ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై సైలెన్స్ కొడాలి నాని ఫేటేంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలలూ విమర్శలు గుప్పించారు.  చివరకు సీఎం   జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు   షర్మిల, జగనన్న వదిలిన బాణం సైతం    ముమ్మాటికి తప్పేనని విస్పష్టంగా చెప్పేశారు. అయితే ఈ వ్యతిరేకత అంతటితో ఆగలేదు. హెల్త్ యూనివర్శిటీకి వైయస్ఆర్ పేరు పెట్టడం వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు సైతం అంగీకరించలేకపోతున్నట్లు సమాచారం.   మాజీ మంత్రి  కొడాలి నాని అయితే  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయంపై రగిలిపోతున్నారని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి  జగన్‌వి పిల్ల చేష్టల్లా ఉన్నాయంటూ కొడాలి నాని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని చెబుతున్నారు.   ఇన్నాళ్లు జగన్ ఏదీ మాట్లాడమంటే.. మీడియా ముందు మాట్లాడాననీ. కానీ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు  ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడతానంటే మాత్రం తాను సమర్ధించలేననీ, అయినా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల   జిల్లాలోనూ, సొంత నియోజకవర్గంలోనూ మొహం చూపుకునే  పరిస్థితి లేకుండా పోయిందని కొడాలి నాని వాపోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిపై జగన్ ఆదేశాల మేరకు విమర్శలు చేశాననీ, ఇంకా చేయమన్నా చేస్తాను కానీ, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ మాత్రం మాట్లాడటం తన వల్ల కాదని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.    వచ్చేది ఎన్నికల సీజన్.. కావడంతో  ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేయాలని.. కానీ ఇవేమి పట్టించుకోకుండా..  స్ జగన్ ఏ రోజు ఏ పిచ్చి నిర్ణయం తీసుకుని సమర్ధించమంటూ హుకుం జారీ చేస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన తలకొట్టుకుంటున్నట్లు కొడాలి నాని సన్నిమితులు చెబుతున్నారు.   హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ముందుగానే  కొడాలి నానికి సమాచారం ఉందని అంటున్నారు.  అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు.. ఈ పేరు మార్పు వ్యవహరంపై ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలంటూ..నానికి  తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నేరుగా ఫోన్ కూడా వచ్చిందని చెబుతున్నారు.  కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో జగన్ తో ఏకీభవించలేకపోతున్న కొడాలి నాని ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడటం ఇష్టం లేకే అసెంబ్లీకి ఆ రోజు డుమ్మా కొట్టారని నాని సన్నిహితులు చెబుతున్నారు.  అంతేకాదు.. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఇంత రచ్చ నడుస్తున్నా... కొడాలి నాని నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంపై తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొడాలి నాని విపక్ష నేతలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. అయితే మంత్రిపదవి పోగానే మాత్రం సైలెంటైపోయారు. మంత్రి పదవి ఊడిపోయిన తొలి రోజుల్లో తన నియోజకవర్గంలోని తన సొంత పశువుల పాకలో విశ్రాంతి తీసుకున్నారు. లేదా అజ్ణాత వాసం చేశారు. ఆ ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇటీవలి కాలంలో జగన్ మళ్లీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తారనీ, గత కేబినెట్ లో నోరున్న మంత్రిగా గుర్తింపు పొందిన నానికి చాన్స్ ఉంటుందనీ వార్తలు రావడంతో ఆయన మళ్లీ గొంతు సవరించుకున్నారు. వరుస మీడియా సమావేశాలలో విపక్ష నేతలపై గతం కంటే ఎక్కువగా బూతుల వర్షం కురిపించేశారు. ఇక మంత్రిపదవి పక్కా అనుకునే లోగానే ఉరుములేని పిడుగులా   ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం నాని ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పాలి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు మద్దతుగా నాని నోరు విప్పకపోవడం.. సన్నిహితుల వద్ద జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడంతో ఇక కొడాలి నానికి మాజీ మంత్రి అనేది శాశ్వత హోదాగా మిగిలిపోక తప్పదని పార్టీ వర్గాలే అంటున్నాయి. నాడు కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ పేరే ఇప్పుడు ఆయన రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కల్పించిందని.. ఇది ఆ(ఎన్టీఆర్) దేవుడి స్క్రిప్టేననీ నాని వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు.

ఇక చాలు ...పీకే ఇక సెలవు ..పీకే

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరసగా మూడవసారి గెలిచింది. హ్యాట్రిక్ సాధించింది. నిజానికి మమతా బెనర్జీ వరస  విజయాలకు ఇంకా చాలా కారణాలే ఉన్నా, బీజేపీ క్రియేట్ చేసిన హైప్ కారణంగాఆ క్రెడిట్  మొత్తం, ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్(పీకే) ఖాతాలో చేరింది. పీకే వ్యూహాల కారణంగానే తృణమూల్ హ్యాట్రిక్ విజయం సాధించిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీకి 200లకు పైగా సీట్లు ఖాయమంటూ ప్రచారం సాగించినా, బీజేపీ సంఖ్యాబలం 100కు చేరదని ముందుగా చెప్పి మరీ, బీజేపీని 70 ప్లస్ వద్ద కట్టడి చేయడంతో పీకే పేరు దేశమంతా మారుమోగిపోయింది. అయితే, అదే సమయంలో పీకేఎన్నికల వ్యూహకర్త రోల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు, కానీ తప్పుకోలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలతో డీల్ కుదుర్చుకున్నారు. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాలు తన వంటికి పడవని, ‘ఐయాం ఏ ఫెయిల్డ్ పోలిటిషియన్’.. విఫల రాజకీయ వేత్తను’ అని ప్రకటించుకున్నారు. కానీ మాట మీద నిలబడలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. జోడు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే, తృణమూల్ తోనూ పరోక్ష బంధాలు కొనసాగించారు. తృణమూల్  జాతీయ ఆకాంక్షలను సొమ్ము చేసుకున్నారు.  కమిషన్ వ్యాపారాలు మారు బేరానికి సరుకులు అమ్మినట్లు, గోవా తదితర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులను తృణమూల్ లో చేర్పించారు.  మరో వంక బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఓడించే వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలను  ఏకం చేసే ప్రయత్నాలు చాలానే చేశారు. మమతా బెనర్జీ మొదలు కేసీఆర్ వరకు వాళ్ళను వీళ్ళను ముందు పెట్టి, కథ నడిపించారు. కానీ వర్కౌట్ కాలేదు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రణాలికను తయారు చేసి పార్టీ ముందుంచారు. అయితే ఏదైతే నేమి కానీ, పీటల దాకా వచ్చిన ప్రేమాయణం, పుటుక్కు మంది. పీకే కాంగ్రెస్ ఎంట్రీ పీటల మీదనే ఆగిపోయింది. అదలా ఉంటే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పీకే వ్యూహాలు బెడిసి కొత్డుతున్నాయనే నిజాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా  గుర్తించినట్లున్నారు.అందుకే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి పీకేకు గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.   నిజానికి, పీకే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఐసీయులో ఉన్న పార్టీలను బతికించిన దాఖాలాలు లేవు. గెలుపు అంచున ఉన్న పార్టీలను ఆ గట్టుకు చేర్చడం వరకే  పీకే వ్యూహాలు పనిచేశాయని  ఆయన ట్రాక్ రికార్డే చెపుతోంది.  అదీ కాక  పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, జరిగిన ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పీకే ప్రత్యక్షంగా ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీకి పనిచేయలేదు. గోవాలో మాత్రం పరోక్షంగా తృణమూల్ కాంగ్రీస్ కు పనిచేశారు. కానీ, గోవాలో మమతా బెనర్జీ పార్టీకి చేతి చమురు వదిలిందే కానీ,ఫలితం మాత్రం దక్కలేదు. బీజేపీ కంటే ఇంచు మించుగా మూడు రెట్లు ఎక్కువగా  చేసినా, తృణమూల్ కు సున్నా సీట్లే వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన లెక్కల ప్రకారం, బీజేపీ రూ.17 కోట్లు ఖర్చు చేస్తే, తృణమూల్  ఏకంగా రూ. 47 కోట్లు ఖర్చు చేసింది.  అయినా, ఒక్క సీటు కూడా దక్కలేదు. అందులో పదో వంతు కూడా చేయని ఆప్ కు రెండు సీట్లు వచ్చాయి.  అంతే కాకుండా, పీకే ఇటో కాలు అటో కాలు వేస్తున్నారు. ఓ వంక కేసీఆర్ ను జాతీయ నేతను చేసందుకు ఆయనతో డీల్ కుదుర్చుకున్నారు. అదే సమయంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పీఎం కాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్  డీల్ కుదురుచుకున్నట్లు తెలుస్తోంది. మరోవంక, తెలంగాణలో తెరాస పీకే తోక పట్టుకున్నప్పటి నుంచి, ఆ పార్టీకి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులు తున్నాయి. అందుకే, సెంటిమెంట్స్ కు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చే, కేసేఆర్ మొహమాటం  లేకుండా  ఇక చాలు ..పీకే ..అని ఆయనకు కటీఫ్ చెప్పారు.  అయితే, ఇచ్చిన కోట్లు వెనక్కి తెచ్చుకునే వీలు లేక పీకే ఉచిత సేవలు అందిస్తున్నారని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. సోషల్  మీడియా క్యాంపెయిన్ వరకు చాలని, సర్వేలు, వ్యూహాలకు చుక్క పెట్టేశారు. ఇక ఏపీ విషయానికొస్తే, గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన పీకే ఈసారి, ముందుగానే వైసేపీ ఓటమిని గుర్తించారో ఏమో కానీ, పీకే డైరెక్ట గా  రంగంలోకి దిగలేదు. ఆయన బదులుగా ఐ ప్యాక్ టీము సభ్యుడు రిషి రాజ్ కు బాధ్యతలు అప్పగించారు. ఆ రిష్ రాజ్, చావుకు పెళ్ళికి ఒకే డప్పు అన్నట్లుగా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీకే ప్లే ట్యూన్సే రీప్లే చేస్తున్నారు. ఆశించిన ఫలితాలు రావడం లేదు సరికదా రిష్ రాజ్ వ్యూహాలు ఎదురు తంతున్నాయి. అందుకే పీకే టీమ్ పనితనం విషయంలో వైసీపీలో అసంతృప్తి మొదలైంది. అందుకే, జగన్ రెడ్డి కూడా ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆల్రెడీ ఐసీయూలో ఉన్నా వైసేపీ సర్కార్ ను సేవ్ చేయడం, సెకండ్ టైమ్ గెలిపించడం ఒక పీకే కాదు, పది మంది పీకేలు వచ్చిన అయ్యే పనికాదని పరిశీలకులు అంటున్నారు. అదెలా ఉన్నా, 2014 నుంచి దేశ రాజకీయాల్లో సంచలనంగా, రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒక సవాలు మారిన పీకే .. దటీజ్ ప్రశాంత్ కిశోర్ అధ్యాయం ఇక ముగిసినట్లే కనిపిస్తోందని, అంటున్నారు.

ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన: ఎస్ జైశంకర్

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370  తాత్కాలిక నిబంధ‌నని,రద్దు తర్వాత జరిగిన రాజకీయాలను వాస్తవాల ను ఎలా వక్రీకరించారు, నిర్దిష్ట కథనాన్ని రూపొందించడానికి విషయాలు ఎలా కీల‌క‌పాత్ర వ‌హించాయో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం వివరించారు. వాషింగ్టన్ డీసీలో 'మోడీ 20' పుస్తక పఠనం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 5, 2019న, ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన జమ్మూ మరియు కాశ్మీర్  ప్రత్యేక హోదా ను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్ర ప్రభు త్వం తన నిర్ణ యాన్ని ప్రకటించింది. డిసీ లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో, జ‌మ్ముకాశ్మీర్ కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, భారత  రా జ్యాంగం తాత్కాలిక నిబంధనే అని మంత్రి స్ప‌ష్టం చేశారు. అయితే, ఆర్టికల్ 370 రద్దుకు సంబం ధించిన వాస్తవాలు పక్కదారి పట్టాయని, విషయాలు ఆడించబడ్డాయని ఎస్ జైశంకర్ వాదించారు. వాస్తవాలు వక్రీక రించార‌ని, ఏది సరైనది, ఏది తప్పు అనేది గందరగోళంగా ఉందని నేను భావిస్తు న్నాన‌న్నారు. ఆర్టికల్ 370లోని రాజకీయాలను తప్పనిసరిగా వ్యతిరేకించాలని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని విదేశాంగ మంత్రి అన్నారు. ప్రజలు ఈ సమస్యను విరమించుకోవద్దని, దానిని పోటీ చేసి కథనాన్ని రూపొందించడానికి సందేశాన్ని అందించాలని ఆయన అన్నారు. ఇది పోటీ ప్రపంచం. మనం మన సందేశాన్ని అందజేయాల‌ని చెప్పారు. ఈ చర్చల నుండి దూరంగా ఉండటం ద్వారా మనం మన దేశానికి లేదా మన నమ్మకాలకు బాగా సేవ చేయడం లేదు లేదా మన మంచి లేదా తప్పు అనే భావనను కూడా బాగా చేయడం లేదు. మనకు అభి ప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తపరచాలి, మనం వాటిని ప్రజలతో పంచుకోవాలి మనం దేనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది సరైనది మరియు ఏది తప్పు, అని మంత్రి కొనసాగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి మంత్రి ప్రస్తావిస్తూ, నాకు, ఇది మనస్సును కదిలించేది, ఎవరి మెరిట్ చాలా స్పష్టంగా ఉందో, వేరే విధంగా ఆలోచించే వ్యక్తులు కూడా ఉండాలని అన్నారు.

మునుగోడులో కమలం పార్టీకి ఎదురుగాలి.. అభ్యర్థి తీరే కారణమని బీజేపీ అసహనం

మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి గండంగా మారిందా? ట్రంప్ కార్డ్ అనుకున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కారణంగానే అక్కడ ఎదురుదెబ్బ తగలనుందా? కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బలాన్ని అతిగా ఊహించుకుని ఉప ఎన్నికకు తెరతీసిన కమలం పార్టీ బొక్కబోర్లా పడనుందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ లా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ను తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలూ తెరాస, కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి రాచబాట అవుతుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి, మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో బీజేపీ చిక్కుల్లో పడింది. ఆయన వ్యాఖ్యలకు మునుగోడు ఓటర్లు, రైతులు రగిలిపోతున్నారు. ఇక తెరాసకు అయితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు అయితే పదునైన విమర్శనాస్త్రాలు సంధించడానికి ఒక అవకాశంగా అంది వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ టికెట్ పై ఒక సారి ఎంపీగా, మరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక రావడానికి కారణం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశాననీ, ఉఫ ఎన్నిక వస్తేనా నియోజకవర్గ అభివృద్ధికి తెరాస సర్కార్ నడుంబిగిస్తుందని ఆయన తన రాజీనామా సందర్భంగా చెప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తెరాసను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదనీ అందుకే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాననీ కూడా చెప్పుకొచ్చారు. సరే బీజేపీలో చేరిన రాజగోపాలరెడ్డి అదే పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస మునుగోడు ఉఫ ఎన్నికలో విజయం సాధించి కమలం స్పీడ్ కు బ్రేక్ వేయాలని, సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని ఇక్కడా రిపీట్ చేసి రాష్ట్రంలో తమకు తిరుగులేని మద్దతు ఉందని చాటాలని బీజేపీ విశ్వయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన ఓ వ్యాఖ్య బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. అధికార తెరాస మొదటి నుంచీ కూడా తెలంగాణ వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే నష్టమేమిటి? అంటూ చేసిన వ్యాఖ్యలు రైతాంగంలో ఆయన పట్ల, బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. డిస్కంలను కాపాడుకునేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పేంటి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా సీన్ సితార అయిపోయిందని పరిశీలకులు అంటున్నారు.  ఉచిత కరెంటుకు తాను వ్యతిరేకం కాదంటూనే ఆయన మరో వ్యాఖ్య చేశారు. ఎవరు ఎంత కరెంట్‌ కాల్చుతున్నరో, ఏ రైతుకు ఎంత సబ్సిడీ వస్తున్నదో తెలుసుకొనేందుకే కేంద్రం మీటర్లు పెడుతామని చెప్పి ఉండవచ్చన్నారు. దీంతో మునుగోడుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల రెడ్డి ఎంపిక పట్ల బీజేపీ అధిష్ఠానంలో ఒకింత అసంతృప్తి ఉంది. ఇంతన్నాడు అంతన్నాడు చివరికి తనతో పాటు క్యాడర్ ను తెచ్చుకోవడంలో విఫలమయ్యాడన్న అసంతృప్తి ఆ పార్టీ నేతలలో కనిపిస్తోంది. దుబ్బాక,  హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను బిజెపి అనూహ్యంగా ఎక్కువ కార్పొరేటర్ లను గెలుచుకోవడంతో  మునుగోడు ఉప ఎన్నికల తో పాటు,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను  తెలంగాణలో కమలం జెండాయే ఎగురుతుందన్న విశ్వాసంతో ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే ఆఘమేఘాల మీద రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి, కమలం తీర్థం ఇచ్చి మరీ మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపింది బీజేపీ. ఆయనకు  నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉందనీ, విజయం తథ్యమనీ బీజేపీ విశ్వాసంతో ఉంది. కోమటిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కమలం తీర్థం పుచ్చుకుంటారని ఆశలు పెట్టుకుంది. అయితే అదేమీ జరగకపోవడంతో మునుగోడులో బీజేపీని గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు మునుగోడులో మకాం వేసే ప్లాన్ లో ఉన్నారు. కానీ నియోజకవర్గంలో రాజగోపాలరెడ్డిని జనం ఎక్కడికక్కడ సమస్యలపై నిలదీస్తుండటంతో రాజగోపాలరెడ్డి బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నాం అన్న భావన కమలం నేతలలో మొదలైందని అంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్ల విషయంలో చేసిన వ్యాఖ్యలతో కమలం పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారట. ఎరక్కపోయి ఉప ఎన్నికకు తెరతీసాం..ఇప్పుడు ఇరుక్కుపోయామా అని మధన పడుతున్నారట. మునుగోడులో ఫలితం కమలం పార్టీకి వ్యతిరేకంగా వస్తే  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై ఆశలకు నీళ్లొదిలేసుకోవలసిందేనన్న ఆందోళన బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది. అందుకే నష్ట నివారణ కోసం మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి బలంతో కాకుండా కమలం ఇమేజ్ తో విజయం సాధించేందుకు పావులు కదుపుతోందంటున్నారు. 16 మందితో వ్యూహ కమిటీని ఏర్పాటు చేసి మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కోమటిరడ్డి రాజగోపాలరెడ్డికి మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థిగా మాత్రమే ప్రజల ముందు నిలబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మునుగోడులో పార్టీ ప్రచారం సహా అన్నీఆ కమిటీయే చూసుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే రాజగోపాలరెడ్డికి విస్పష్టంగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  

వీర విధేయ గెహ్లాట్ తిరుగు బాటు ?

