రూ.405 కోట్లతో ప్రధానికి నివాసం..బీజేపీ నేతలు ఇప్పుడేమంటారు?
posted on Sep 7, 2022 @ 4:55PM
దేశంలో ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, రాష్ట్రాల సీఎంలకు నివాసాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉన్నదే. అయితే ప్రభుత్వాలు వాటికి ఒక పరిమితి, నిబంధనలు అనుసరించి చేపట్టడం జరుగుతుంది. అయితే మరో రెండేళ్లలో రూ.405 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీకి నివాస భవన సముదాయం ఏర్పాటు కానుంది.
వాస్తవానికి అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి వారి పదవీకాలంలో ఉండే నివాసాలు ఎలాంటి మార్పు చేర్పులు చేయించుకోవాలని అనుకోరు. పదవుల్లో ఉన్నంత కాలమే ఆ భవనాల్లో ఉంటారుగనుక వారికి తోచిన విధంగా మార్చుకోవాలన్న ఆలోచనా చేయరు. అయితే తెలంగానా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో సెక్రటేరియట్ భవనసముదాయం పురాతనమైనదని, మరేవో కారణాలు చెప్పి భారీ ఎత్తున కొత్త భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. కానీ రాజధాని హైదరాబాద్‌లో ప్రజల ఆరోగ్య రక్షణ బాధ్యతలు స్వీకరి స్తున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చడానికి మాత్రం ఆయన ఎలాంటి గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. పాలనా సౌకర్యాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వ కార్యాలయాల విషయంలో ప్రదర్శించిన దూకుడు ప్రజారోగ్య సంబంధిత ఆస్పత్రుల విషయంలో ప్రదర్శించలేకపో యారు. ఈ విషయంలో ప్రజలు, విపక్షాల నుంచి భారీ విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో చీమ చిట్టుక్కుమన్నా బీజేపీ నాయకులు, వీరాభిమానులు విరుచుకుపడటం గమనిస్తున్నాం. సభలు, సమా వేశాలు, ర్యాలీలు, రోడ్డు షోలకు ప్రభు త్వ సొమ్ము పెడుతున్నారని, జనాన్ని పోగేయడానికి సభలు నిర్వ హించడానికి ప్రభుత్వం సొమ్మునే ఉప యోగిస్తున్నారని, తమ స్వంత అవసరాలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్మును, వాహనాల వినియోగం జరుగుతోందని బీజేపీ విరుచుకుపడుతోంది. ఇది దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన.
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివసించేందుకు ఓ కొత్త భవన సముదాయం సిద్ధం కానుంది. రాష్ట్రపతి భవన్కు సమీపంలో సౌత్‌బ్లాక్ వెనుకవైపు ఈ భవనాన్ని 2,26,203 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ప్రధాని నివాసాన్ని 36,328 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టనున్నారు. దీంతో పాటు ప్రధాని కాన్వాయ్ వెళ్లేందుకు భూగర్భంలో ఒక సొరంగం కూడా నిర్మించా ల న్న ప్రతిపాదన ఉన్నది. రెండేండ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టులో ప్రధానికి కార్యాలయం, ఇండోర్ క్రీడల సదుపాయం, సిబ్బందికి క్వార్టర్లు, ఎస్పీజీ ఆఫీసు, సేవా సదన్, భద్రతా కార్యాలయం ఉండను న్నాయి. సొరంగ మార్గాన్ని నేరుగా ప్రధాని ఇంటి నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్‌లోని ప్రధాన కార్యాలయానికి, నూతన పార్లమెంట్‌కు, ఉపరాష్ట్రపతి నివాసానికి అను సంధానిస్తారు.
ప్రస్తుతం మోదీ నివాసముంటున్న 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని భవనం పీఎంవోకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రధాని తన నివాసం నుంచి పీఎంవోకు వెళ్లే సమయంలో ప్రతిరోజు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఏర్పడుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది కానీ.. తెలంగాణలో సీఎం అధికార నివాసం కోసం ప్రగతి భవన్‌ను నిర్మిస్తే.. దానిలో వందల గదులున్నాయని, దాన్ని కూల్చేస్తామని ప్రతినలు బూనిన రాష్ట్ర బీజేపీ నేతలూ.. ప్రధాని కొత్త నివాసంపై ఏమంటారో చూడాలి.