చిరును వదలని రాజకీయ బొమ్మాళి
అవును .. నిజం చిరును రాజకీయం వదలనంటోంది. అవునండోయ్ .. నిజమే నండోయ్ తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి ఇటీవల చేసిన ఆడియో ట్వీట్, గాడ్ ఫాదర్ సినిమా డైలాగే అయినా, నిజమేనండోయ్. చిరంజీవి రాజకీయాలకు దూరమైనా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదన్నది మాత్రం ‘రియల్’ గానూ నిజమేనండోయ్.
ఆయన రాజకీయాలను వదిలేసి చాలాకాలమే అయింది. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత ఇంకొంత కాలం, రాజ్యసభ సభ గడువు ముగిసే వరకు రాజకీయాల్లో ఉండీ ఉండన్బట్లు ఉన్నా, ఆ తర్వాత, రాజేకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. సినిమాల్లో బిజీ అయి పోయారు. తమ్ముడు పవన్ కళ్యాణ్’ రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు, ఎన్నికల్లో పోటీ చేసినా, చిరంజేవై మాత్రం, అసలు ఆ దిక్కు కేసి .. ఒక్క స్టెప్ కూడా వేయలేదు. కనీసం ఒక్కసారి పేస్ టర్నింగ్ ‘ ఇచ్చి ఒక్క లుక్కైనా వేయలేదు.
అయినా .. .అయన పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, రాహుల్ గాంధీ ఏపీ పార్టీ అధ్యక్ష పదవి చిరంజీవికి ఇచ్చే ఆలోచన చేశారు. చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న ఉమెన్ చాంద్ కి అప్పగించారు. ఆవసరమైతే తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతున్నారని అమరావతిలో-హైదరాబాద్’లో పార్టీ సమావేశాలు నిర్వహించినా దూరందూరంగానే ఉన్నారు. అప్పట్లోనే చిరంజేవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సినిమా టికెట్’ రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా ప్యాలెస్కు పిలిచి చర్చలు జరిపారు. ఓ చిరు సన్మానం కూడా చేశారు. అప్పుడు మళ్ళీ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూ, ‘ఇదిగో తోక, అదిగో పులి’ వార్తలు షికారు చేశాయి. చివరాఖరుకు మెగా స్టార్, అబ్బే అలాంటిదేమీ లేదని సంజాయషీ లాంటింది ఇచ్చుకునేందుకు చాలా చాలా శ్రమ తీసుకోవలసి వచ్చింది.
అలాగే, ఈ మధ్యనే అల్లూరి సీతరామరాజు 125వ జయంతి సందర్భంగా, భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నఅల్లూరి విగ్రహవిష్కరణ సభలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిపిచారు. ప్రధాని మోడీ ఎదురెళ్ళి మరీ చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానించారు. హగ్గులు, అలింగానాల ద్వారా ప్రధాని మోడీ స్వయంగా ఇద్దరి మధ్య, ‘సంథింగ్, సంథింగ్’ ఎదో ఉందనే సంకేతాలను పంపించారు. అదే వేదిక మీదున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరకు మంత్రి రోజా, కంటే కూడా చిరంజీవికి మోడీ కొంచెం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చిరంజీవిని బీజేపీ దువ్వుతోందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబు, ఆ వేదిక మీద ఒక్క చిరంజీవి మినహా మిగిలిన అందరూ అద్భుతంగా నటించారని, ఓ కాంట్రవర్షల్ కామెడీ కామెంట్ కూడా చేశారు. బట్ ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి.
సో .. చిరంజీవి, గాడ్ ఫాదర్ చితం ప్రమోషన్ కు రిలీజ్ చేసిన, డైలాగులో చెప్పినట్లుగా, తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదన్నది... నిజంగానే నిజం.అయిత ఇక్కడితో కథ కంచికి చేరలేదు. అసలు అసలు ట్విస్ట్ ఇక్కడే ..ఉంది. ఇంచుమించుగా ఓ 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగతున్న ఎన్నికల్లో, చిరంజీవికి ఓటు హక్కు ఉంది. అవును, అవును కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనకు తెలుసో లేదో కానీ, కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవి పేరుతో ఉన్న ఐడీకార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పోనీ అదేదో ఆకతాయలు పననుకుందామా అంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది. దీంతో, చిరంజీవి రాజకీయాలకు దూరమైనా .. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదని మరో మారు పక్కగా, కన్ఫర్మ్ అయింది ... అంతే మరి మామూలు గజ్జీ, తామర అయితే ఏ జాలింలోషన్’తోనో నయం అవుతాయి.. ఇది రాజకీయ గజ్జీ,అంటుకుంటే అంతే.. ఇక వదలనే వదలదు. గోకుతూనే ఉంటుంది.