రాజస్థాన్  ముఖ్యమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌... గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. విధేయతకు పర్యాయపదంగా నిలిచే  గెహ్లాట్  సోనియా గాంధీ ఆదేశాలను తూ..చ తప్పకుండా పాటిస్తారు. అందుకే ఆమె ఏరి కోరి పార్టీ అధ్యక్ష పదవికి, అధికార అభ్యర్ధిగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆమె  ఆదేశాల మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వదులుకుని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు గెహ్లాట్  అంగీకరించారు. అలాగే, రాహుల్ గాంధీ అన్నా గెహ్లాట్ కు చాలా చాలా గౌరవం. రాహుల్  గీత గీస్తే  గెహ్లాట్‌ ఆ గీత దాటరు గాక దాటరు. అందుకే పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా  రాష్ట్ర ముఖ్యంత్రి పదవిలోనూ కొనసాగాలని మనసులో కోరిక ఉన్నా,రాహుల్ గాంధీ, నో.. కుదరదు అనగానే మనసులోని కోరికను మనసులోనే తుడి చేశారు. ఒకరికి ఒకే పదవి అనే సూత్రం పాటించాల్సిందేనని రాహుల్ హుకుం జారీ చేయగానే, గెహ్లాట్‌ మరో మాట లేకుండా, జీ హుజూర్  అని వచ్చేశారు.  ఆదివారం (సెప్టెంబర్ 25) సాయంత్రం వరకూ మీడియాలో ఇదే కథ నడిచింది . కానీ అ తర్వాతనే అసలు కథ మొదలైంది.  ఢిల్లీలో సోనియా గాంధీ వద్ద,  తిరువనంతపురం (కేరళ) లో రాహుల్ గాంధీ వద్ద తలూపి వచ్చిన, ‘వీర విధేయ’ గెహ్లాట్ తానేమిటో, తన సత్తా ఏమిటో చూపించారు. ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోవలసిన సమయం వచ్చే సరికి, ఆయనలోని అపరిచితుడు బయటకు వచ్చారు. గెహ్లాట్ వారసుని ఎన్నిక/ఎంపిక కోసం వచ్చిన కేంద్ర పరిశీలకులకు ఒకసారిగా చుక్కలు చూపించారు. కాంగ్రెస్ సంస్కృతీ, ఆనవాయితీ ప్రకారం, గెహ్లాట్ వారసుని ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేస్తూ, రాజస్థాన్ సీఎల్పీ ఏక వాక్య తీర్మానం  చేస్తుందని భావించిన కేంద్ర పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌లు అక్కడ జరుగతున్న పరిణామాలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏకవాక్య తీర్మానం కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశానికి గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అంతే కాదు, అధిష్టానం సచిన్ పైలట్‌ కు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని ఎదురు తిరిగారు. పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని  చేయడానికి వీల్లేదంటూ గెహ్లాట్  వర్గం ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించగా.. అంతకుముందే గెహ్లాట్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నివానికి వెళ్లి పదవులకు రాజీనామా లేఖలు అందించారు. దీంతో అధిష్ఠానం సీఎల్పీ భేటీని  రద్దు చేసి.. గెహ్లాట్,  పైలట్‌ సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లినవారిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఏది ఏమైనా గెహ్లాట్  అయన వర్గం సచిన్ పైలెట్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా అంగీకరించదనే విషయం అయితే  ఈ పరిణామాలతో క్లియర్ కట్ గా స్పష్టమైందని, పరిశీలకులు అంటున్నారు.  అయితే, ఈ పరిణామం  రాజస్థాన్ కు సంబంధించినదే, అయినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగతున్న వేళ అశోక్ గెహ్లాట్ అనూహ్యంగా ఎగరేసిన తిరుగు బాటు జెండా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సవాలుగా మారిందని అంటున్నారు. ఈ ప్రభావం ఇతర రాష్ట్రాలలోనూ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గెహ్లాట్ వర్గం తిరుగు బాటుకు తలోగ్గితే పార్టీపై అసలే అంతంత మాత్రంగా ఉన్న పట్టు మరింతగా సన్నగిల్లిపోతుంది, అలాగని చర్యలు తీసుకుంటే, మొదటికే మోస మొస్తుంది. మరో వంక పార్టీ అధ్యక్ష పదవికి ఒక తిరుగుబాటు నేతను ఎన్నుకుంటే అది పార్టీ  ప్రతిష్టను మరింత దిగజార్చి వేస్తుందని, పరిశీలకులు భావిస్తున్నారు.   మరో  సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఎటు దారి తీస్తుందో ఉహించడం కూడా కష్టమే అంటున్నారు. ఒక విధంగా పంజాబ్ అసెంబ్లీ  ఎన్నికలు ముందు ఆ రాష్ట్రంలో ఎదురైన సమస్యలే, ఇప్పుడు రాజస్థాన్ లోనూ తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.  అలాగే, ఈ అన్నిటికీ ప్రధానంగా పార్టీ అధిష్టానమే బాధ్యత వహించవలసి ఉంటుందని అంటున్నారు. అలాగే సంక్షోభ సమయంలో, రంగంలోకి దిగి పరిస్థతిని చక్కదిద్దే సామర్ధ్యమున్న అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ వంటి ట్రబుల్ షూటర్స్   లేక పోవడం కూడా ఒక్కొక రాష్ట్రం పార్టీ చేజారి పోవడానికి కారణంగా భావిస్తున్నారు.

దొంగ‌లు ప‌డ్డార‌నుకుని హోట‌ల్లోంచి పారిపోయారు!

అర్ధ‌రాత్రి దాటాకో, తెల్లారిగ‌ట్టో ఎవ‌రో వ‌చ్చిన‌ట్ట‌యింది.పెద్దావిడ త‌లుపు తీసింది. వ‌చ్చిన‌వాడి మొహం స‌రిగా క‌న‌ప‌డ‌లేదు. అంతే చేతి క‌ర్ర‌తొ నెత్తిన ఠ‌పీమ‌ని ఒక్క‌టిచ్చుకుంది.. నేనే మామ్మా.. అంటూ మ‌న‌వడు గుమ్మంలోనే ప‌డిపోయాడు! అయ్యో దొంగ‌నుకున్నార్రా..అంటూ త‌ర్వాత స‌ప‌రిచ‌ర్య‌లూ చేసింది మ‌నవ‌డికి. ఒక్కోసారి ఇలాంటి సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతూంటాయి.  బ్రెజిల్ లోనూ జ‌రిగింది. జాగింగ్‌, ర‌న్నింగ్ చేసేవారు వాళ్లు ప‌రిగెత్తాల్సిన ట్రాక్‌లో వెళ్ల‌కుండా అలా ప‌రిగెడుతూంటారు.  రోడ్డు ప‌క్క నే స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తూ టిఫిన్ తిన‌డానికి ఈమ‌ధ్య అన్ని ప‌ట్ట‌ణాల్లోనూ ఓపెన్ రెస్టారెంట్లు వ‌చ్చేశాయి. బ్రెజిల్  రెకీఫీ లోని  ఒక న‌గ‌రంలో ఇలాంటిదే ఒక‌టి ఉంది. ఈమ‌ధ్య ఓ సాయింత్రం కొంత మంది అలా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూన్నారు. అంత‌లో ఎవ‌రో ప‌రిగెడుతూ రావ‌డం ఓ అమ్మాయి చూసింది. ముందు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎదుటివారితో మాట్లాడుతూనే ఎందుకో భ‌యంతో వెన‌క్కి తిరిగి చూసింది. అంతే ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ప‌రుగున వ‌స్తుండ‌డం చూసి భ‌య‌ ప‌డింది.  ఎవ‌రో దొంగ‌లు పోలీసుల నుంచి త‌ప్పించుకుంటూ పారిపోయి రెస్టారెంట్లోకి వ‌చ్చేస్తున్నార‌నుకుంది. అంతే వెంట‌నే ప‌ర్సు చేతిలో కి తీసుకుని టిఫిన్‌, కాఫీలు వ‌దిలేసి రోడ్డుమీద‌కి ప‌రిగెట్టింది. ఆమె ను చూసి మిగ‌తా అంద‌రూ కూడా పారిపోయాడు. ఆ రెస్టారెంటువాడికి ఏమీ అర్ధంగాక ప‌రుగున లోప‌ల్నించి బ‌య టికి వ‌చ్చేస‌రికి ఈ న‌లుగురు ర‌న్న‌ర్స్ న‌వ్వుకుంటూ ప‌రిగెడుతూ వెళ్ల‌డం చూశాడు. ఓరి మీ దుంప తెగ మీ ర‌న్నింగ్‌కి ఈ దారే దొరికిందా.. కొంప‌లు ముంచేరుక‌ద‌రా! అని గోల్లుమ‌న్నాడు. పోలీసుల‌కు ఫోన్ చేశాడు. తీరావ‌చ్చి అక్క‌డి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే, వారు దొంగ‌లు కాదు రోడ్డుకి అవ‌త‌లే ఉన్న జిమ్ స‌భ్యుల‌ని తేలింది. త‌ర్వాత ఏమ‌యిందీ త‌ర్వాత సంగ‌తి. ముంద‌యితే, పాపం ఆ రెస్టారెంట్‌వాడికి మాత్రం ఆ పూట న‌ష్ట‌మే వ‌చ్చింది. చాలామంది రోజూ వ‌స్తూపోతూంటారు. ఇటాంటి సంఘ‌ట‌న ఒక్క‌టి చాలు రెస్టా రెంట్ దెబ్బ‌తిన‌డానికి. రేప‌ట్నుంచీ జ‌నం వ‌చ్చినా వెన‌కా ముందూ చూసుకుంటూ, భ‌యం భ‌యంగానే టీ  కాఫీ తాగాలేమో!  అన్న‌ట్టు మీ వూళ్లో ర‌న్న‌ర్లు స‌రిగానే  వెళ్లాల్సిన దారిలోనే  ప‌రిగెడుతున్నారా? 

