లీ హాలులో జ‌రిగే స‌మావేశంలో పాల్గొంటారు. ఈ స‌మావేశంలో పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ స‌మ‌స్య‌ల గురించి స్వేచ్ఛ‌ గా మాట్లాడవ‌చ్చున‌ని మంత్రి అశ్వ‌ర్థ‌నారాయ‌ణ ఐటి సంస్థ‌ల అధికారులు, ప్ర‌తినిధుల‌కు పిలుపు నిచ్చారు.  బిబిఎంపి ఛీఫ్ క‌మీష‌న‌ర్ ఈ చ‌ర్చా స‌మావేశంలో న‌గ‌రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్లు,లోత‌ట్టు ప్రాంతాల్లో, కాల‌నీల్లోకి వ‌ర్షం నీరు చేరుకోవ‌డం, రోడ్లు మీదా నీరు నిలిచి వాహ‌నాలు క‌ద‌ల‌లేని ప‌రిస్థి తుల గురించిన స్లైడ్ షో ప్ర‌ద‌ర్శించి వివ‌రిస్తారు. సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగుళూరులో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న ఐటి సంస్థ‌ల‌కు ఉద్యోగులు వెళ్ల‌లేక ఆఖ‌రికి ట్రాక్ట‌ర్‌ను ఆశ్ర‌యించే స్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా సోమ‌వారం భారీ వ‌ర్షం నీరు రోడ్ల‌మీద నిలిచి ఎవ్వ‌రినీ క‌ద‌ల‌నీయ‌లేదు.  ఇదిలా ఉండ‌గా, ముఖ్య‌మంత్రి బొమ్మై ప్ర‌స్తుత రాష్ట్ర‌,  బెంగుళూరు ప‌రిస్థితికి గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ ఎటాక్స్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 40 ప్రాంతాలలో ఈడీ దాడులు నిర్వహించింది. ఒక వైపు సీబీఐ, మరో వైపు ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడ్ పెంచేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తాన రాజకీయప్రత్యర్థులను వేధించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ1గా నమోదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఒక వైపు సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ రంగంలోకి దిగడం,  ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌లలో ఏకంగా ముఫ్పై చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈడీల సోదాలతో  ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక హైదరాబాద్ లో అయితే సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉన్న రామచంద్ర పిళ్లై తో పాటు  అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రముఖ రాజకీయ నేత పీఏ నివాసంపై కూడా ఈడీ దాడులు చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే  ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ  ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది. సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఈ కేసులో మద్యం లిక్కర్ సిండికేట్ల తరపున డిపాజిట్ కట్టిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. ఎంపిక చేసిన వ్యక్తులు లక్ష్యంగానే ఈడీ, సీబీఐ దర్యాప్తు జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ విధానాలను విమర్శించే, వ్యతిరేకించే వారి దూకుడు తగ్గించేందుకే కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందన్న విమర్శలకు ఈడీ దాడులు నిర్వహిస్తున్న తీరు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.  ఈ కుంభ కోణంలో చాలా మంది ‘పెద్దల’ పేర్లు బయటకు వచ్చినప్పటికీ దాడులు ‘చిన్న’లపైనే జరగడం అనుమానాలకు తావిస్తోందనీ, కేంద్రంపై కేంద్ర దర్యాప్తు సంస్థలను అనుచితంగా ఉపయోగిస్తోందన్న విమర్శలకు బలం చేకూర్చేదిగా ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.