టీ20 ప్రపంచకప్‌లో జడేజా ఆడడేమో!
posted on Sep 4, 2022 @ 10:38AM
అతను జట్టులో ఉంటే ఏదో విధంగా గెలుస్తామన్న నమ్మకం కలుగుతుంది, అతను జట్టులో ఉంటే ప్రత్యర్ధి బ్యాటర్ ఇబ్బంది పడతాడు, అతను ఫీల్డింగ్ చేస్తుంటే ఫోర్లు ఆగిపోతాయి, సిక్స్‌లకు అవకాశం ఉండదు. అతను బౌలర్‌గా బ్యాటర్‌ను ముప్ప తిప్ప లు పెట్టగలడు. భారత్ క్రికెట్ జట్టుకు అతను ఎంతో వెన్నుదన్ను. అతనే రవీంద్ర జడేజా అనే జద్దు!
అతని కుడిమోకాలికి గాయమయింది. శస్త్రచికిత్స అనివార్యమైంది. అందుకే ఆసియాకప్ మిగతా మ్యాచ్‌లకు దూరమ య్యాడు. అతను త్వరలో జట్టులోకి తిరిగి రావాలని, ఫైనల్ లో భారత్‌ను గెలిపించే భారత్ స్టార్స్‌లో అతని పాత్ర కీలకమని అందరూ ఎంతో ఆశించారు. కానీ శస్త్రచికిత్స తప్పనిసరి కావడంతో అతను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అన్నారు. ప్రస్తుత ఆసియాకప్‌కి అలా దూరమయ్యాడు. కానీ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌నకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇది జడేజా వీరాభిమానులను బాధిస్తోంది.
ఆసియా కప్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లలో జడేజా మెరుగైన ప్రదర్శనతో జట్టులో సమతూకం తీసుకు వచ్చా డు. ఇలాంటి ఆటగాడు ప్రపంచకప్ టీమ్‌లో లేకపోనుండడం రోహిత్ అండ్ కోకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. టీమ్ ఇండియా కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కుడి మోకాలి నొప్పితో బాధపడుతూ ఆసియా కప్‌టోర్నీకి దూరమయ్యాడు స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా. అతడి అంతర్జాతీయ పునరాగమనం గురించి ఎన్‌సీఏ వైద్య బృందం స్పష్టత ఇవ్వలేదు. రానున్న మూడు నెలలు అతడు క్రికెట్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ సీనియర్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
అయితే.. ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉందని.. జడేజాపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని స్పష్టం చేశాడు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్నాడు.ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్ల తర్వాత మోకాలి గాయం కారణంగా అతడు ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా..బౌలింగ్‌లో కీలక వికెట్ తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఉత్తమ సేవలందించే ఈ స్టార్ ఆల్‌రౌండర్ పెద్ద టోర్నీకి దూరమవడం టీమ్‌ఇండియాకు పెద్దలోటే.