అజాద్ పార్టీ... డెమొక్ర‌టిక్ అజాద్ పార్టీ 

దేశ రాజ‌కీయాల్లోకి, ముఖ్యంగా కాశ్మీర్ రాజ‌కీయాల్లోకి మ‌రో పార్టీ ఆవిర్భ‌వించింది. చాలాకాలం కాంగ్రెస్ కొమ్ము కాసిన కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులామ్ న‌బీ అజాద్ కాంగ్రెస్‌నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. త‌మ‌ డెమొక్ర‌టిక్ అజాద్ పార్టీ ఎవ‌రి, ఏ ఇత‌ర పార్టీ ప్ర‌భావానికి అనుగుణంగా ఉండ‌ద‌ని అజాద్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.  కాంగ్రెస్‌ను వీడిన‌ప్ప‌టికీ ఆయ‌న స్వంత‌గా పార్టీ నెల‌కొల్పుతార‌ని ఊరిస్తూ వ‌చ్చారు. కాశ్మీర్‌లో త‌న అభి మానులు, మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత ఇప్ప‌టికి స్వంత పార్టీ ఏర్పాటు చేశారు. సోమ వారం మీడియా స‌మావేశంలో త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ ఎవ‌రి భావ‌జాలానికి లొంగి ప‌ని చేయద‌ని, స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. పార్టీజెండాను కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు. జండా కి నిలువుగా  నీలం, తెలుపు, ప‌సుపు రంగులు ఉన్నాయి.  కాశ్మీర్‌కు ప్ర‌త్యేక రాష్ట్ర హోదా సాధించ‌డ‌మే త‌మ పార్టీ ల‌క్ష్యంగా అజాద్ ప్ర‌క‌టించారు. పార్టీ పెడ‌తా న‌ని అంటున్నారే గాని దాని పేరు, జండాల గురించి కాశ్మీరీలు, ఇత‌ర పార్టీల‌వారూ గ‌త నెల రోజులుగా ఎదురు చూశారు. సోమ‌వారం పార్టీ పేరు, జండా కూడా ఆవిష్క‌రించ‌డంతో పాటు త‌మ పార్టీ ల‌క్ష్యాన్ని ప్ర‌జల సం క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని పార్టీ కార్య‌క‌లాపాలు ఉంటాయ‌ని అజాద్ అన్నారు. కాంగ్రెస్‌తో యాభ య్యేళ్ల అనుబంధాన్ని వ‌దులుకొని బ‌య‌ట‌ప‌డ‌గానే భారీ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ పార్టీ పేరు, జండా కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అనుగుణంగానే ఉంటుందని, వారే నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. పార్టీ త‌ప్పకుండా కాశ్మీరీ ల నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి పెడుతుంద‌ని హామీ యిచ్చారు. త్వ‌ర‌లో రాష్ట్ర ఎన్నిక‌లు ఉన్న కార‌ణంగా త‌మ‌పార్టీ కార్యాల‌యం ఇక్క‌డే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలి పారు. కాంగ్రెస్‌తో త‌మ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, పార్టీలో ఇపుడు ప‌రిస్థితులు ఎంతో మారి పోయాయ‌ని అన్నారు. రాహుల్ పార్టీ బాధ్య‌త‌లు మోసేంత శ‌క్తిమంతుడు కాద‌ని అన్నారు. 

తల్లి పోటు ..చెల్లి పోటును ఏమంటారు జగనన్నా ?

‘బాలయ్యా .. ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు. అక్కడ ఉన్నది ‘రీల్’ సింహం కాదు. జ‘గన్’ అనే  రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే’  ఇదొక ట్వీట్.  ఈ ట్వీట్’ చేసిన వారు, ఒక మహిళా మంత్రి ఆమె పేరు రోజా..  అలాగే మరో మహిళా మంత్రి కూడా ఇదే స్థాయిలో మరో ట్వీట్ చేశారు. నిజానికి, ఈ ఇద్దరు మంత్రులే కాదు,  జనం ఛీ.. కొడుతున్న ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు  వైసీపీ నాయకులు, సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు, దిగజారుడు వ్యాఖ్యలు చాలానే చేస్తున్నారు. వైసీపీకి తోడు, ఆ పార్టీ రహస్య మిత్రులు బీజేపే నాయకులు కూడా వంత పాడుతున్నారు. సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఅర్ కుటుంబంలో తెలుగు దేశం పార్టీలో చిచ్చుకు పెట్టే మరో కుట్రకు తెర తీస్తున్నారు.  చిత్రం ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, ఈ వంకర ట్వీట్లు చేసిన మహిళ మంత్రుల వరకూ ప్రతి ఒక్కరూ ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారో, చెప్పకుండా, తమ తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి లేదనే వితండ వాదాన్ని తెర మీదకు  తెస్తున్నారు.  ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేని గతాన్ని తీసుకొచ్చి, మోకాలుకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం నాయకులే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ ముక్త కంఠంతో ఒకటే ప్రశ్న అడుఉగుతున్నారు. ‘ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారు?’ అని. అలాగే తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని  అంటున్నారు.    కానీ, జగన్ రెడ్డికి, ఆయనకు ప్లూటు ఊదుతున్న  మహిళా మంత్రులు, ఇతర నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఎప్పుడో దశాబ్దాల క్రితం తెలుగు దేశం పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభానికి, ‘వెన్నుపోటు’ అనే పేరు తగిల్చి, ఆ వంక తమ ప్రభుత్వం తీసుకున్న అరాచక రాజకీయ నిర్ణయాన్ని సమర్ధించుకునే  ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి అప్పుడేమి జరిగిందో, ఎందుకు తెలుగు దేశం పార్టీలో సంక్షోభం ఏర్పడిందో, అందరికీ తెలిసిన విషయమే. ఆ నాడు, తెలుగుదేశంలో సంక్షోభానికి మూల కారణం, లక్ష్మీ పార్వతి. ఆమె దుష్ట సంకల్పంతో ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి పెట్టిన చిచ్చు కారణంగానే తెలుగు దేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. ఆమె దుష్ట బుద్దితో ఎన్టీఆర్ ను మోసం చేసి వివాహం అనే ముసుగులో ఆయన జీవితంలో ప్రవేశించారు. భార్యగా నటించారు. అప్పుడే కాదు, ఇప్పడు కుడా ఆమె నైజం మారలేదు.నిజంగా ఆమె మనసా,వాచా,కర్మణ ఎన్టీఅర్ ను భర్తగా భావిచి ఉంటే, గౌరవించి ఉంటే, ఎన్టీఆర్ కు ఇంత అవమానం జరిగిన మరు క్షణం ఆమె తన పదవికి రాజీనామా చేయవలసింది. కానీ, ఇన్ని రోజులైనా, ఇంత చర్చ జరుగుతున్నా ఆమె మౌనంగా ఉన్నారు. ఎన్టీఆర్ ను అవమానించిన ప్రభుత్వం ఇచ్చిన పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆమె ఎన్టీఅర్ జీవితంలో ఎందుకు ప్రవేశించారో , ఏమి చేశారో, రాజ్యాంగేతర శక్తిగా ఆమె ఎలా ప్రవర్తిచారో వేరే చెప్పనక్కరలేదు. ఇంకా చిత్రం ఏమంటే, నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో వుండి, అప్పట్లో వైసీపీని, జగన్ మోహన్ రెడ్డిని, చివరకు, చేతులు జాడించి జగన్ రెడ్డి, ‘ఆ దివంగత నేత, మహా  నాయకుడు’ అని గొప్పగా చెప్పుకునే వైఎస్సార్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన, ఈ మహిళా మణులే ఇప్పుడు చంద్రబాబు గురించి వెన్నుపోటు థియరీలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డిని   జ‘గన్’రీల్ సింహం కాదు, రియల్ సింహం’ అంటూ ఎత్తేస్తున్నారు. వారేవా, ఎంతటి జాణతనం, అని జనం విస్తు పోతున్నారు.  అదొకటి అలా ఉంటే, ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను చిలువలు పలవలుగా చిత్రించి అసలు సమస్యను పక్క దారి పట్టించే జగన్ రెడ్డి,  తనను కష్ట కాలంలో, జైలులో ఉన్న సమయంలో, జగనన్న వదిలిన బాణం అంటూ, సుదీర్ఘ పాద యాత్ర చేసి పార్టీని బతికించిన సోదరి షర్మిలకు ఇచ్చిన కానుకను ఏమంటారు? పార్టీని నిలబెట్టిన తన స్వంత తల్లీ, చెల్లిని పార్టీ నుంచి మెడ పట్టి బయటకు గెంటడాన్ని, ఏమంటారు? ఏ పోటంటారు? జగన్ రెడ్డి  అయన్ను భట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతున్న,మహిళా నేతలు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కానీ, వారు సమాధానం చెప్పరు. చెప్పలేరు, కానీ ప్రజలు మాత్రం సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తారు. నో డౌట్.

ఊస‌ర‌వెల్లి మ‌హాత‌ల్లి!

