గుర్తింపులేని పార్టీలపై విరుచుకుపడుతున్న ఆదాయపన్ను శాఖ
posted on Sep 7, 2022 @ 2:15PM
దేశంలో చాలారాష్ట్రాల్లో పెద్ద పెద్ద రాజకీయపార్టీలతో పాటు అనేక చిన్నచిన్నరాజకీయపార్టీలు ఉన్నా యి. అయితే ప్రధాన రాజకీయ పార్టీల కంటే రాజకీయ అవసరాలకోసం, ఎన్నికల సమయంలో పుట్టి కొన్నాళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలక కార్యక్రమాలు నిర్వహించని అనేక పార్టీలు ఉన్నాయి. వాటిలో చాలామటుకు గుర్తింపులేని పార్టీలు కూడా ఉన్నాయి. ఇలాంటి అన్ని పార్టీల ఆర్ధికమూలాలను వెలుగు లోకి తెచ్చేందుకు ఆదాయపన్ను శాఖ దాడులు చేపడుతోంది.
ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ,ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మరికొన్ని రాష్ట్రాల్లో ఐటి దాడులు జరిగా యని అధికారులు తెలిపారు. అయితే దేశంలోని గుర్తింపులేని పార్ఠీల జాబితాను ఇటీవలే ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. దీని ఆధారంగానే ఐటి శాఖ దాడులు చేపడుతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, ఆపరేటర్లు, ఇతరులపై పన్ను శాఖ సమన్వ య చర్య ప్రారంభించిందని వర్గాలు తెలిపాయి. ఫిజికల్ వెరిఫికేషన్‌లో ఉనికిలో లేవని తేలినందున ఇటీవల రిజిస్టర్డ్ కాని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుండి 87 ఎంటిటీలను తొలగించిన ఈసీ సిఫారసు మేరకు శాఖ ఈ ఆశ్చర్యకరమైన చర్య తీసుకుంది.
2,100 కంటే ఎక్కువ నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు పోల్ ప్యానె ల్ ప్రకటించింది, ద్రవ్య విరాళాల దాఖలుకు సంబంధించిన నిబంధనలను, ఎన్నికల చట్టాలను ఉల్లం ఘించినందుకు, వారి చిరునామా, ఆఫీస్ బేరర్‌ల పేర్లను మార్పులు చేర్పులు విఫల మైంది. ఈ పార్టీ లలో కొన్ని తీవ్రమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది.