సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా బ్రియన్ లారా
posted on Sep 3, 2022 @ 12:51PM
రాబోయే ఐపిల్ సీజన్‌లో పోటీ చేసే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్‌గా క్రికెట్ లెజెండ్ బ్రియా న్ లారాను తీసుకున్నారు. టామ్ మూడీ కోచ్‌గా హైదరాబాద్ జట్టు గత టోర్నీలో పెద్దగా రాణించలేదు. అంతకు మించి ఎనిమిదో స్థానానికి పడిపోవడంతో మూడీని ఫ్రాంచైజర్లు వద్దనే అనుకున్నారు. బ్రియాన్ లారా కుర్రవాడు, బ్యాటర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకతను ప్రదర్శించినవాడు కనుక తప్పకుండా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌ను కాస్తంత పదును పెట్టగలడని, వ్యూహకర్తగానూ జట్టుకు ఎంతో ఉపయోగ పడతాడన్న ధీమాతో లారాను ఫ్రాంచైజర్లు తీసుకుని ఉంటారని క్రికెట్ పండితుల మాట.
టామ్ మూడీ 2013, 2019 మధ్య కాలంలో హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమ యంలో జట్టు అయిదుపర్యాయాలు ప్లేఆఫ్స్ దాకా వెళ్లింది. కాగా 2016లో ఛాంపియన్ అయింది. ఈ ఏడాది ఐపి ఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి, ఎనిమిది ఓడిపోవడంతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇది జట్టు సత్తా విషయంలో ఎంతో విచారించదగ్గ అంశం. కాగా 2016లో జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లారా రావడం ఎంతో ఉపయోగపడింది. అందుకే ఇపుడు ఏకంగా హెడ్ కోచ్‌గా తీసుకు న్నారు.
అయితే జట్టును ఉత్సాహపర్చడంలో టామ్ మూడీ కృషిని మరువలేమని, ఆయన జట్టుకోసం ఎంతో సేవ చేశారని ఫ్రాంచైజర్లు ట్వీట్ చేశారు. వాస్తవానికి 2020 ముందే టామ్ స్థానంలో ఆరంజ్ ఆర్మీకి ఇంగ్లండ్ సూపర్ స్టార్ ట్రెవర్‌బేలిస్ కోచ్ గా వచ్చాడు. అప్పుడు ఎస్ ఆర్ హెచ్ మూడవ స్థానంలో నిలి చింది. 2020లో రెండో క్వాలిఫయర్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరంజ్ జట్టు ఓడింది. ఆ తర్వాత బేలిస్ స్థానంలోకి టామ్‌ని మళ్లీ తీసుకున్నారు. కానీ అదేమంత మంచి ఫలితాలనివ్వలేదు. హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట గెలిచింది.
హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ లెజండ్ లారా రాకతో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈసారి టోర్నీలో ఊహించినదానికంటే మంచి బ్యాటింగ్ సత్తా ప్రదర్శించే అవకాశాలున్నాయనుకోవాలి. బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చి మంచి బ్యాటర్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్న టెక్నిక్‌తో లారా గతంలో జట్టుకు ఉప యోగ పడిన కారణంగా ఈ రాబోయే సీజన్‌లో సన్రైజర్‌ను టైటిల్ పోటీ స్థాయికి సిద్ధం చేస్తాడనే అనుకోవాలి.