బ‌డిపేరు ...విద్యాల‌యం అనేది    దాన్ని సాయింత్రానిక‌ల్లా మార్చేశాడు. ప‌క్కింటి పెద్దాయ‌న‌, ఎదురింటివాళ్లూ వీధిలో చాలాకాలం ఉంచి ఉన్న వారంతా క‌లిసి క‌ట్టుగా కాకున్నా వంతుల వారీగా కాస్తంత సౌమ్యంగానే తిట్టారు. పెద్దామె మాత్రం పోనీ లేద్దూ, వీధి పేరు ఉండ‌నే ఉందిగా అన్న‌ది. ఈసారి ప‌క్క వీధిలోవారూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈవిడేనా అన్న ది అని.  ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చ‌డం పై ఇప్ప‌టికే దేశ‌మంతా తెలుగువారు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆ కాన్సెప్ట్‌ని అమ‌లు చేసిన వాడు ఎన్టీఆర్‌. అందుకు తెలుగు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. ఇప్ప‌టికీ ఆ వ‌ర్సిటీ ఎంతో గొప్ప‌సేవ‌లు అందిస్తోంది. ఎంతో ప్ర‌సిద్ధి పొందింది. కాగా త‌న‌కు న‌చ్చ‌లేద‌నో, వేరే పార్టీవారి  హ‌యాంలో ఏర్పాట‌యిన సంస్థ అనో ఏదో మిష‌తో పేరు మార్చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. అంతే అనుకున్న‌దే త‌డ వుగా దాని పేరు వైఎస్ ఆర్ హెల్త్ వ‌ర్సిటీగా మార్చేశారు.  కానీ దాన్ని ఇత‌ర మేధావుల‌ను గాని ఏమాత్రం సంప్ర‌దించ‌కుండానే కేవ‌లం అధికారంలో ఉన్న ద‌ర్పంతో ఆ నిర్ణ‌యం తీసేసుకున్నారు జ‌గ‌న్‌. అమ‌లు చేసిన నిర్ణయాన్ని కాదంది యావ‌త్ తెలుగు జాతి.  అయితే ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి కాస్తంత ఆల‌స్యంగానే తేరుకుని అదేం పెద్ద వివాదాస్ప‌ద అంశ మే కాద‌న్నారు. పేరు మార్చినంత మాత్రాన ప్ర‌త్యేకించి ప‌రువుపోవ‌డాలు, మ‌ర్యాద‌లు త‌గ్గ‌డాలు ఉండ‌వ న్నారు. పైగా ఒక సంస్థ‌కు పేరుమార్చారు. కానీ ఎన్టీఆర్ పేరు శాశ్వ‌తంగా ప్ర‌జ‌ల మ‌ధ్య నిలిచేలా, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ నిరంత‌రం పొందేలా ఏకంగా ఒక జిల్లాకే ఆయ‌న‌పేరు ఉన్నది క‌దా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. ఒక జిల్లా పేరు ఉండ‌డం చాలా గొప్ప‌సంగ‌తి. ఒక సంస్థ‌కు ఉన్న‌పేరును ఎవ‌ర‌యినా మార్చుకోవ‌చ్చు. అలాంటపుడు హెల్త్‌వ‌ర్సిటీ పేరు ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్ల మ‌ధ్య పెద్ద‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోన‌ వ‌స‌రం లేద‌ని ఆమె అభిప్రాయం. కానీ తెలుగు ప్ర‌జ‌లు అలా ఊరుకుంటారా? ఎంతో కాలం నుంచి ఆ మ‌హానుభావుడి పేరున ఉన్న‌ది ఇపుడు హ‌ఠాత్తుగా మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని మండి ప‌డుతున్నారు. ఎవ‌రు ఎలా స్పందించినా, అది ఎన్టీఆర్ ప‌ట్ల వారి వీరాభిమానానికి ద‌ర్ప‌ణం ప‌డు తుంది.  ఒక సంస్థ కంటే కృష్ణా జిల్లా కి ఎన్టీ ఆర్  పేరు ఉండ‌డం పెద్ద విష‌యం గ‌నుక‌, ఆ జిల్లా అభివృద్ధి , ప్ర‌జా సంక్షేమానికి ప్రాధాన్య‌త‌నీయాల‌ని ల‌క్ష్మీపార్వ‌తి సూచించ‌డాన్ని కూడా లెక్క‌లోకి తీసుకోవాల‌ని విశ్లేష కుల మాట‌. ప్ర‌తీదీ రాజ‌కీయ కోణంలో చూడ‌టం త‌గ‌ద‌ని ఆమె అన్నారు. అయితే స‌మ‌యంగాని స‌మ యంలో ఇలాంటి ఆవేశ‌పూరిత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తుంద‌నేది వైసీపీ నాయ కుల మ‌న‌సులో మాట‌. అస‌లే మూడేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు కూడా ప్ర‌తిప‌క్షం స్థాయిలో విసిగెత్తి, ఎదురు తిరుగుతున్నారు. ఎక్క‌డా మంత్రులు, ఎమ్మెల్యేలు తిర‌గ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ త‌రుణంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం పార్టీ భ‌విత‌ను దెబ్బ‌తీస్తుందనేది వారు బ‌య‌ట‌కు చెప్ప‌లేని మాట‌.  ఇక్క‌డ మ‌రో మాట‌.. అస‌లు సంస్థ పేర‌యినా, జిల్లాకి పేరు పెట్ట‌డం లేదా తీసేయ‌డం అనే అంశాల్లో  ల‌క్ష్మీపార్వ‌తి మ‌హోన్న‌త అభిప్రాయాలు, సూచ‌న‌లు ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మా? అని విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే, ఆమె ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే అంటిపెట్టుకుంటాన‌ని పూర్వం శ‌ప‌థం చేసి  ఆ త‌ర్వాత రాజ‌కీప‌రిణామాల్లో పార్టీకి దూర‌మ‌య్యారు. ఇపుడు జ‌గ‌న్ అభిమానిగా మారి వైసీపీ జెండా నీడ‌లో సంచ‌రి స్తున్నారు. క‌నుక ప్ర‌బుత్వ నిర్ణ‌యం మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరాభిమానుల‌కు ఎలా శిరోధార్య మో ల‌క్ష్మీ పార్వ‌తికి కూడా అంతే. అందుకే ఆమె వ‌ర్సిటీ పేరు మార్చ‌డం విష‌యాన్ని పెద్ద‌గా సీరియ‌స్‌ గా తీసుకో లేదు.. పైగా  కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరుంది గ‌దా.. వ‌ర్సిటీ  పేరు విష‌యం చిన్న‌దిగానే క‌న‌ ప‌డింది.  అయితే అన్నివ‌ర్గాల నుంచి ముఖ్యంగా విప‌క్షాల నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా  ఆమె ఆ విధంగా  స్పందించారు. కానీ గ‌తంలో ఎన్టీఆర్‌కు ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్టాడినా విరుచుకుప‌డిన ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర్సిటీ పేరు మార్ప‌డి విష‌యంలో మాత్రం గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌క‌పోవ‌డం ప‌ట్ల అంత‌టా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇపుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఖండించ‌క‌పోవ‌డ‌మే ఆమె ప‌రిస్థితి వ్య‌క్త‌ మ‌వుతుంది.  ఏ గాలి కా మాట మాట్లాడుతోంద‌న్న‌ది ప్ర‌జ‌లు గ్ర‌మించారు. ఇలాంటి ఊస‌ర‌వెల్లి త‌త్వాన్ని ఆమె త‌ప్ప మ‌రొక‌రు ప్ర‌ద‌ర్శించ‌లేరు. 

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తుగ్లక్ నిర్ణయం.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలు

పాలకుడు మూర్ఖుడైతే పాలకులకు కష్టాలు తప్పవన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశుడైతే సమాజంలోని అన్ని వర్గాలూ ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను లేకుండా చేసి విద్యార్థులను, యువతను అష్టకష్టాల పాలు చేసిన జగన్, ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో వైద్య విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారు. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మార్చుతూ శాసనసభ ఆమోదించిన బిల్లు కు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా  తిరస్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎస్ ఎఫ్ ఐ వివిధ  రాజకీయ పార్టీలు, విద్యార్థి - యువజన - కార్మిక సంఘాల రాష్ట్ర నేతలతో శనివారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలందరూ ముక్తకంఠంతో జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.  రాజకీయ అంశాన్ని కాకుండా సాంకేతికంగా కూడా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తుగ్లక్ నిర్ణయమేనని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ పై అభిమానం, వైఎస్ పై దురభిమానం అన్న అంశాన్ని పక్కన పెడితే జగన్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం  ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుబంధ విద్యా సంస్థల్లో   విద్యార్థులుగా ఉన్న వారి భవిష్యత్ తో చెలగాటమాడడమేనని విమర్శించారు. ఐదేళ్ళు వైద్య విద్యను అభ్యసించిన   విద్యార్థులు రెండు పేర్లతో ఉన్న యూనివర్సిటీ సర్టిఫికెట్ల తో భవిష్యత్ లో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ విశ్వ విద్యాలయంలో గతంలో వైద్య విద్యనభ్యసించిన వారు ముందు ముందు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి అనివార్యమౌతుందని ఆందోళణ వ్యక్తం చేశారు.  ఎందు కంటే విదేశాల్లో వారి వైద్య పట్టాకు ప్రాధాన్యత దక్కదని ఇన్ని సమస్యలను తెచ్చిపెట్టే పేరు మార్పు తుగ్లక్ చర్య కాక మరేమౌతుందని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.   సంక్షేమ పథకాలకు ఇప్పటి ప్రభుత్వం పెట్టుకొన్న పేర్లను   తర్వాత వచ్చే ప్రభుత్వం తొలగించినా లేదా గత ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను ఇప్పటి ప్రభుత్వం తొలగించినా ఆ పథకాలు కొనసాగినంత కాలం ఎటువంటి సమస్యా తలెత్తదు కానీ, విశ్వవిద్యాలయాల పేర్లను ఇలా రాజకీయ ప్రయోజనం కోసమే, కక్ష సాధింపు కోసమే, అయిష్టత కారణంగానో ఆషామాషీగా మార్చేస్తే సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠా మసకబారుతుందని, అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడం సరికాదనీ, ఆయన విజ్ణతతో నిర్ణయం తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు.  ఎన్.టి.ఆర్.ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని రాజకీయ దృష్టితో కాకుండా, ప్రజాప్రయోజనం దృష్టితో ఆలోచించి, చారిత్రక కోణంలో పరిశీలించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలనీ, ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం చరిత్రను అగౌరపరిచేలా ఉందనీ, దీనివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలు పేర్కొన్నారు.  అంతే కాకుండా ఆ యూనివర్సిటీ  అనుబంధ విద్యా సంస్థల్లో  చదువుకుంటున్న వారి భవిష్యత్ తో ఈ నిర్ణయం చెలగాటమడటమేనని అన్నారు.  విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన, ప్రతిష్ట , వైద్య విద్యా ప్రమాణాలు, వైద్య విద్యా రంగంలో పరిశోధనలపై ప్రభుత్వానికి దృష్టి లేని ప్రభుత్వం పేరు మార్పు విషయంలో తొందరపడటం రాజకీయ ప్రయోజనాలను ఆశించే తప్ప మరో కారణం కనిపించడం లేదన్నారు.  డాక్టర్ ఎన్టీఆర్  ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఒక చరిత్ర ఉంది. ఆ వర్సిటీ  ఎన్.టి.ఆర్. మానస పుత్రిక.  నైతిక విలువలతో కూడిన వైద్య విద్య అందించడం, సమర్థులైన పట్టభద్రులను తయారు చేయడం, నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆరోగ్య సంబంధిత విభాగాలను అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో ఎన్టీఆర్ నెలకొల్పిన విద్యాలయం అది. 1986లో ఈ వర్సిటీ    27 అనుబంధ కళాశాలలతో మొదలైంది.  2019-20 విద్యా సంవత్సరం ఈ వర్సిటీ అనుబంధ కాలేజీల సంఖ్య నాటికి 298 పెరిగింది. రాష్ట్రంలో  ఆంధ్రా విశ్వ విద్యాలయం, శ్రీవేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ సింహ, ఆదికవి నన్నయ్య  యూనివర్సిటీలు, ఆచార్య యన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలా ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది.   వాటి పేర్లు మార్చగలరా? మారిస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం సమర్ధిస్తుందా!  ఇడుపులపాయలోనే ఉన్న ట్రిబుల్ ఐటి  పేరు మారుస్తారా? అలాగే డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మార్చగలరా?  అని ప్రశ్నించారు. 

వివేకా హ‌త్య‌కేసు.. నిందితుడు శివ‌శంక‌ర రెడ్డికి  బెయిల్ నిరాక‌ర‌ణ‌

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి  సుప్రీంకోర్టు  బెయిల్  ఇచ్చేం దుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు తమకు కనిపించడంలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్‌రెడ్డి తరపున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.  వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారి న వాచ్‌మెన్ స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదన్నారు.  ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలే మని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.  గ‌తంలోనూ  నిందితుల‌కు క‌డ‌ప కోర్టు బెయిల్ నిరాక‌రించింది. కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న దేవి రెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డిల బెయిల్ పిటిష‌న్ ను కోర్టు కొట్టివేసింది. నిందితుల బెయిల్ పిటి ష‌న్ పై వాద‌న‌లు ముగియ‌డంతో బెయిల్ పిటిష‌న్ల‌ను కోర్టు కొట్టి వేసింది. మ‌రోవైపు శివ‌శంక‌ర్ రెడ్డికి నార్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు పిటిష‌న్ స్వీక‌రించింది. ఈ కేసులో వరుసగా రెండు, మూడు, ఐదో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ డి.రమేష్ నిరాకరిం చారు. ఇద్దరు నిందితులు ఆరోగ్య కారణాలతో బెయిల్ కోసం ప్రయత్నించారు.

బతకనేర్చిన తనమంటే ఇదేనా జూనియర్?

బతకనేర్చిన వాడు అనిపించుకోవడం చాలా సులువు. అయితే  ఆ మాట తిట్టుగానూ, పొగడ్తగానూ కూడా వాడుతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ బతకనేర్చినవాడుగా అభివర్ణిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అందరూ అంటున్న ఈ మాట ఏ విధంగా చూసుకున్నా కితాబని అనుకోవడానికి లేదు. రాజకీయాలకు చాలా కాలం నుంచీ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఎప్పుుడో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథంపట్టారు. అన్నగారు ఎన్టీఆర్ మనవడిగా ఆయనను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం ఎగబడ్డారు. ఆయన ప్రచారం బ్రహ్మాండంగా క్లిక్ అయ్యింది. కారణాలేమైతేనేం.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అంతే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు కనీసం చూడను కూడా చూడలేదు. పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు. సినిమాలలో బానే క్లిక్ అయ్యారు. ఎన్టీఆర్ మనవడిగా ఆయన సినీమా లాంఛ్ బ్రహ్మాండంగా జరిగింది. బాల రామాయణంలో రాముడిగా  మెరిసాడు. ఆ తరువాత కొంత  పెద్దయ్యాకా బ్లాక్ బస్టర్ లాంటి హిట్లతో స్టార్ హీరో హోదా సంపాదించుకున్నారు. ఆయన ఒక హీరో... ఆయన హీరోయిజం చూసే అనేక మంది ఎన్టీఆర్ కు వీరాభిమానులయ్యారు. హీరోయిజం తెరకే పరిమితమైందా అన్న విమర్శలను ఇప్పుడు జూనియర్ ఎదుర్కొంటున్నారు. ఏ మనిషైనా సరే కూడలి వచ్చినప్పుడు అటో ఇటో ఎటో అటు నడవాలి. ఆ నడక నీ దారి ఏమిటన్నది  తేలుస్తుంది. అంతే కానీ అటూ ఇటూ కాకుండా గోడమీద బల్లిలా ఉండిపోతానంటే.. అది బతక నేర్చిన తనం అవుతుందేమో కానీ మనిషి తనం, ధీరోదాత్త గుణం అని ఎంత మాత్రం అనిపించుకోదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారూ వ్యతిరేకిస్తుంటే.. ఆయన మనవడిగా ఎన్టీఆర్ స్పందన గోడమీద పిల్లి వాటాన్నే స్ఫురింప చేసింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ మనవడు అన్న హోదాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో స్పందించిన తీరు అటూ ఇటూ కాని విధంగా ఉందనీ, తన తాత ద్వారా స్టార్ డమ్ వచ్చేసింది కనుక ఇప్పుడు తన తాత ఇమేజ్ ను మసకబార్చే యత్నాలు చేస్తున్న వారిని ఖండించి వారికి దూరమవ్వడం బతక నేర్చిన తనం కాదనుకున్నారా అన్నట్లు ఆయన స్పందన ఉంది.   ఆయన స్పందన ఆయన హీరోయిజం కేవలం వెండితెరకే పరిమితం అని ఒ  తేటతెల్లం చేసేసింది. తాత గౌరవం కంటే.. తన సినీ కెరీర్ ను కాపాడుకోవడమే ఎన్టీఆర్ కు ముఖ్యమని తేలిపోయింది హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎన్టీరామారావును , వైఎస్‌తో పోలుస్తూ జూనియర్ చేసిన ట్వీట్ వెనుక ఉన్నది జగన్  అని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పును తప్పుపట్టేవారికి చెక్ అన్నట్లుగా  జగన్ సూచన మేరకు, జగన్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ఎన్టీఆర్ వ్యవహరించారన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి.  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ స్పందనను సమర్ధిస్తున్న వారంతా వైసీపీ వర్గీయులే కావడమే ఇందుకు ప్రబల నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ స్పందనను తమ నిర్ణయానికి ప్రజా మద్దతుగా చూపించుకోవాలన్న వైసీపీ వ్యూహం ప్రకారమే ఇదంతా జరిగిందన్న విశ్లేషణలకు కూడా  వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ స్పందనను బలపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.  ఎన్టీఆర్-వైఎస్‌ను ఒకేగాట కట్టిన ఎన్టీఆర్ స్పందన పట్ల తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానులే కాదు.. తెలుగు వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రభావం ఆయన సినిమాల మీద కూడా పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అంటు ఇప్పటికిప్పుడు బాయ్ కాట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ టాగ్ క్యాంపెయిన్ ప్రారంభం కాకున్నా... సినిమా బాగోగులతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ మనవడు అన్న అభిమానంతో ఆయన సినిమాలకు మద్దతు తెలిపే పరిస్థితి ఇక ముందు ఎంత మాత్రం ఉండదని పరిశీలకులు అంటున్నారు.   సరే.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మార్పు వ్యవహారంలో, ఎన్టీఆర్-వైఎస్‌ను జూనియర్ ఒకే గాట కట్టడాన్ని  సోషల్‌మీడియాలో టీడీపీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. రాజకీయ ఓనమాలు తెలియని జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఔన్నత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. పేదవాడి అన్నం గిన్నెలా ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ ఎవరికీ తలవంచని ధీరోదాత్తుడనీ, ఆయన మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతి అడుగూ భయమే, ప్రతి మాటా భయమే అన్న రీతితో వ్యవహరిస్తున్నారనీ అంటున్నారు. జూనియర్ తన అనుంగు స్నేహితుడిగా చెప్పుకునే కొడాలి నాని అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీటుగా ఖండించడానికి కూడా భయపడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆ తాత మనవడిని అంటూ అవకాశం వచ్చిన ప్రతి సారీ ప్రగల్బాలు పలికే జూనియర్.. ఆ తాత గౌరవాన్ని తగ్గించేలా ఆయన పేరు మీద ఉన్న హెల్త్ వర్సిటీ పేరు మారుస్తుంటే దీటుగా స్పందించడానికీ వెనుకాడిన విషయాన్ని ఎత్తి చూపుతూ  విమర్శలు సంధిస్తున్నారు.  అలాగే తన తాత పేరుమీద ఉన్న అన్న క్యాంటీన్లను రద్దు చేయడమే కాకుండా, ఆ పేరుతో క్యాంటీన్లు నడుపుతున్న వారిపై దాడిచేసి,వాటిని ధ్వంసం చేసిన పార్టీ నిర్ణయాన్ని సమర్ధించడమేమిటని నిలదీస్తున్నారు.    ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు  మార్పు వ్యవహారంలో జూనియర్  స్పందన ఆయనను ఎవరికీ కాకుండా చేసిందనడంలో సందేహం లేదు.  

కరోనా ఇక ముగిసిన అధ్యాయం!

గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అస్తవ్యస్థం చేసిన కరోనా మహమ్మరి ఇక ముగిసిన అధ్యాయమే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ధృవీకరించింది. చైనాలోని వూహాన్ లో మొదలైన కోవిడ్-19 ప్రపంచాన్ని కమ్మేసింది. లక్షలాది మంది  ఉసురు తీసేసింది.  మరి కొన్ని కోట్ల మంది కోవిడ్ అనంతర ఇబ్బందులతో ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఓ ప్రపంచానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఇక ఎంత మాత్రం పెండమిక్ కాదనీ, అది ఎండమిక్ స్టేజికి చేరందన్న చల్లని కబురు చెప్పింది.   ప్రపంచాన్ని గజగజలాడించినన కోవిడ్-19 కథ ముగిసినట్టే అని అధికారికంగా ప్రకటించింది. ‘కరోనా వైరస్ వెలుగు చూసిన రెండున్నరేళ్లకు మహమ్మారి పలాయనం చిత్తగించే సమయం ఆసన్నమైందనీ, ఇక కరోనా  ప్రాణాతక వైరస్ కాదని తేల్చేసింది. అంత మాత్రాన కరోనా పూర్తిగా అంతర్ధానమైపోయిందని కాదని వివరణ ఇచ్చింది. కరోనా మహమ్మారిక కారణంగా గత రెండున్నరేళ్లుగా   చీకటిగుహలో మగ్గిపోతున్నాం.  ఇప్పుడు ఆ మహమ్మారి ఎండమిక్ దశకు రావడంతో ఇప్పుడు ఆ చీకటి గుహ చివరిలో వెలుగు రేఖ కనిపిస్తోందని  డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది.  అయితే.. చీకటి గుహ  అవతలకు చేరుకుని వెలుగును పూర్తిగా అక్కున చేర్చుకోవడానికి మరింత సమయం పడుతుందని అంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని డబ్ల్యుహెచ్ ఓ   డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు.   కాగా.. కరోనా వైరస్ బలహీనం అయిందని అశోకా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ చెప్పారు.  తొలి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులను గౌతమ్ మీనన్ ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్ కు మన శరీరాలు అలవాటు పడ్డాయని, అందువల్ల ఇక ఈ వైరస్ ఇంకెంత మాత్రం ప్రాణాంతకం కాదని ఆయన వివరించారు.   కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్ల, 2 లక్షల 42 వేల 551 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్ సోకిన 65 లక్షల 40 వేల 339 మంది మరణించారు. కాగా భారతదేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల 45 లక్షల 72 వేల 243 కరోనా కేసులు నమోదయ్యాయి. 5 లక్షల 28 వేల 530 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు.

విభేదాలు సృష్టించ‌డ‌మే కేంద్రం ప‌ని...మ‌మ‌తాబెన‌ర్జీ

భ‌క్తి, స‌మైక్య‌తా భావ‌న‌ను పెంపొందించే దుర్గాపూజ స‌మ‌యంలోనూ బీజేపీ వ‌ర్గాలు విద్వేషాలు  రెచ్చ గొట్టేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం లేద‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మండి ప‌డ్డారు. ప్ర‌జ‌ల్లో మ‌త‌విద్వేషాలు రెచ్చ‌గొట్టి విభేదాలు తేవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆమె అన్నా రు. బీజేపీ అనుస‌రిస్తున్న రాజ‌కీయాలు ఏమాత్రం అంగీకార‌యోగ్యంగా లేవ‌ని ఆమె అభిప్రా య‌ప‌డ్డారు. దేశంలో మైనారిటీ వ‌ర్గాల ప‌ట్ల‌ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విప‌క్షాలు ఐక్య‌మై పోరాడ‌ వ‌ల‌ సిన అవ‌స‌ రాన్ని బ‌ల‌ప‌రు స్తోంద‌ని మ‌మ‌తా అన్నారు. ఆమె  టీఎంసీ ప‌త్రిక న‌జ్రూల్ మంచ్ ప్ర‌త్యేక సంచిక విడు ద‌ల చేసి ప్ర‌సం గించారు.  బెంగాల్ ప్ర‌భుత్వాన్ని అన్నివిధాలా అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా  ప్ర‌య త్నిస్తోంద‌ని ఆ ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. రాష్ట్రేత‌రులు కొంద‌రు డ‌బ్బులు ఆశించి డిజిట్ ప్లాట్‌ఫామ్‌ల‌ను బాగా వినియోగించు కుంటున్నార‌ని, వీరే సోష‌ల్ మీడియా ద్వారా రాష్ట్ర  ప్ర‌గ‌తిప‌ట్ల వ్య‌తి రేక‌త తీవ్రస్థాయిలో ప్ర‌చారం చేయడం దారుణ‌మ‌న్నారు.   దేశంలో అన్ని రాష్ట్రాల పాల‌నా వ్య‌వ‌హారాల్లోకి దూరి విభేదాలు సృష్టించి ప‌బ్బంగ‌డుపుకుంటున్న బీజేపీ వాస్త‌వానికి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, నిరోద్యోగుల స‌మ‌స్య‌ల గురించి నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఇప్ప‌టికే దేశంలో అన్నివ‌ర్గాల నుంచి నిర‌స‌న వెల్లువెత్తుతోంది. ఈ త‌రుణంలో బిజేపీ సిబిఐ, ఈడీల‌ను ఉసిగొల్పి విప‌క్షా ల‌పై ప‌గసాధించేందుకు పూనుకుని దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోందన్న‌ది విప‌క్షాల మాట‌.

భూముల విక్రయానికి తెలంగాణ సర్కార్ రెడీ !

తెలంగాణ ధనిక రాష్ట్రం. అందులో అనుమానం లేదు. కనక వర్షం కురిపించే ‘బంగారు హైదరాబాద్’ నోట్లో పెట్టుకుని పుట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నిస్సందేహంగా ధనిక రాష్ట్రం. కానీ, ఇప్పుడు అదే ధనిక రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయంది. ఎనిమిదేళ్లుగా ఏటి కేడాది పెంచుకుంటూ వచ్చిన అప్పులతో  రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందనేది కూడా ఎవరూ కాదనలేని నిజం. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నతెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం, ప్రస్థానం ప్రారంభంలోనే  బంగారు తెలంగాణ లక్ష్యంగా సంకల్పం చెప్పుకుంది. అయితే, ఎనిమిదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బంగారు తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ,చివరకు అప్పులు కూడా పుట్టని స్థితికి చేరిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఇది విపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమే కాదు. ప్రభుత్వం కూడా అదే చెపుతోంది. అయితే, అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, అంటోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నా చేసిన అప్పులు సక్రమగా రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తమ ఎనిమిదేళ్ళ పాలనలో సంపద వృద్ధి జరిగిందని, వివరణ ఇస్తోంది. అన్నిటినీ మించి కాళేశ్వరం ప్రాజెక్టును పెద్ద అసెట్ గా చూపిస్తోంది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను దాటి, అప్పులు చేయడం లేదని వివరణ ఇస్తోంది. అలాగే,  తెచ్చిన అప్పులు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నామని ప్రభుత్వం అప్పుల గురించి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తోంది. మొన్నీమధ్య ముచ్చటగా మూడు రోజులు జరిగిన రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర అర్థిక  పరిస్థితి, అప్పుల పరిస్థితికి సంబంధించి ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ పక్ష నేత, బట్టి విక్రమార్క ఒక్క ముక్కలో తేల్చి వేసిన విధంగా, ఆర్థిక మంత్రి, ప్రపంచ దేశాలు అన్నీ చుట్టి వచ్చారు, కానీ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం పై మరో నాలుగు రాళ్లువేసి చేతులు కడుక్కున్నారు. అదలా ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్త పరుస్తోంది,  ప్రతిపక్షాలు మాత్రమే,  కాదు, కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక రంగ నిపుణులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఓ వంక ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మరోవంక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం మెగా ప్రాజెక్టు వలన, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్  కుబేరుడయ్యారే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల్లో ప్రాజెక్ట్  బండారం బయట పడింది. మోటార్లు మునిగిపోయాయి. అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరినీ, ఆ దిక్కుకు వెళ్లనీయడం లేదు.  ప్రాజెక్ట్ పరిశీలనకు, ప్రతిపక్ష పార్టీలను  కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు. కాదని వెళితే అరెస్టులు చేసి వెనక్కి పంపుతోంది.   మరో వంక, పెండింగ్ బిల్లిలు పాపంలా పెరిగిపోతున్నాయని ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఇక మావల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రూ. 800 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ తో ఆందోళన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం అన్ని ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ పనులను నిలిపివేసింది. నిజానికి, ఒక జీహెచ్ఎంసీలోనే కాదు. స్కూల్ పిల్లలకు మధ్యాన్న భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్లు మొదలు చిన్న కాంట్రాక్టర్లు అందరి పరిస్థితి ఇదే అనే ఆరోపణలున్నాయి. మరోవంక కేంద్ర ప్రభుత్వం కట్టడితో అప్పులు పుట్టే పరిస్థతి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత ఆదాయ దారులు మూసుకు పోతున్నాయి. లిక్కర్, రిజిస్ట్రేషన్, మైనింగ్ తప్ప ఆదాయం వచ్చే మార్గాలు కనబడటం లేదు. అలాగే, అవినీతి, అక్రమాలకు సంబందించిన ఆరోపణలు ముఖ్యమంత్రి కుటుంబాన్ని చుట్టుముడు తున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్తు ఉచ్చు బిగుస్తున్నట్లు వార్త లొస్తున్నాయి.  ఒక విధంగా తెలంగాణ  ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న విధంగా తయారైందని, అంటున్నారు.ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక గండం నుంచి బయట పడేందుకు భూముల అమ్మకానికి తెరతీసిందని అంటున్నారు. అందుకోసమే 111 జీవోను ఎత్తి వేసింది. అయితే, దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో..వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయిందని అంటున్నారు. రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం స్టే విధించింది. దీంతో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, చిన్న మధ్య తరహ పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్ పేట లో భారీగా భూములను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 2,849 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈమూడు పారిశ్రామిక వాడల్లోని భూముల అమ్మకం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మరో ఐదారు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.నిజానికి ఇప్పటికే ప్రభుత్వం కోకాపేట సహా మరి కొన్ని ప్రాంతాలలో రెండు మూడు  విడతల్లో భూములను విక్రయించింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన తెరాస నాయకులు, ఇప్పుడు అదే పని చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.

మీకు మించిన వెన్నుపోటుదారులెవ‌రు?...నారా లోకేష్‌

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై హీట్ కొనసాగుతోంది. పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్  ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లింగ్‌ను షేర్ చూస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌ను ప్రథమ ముద్దా యిని చేసింది స్వయంగా ఆయన కుమారుడేనని తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పోస్ట్‌తో దుమారం మరింత రేగింది. బాలయ్య కాస్త ఘాటుగా స్పందిం చడంతో మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఎన్టీఆర్‌ వెన్నుపోటుపై దారిమ‌ళ్లింది. బాల కృష్ణను టార్గెట్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తోంది. అంతేకాదు చంద్రబాబు గతంలో ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని కొందరు పోస్టర్ల రూపంలో వైరల్ చేస్తున్నారు.  ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌పై టార్గెట్ చేయడంతో టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. పాత వీడియోలను తెరపైకి తెచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ వెన్నుపోటు విమర్శలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఇది నిజమైన వెన్నుపోటు అంటూ మండిపడ్డారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి రాజశేఖరరెడ్డి ఆయన మంత్రివర్గం కలిసి చేసిన తప్పిది.. నాకేంటి సంబంధం’ అని అప్పట్లో జగన్ అన్నారని ఉండవల్లి ఆ వీడియోలో పేర్కొన్నారు.  ఉండవల్లి అప్పట్లో మాట్లాడిన వీడియో క్లిప్‌ ను షేర్ చేసి నారా లోకేష్..పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధా రాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్‌ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డేన‌ని నారా లోకేష్ ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు. 

మై డాడ్ ఈజ్ గ్రేట్‌!

పిల్ల‌ల పెంప‌కం అనేస‌రికి త‌ల్లి పాత్రే కీల‌కం అంటూంటారు. తండ్రి గ‌మ‌నిస్తుంటాడ‌న్న‌ది  అంద‌రి అభి ప్రాయం. కానీ తండ్రీ ఆ పిల్ల‌డికి త‌ల్లితో స‌మానంగా అంతే ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. కానీ అది అంత‌గా ప్ర‌చారం కాదు. కావ‌డం తండ్రికీ పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. ఇది దాదాపు అంద‌రికీ అనుభ‌వైక‌మే. పిల్ల‌లు న‌డ‌క నేర్చేవ‌ర‌కూ త‌ల్లి లానే పిల్లడిని ఆడించ‌డానికి తండ్రీ అంతే స్థాయిలో అన్ని స‌దుపా యాల ఏర్పా ట్ల‌లో  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌లూ తీసుకుంటాడు.  పిల్ల‌డు జీవితంలో పైకి ఎద‌గాల‌ని తండ్రి ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటాడు. అందుకు త‌గిన స‌హాయ స‌హ కారాలు చివ‌రంటా అందిస్తూనే ఉంటాడు. ఎవ‌రికి ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ త‌ల్లి సేవ‌కే అధిక ప్రాధా న్యత‌, అత్య‌ధిక ప్ర‌చారం ల‌భిస్తుంటాయి. అదే చిత్రం!  ఓ తండ్రి పిల్ల‌డిని ఆడించ‌డానికి,  వాడికి బువ్వ తినిపిస్తూ ఆడిపించేందుకు కొత్త ఆట‌ను క‌నుగొన్నాడు. ప్లే హౌస్ త‌యారుచేశాడు. పిల్ల‌ల్ని ఆడించ‌డానికి ప్లేస్కూల్లో ప‌డేయ‌డం కాకుండా ఇలాంటి ఆలోచ‌న చేయ‌డం త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను పంచ‌డ‌మే అవుతుంది. ఇంట్లో ఆట‌బొమ్మ‌ల‌తో ఆడించ‌డ‌మే కాకుండా ఇలా కొత్త‌గానూ ఆట‌పాటల్లో వారితో ఆనందం పంచుకోవ‌చ్చు.  అన్న‌ట్టు పైకి కింద‌కీ ఆడించ‌డానికి ఎలివేట‌ర్ కూడా ఏర్పాటు చేశాడు. పిల్ల‌డిని అందులో నిల‌బెట్టి లేదా కూర్చోబెట్టి ఎలివేట‌ర్ తాడు ప‌ట్టుకుని మెల్ల‌గా లాగుతూంటే ఉయ్యాల్లాంటి తొట్టి పైకి లేదా కింద‌కీ దిగు తూంటుంది. పిల్ల‌డికి మ‌హా మ‌జా, గొప్ప స‌ర‌దా! కానీ ఇది బాగా అల‌వాటు చేసినా ఇబ్బందే.. పిల్ల‌లు గ‌దా.. అక్క‌డే తినిపించ‌మ‌ని, ఆడించ‌మ‌నీ మారాం చేసినా చేయొచ్చు. మ‌రి మీ ఓపిక‌! కాస్త పెద్ద‌యితే ఈ ప్ర‌యోగం ఎలా చేస్తున్న‌దీ తండ్రి చెప్ప‌డంలో ఏకంగా పిల్లాడికి ఫిజిక్స్ నేర్పేస్తాడేమో అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఇప్ప‌టికే ఉత్సాహంగా కామెంట్లు పెట్టేశారు! ఏమో అదీ జ‌ర‌గ‌వ‌చ్చు.. ఇలాంటి  ప్రేమ‌గ‌ల తండ్రి ఉంటే!.. అంటూ ఒక మ‌హిళ కామెంట్ పెట్టింది!  పిల్ల‌డు ఆడుతూ, దాని మీద చేత్తో కొడుతూ ఆనందిస్తున్నాడు.. మా డాడ్ ఈజ్ గ్రేట్ అనేమో!

చిక్కుల్లో లాలూ , తేజస్వి

ఐఆర్‌సిటిసి హోట‌ల్‌ కుంభ‌కోణం లో ట్రయల్ కోర్టులో నిందితులపై అభియోగాల రూపకల్పనపై వాద నలు ప్రారంభించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కి హైకోర్టు అనుమతినిచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్,  ఇతరులపై 2018 జూలైలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసు కుంది. కానీ అభియోగాల రూపకల్పనపై చర్చ ప్రారంభం కాలేదు. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరియు ఇతర 11 మంది నిందితులకు సంబంధించిన ఐఆర్‌సిటిసి హోటల్ కుంభకోణంలో విచారణ నుండి ఢిల్లీ హైకోర్టు వర్చువల్ స్టేను ఉపసంహరించుకుంది. ట్రయల్ కోర్టులో నిందితులపై అభియో గాల రూపకల్పనపై వాదనలు ప్రారంభించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి హైకోర్టు అనుమతినిచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ మరియు ఇతరులపై 2018 జూలైలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కానీ అభియోగాల రూపకల్పనపై చర్చ ప్రారం భం కాలేదు. ఫిబ్రవరి 2019లో, చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనే ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక నిందితుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నిందితుడు వినోద్ కుమార్ అస్థానాకు ట్రయల్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపునిచ్చింది. మరో ఇద్దరు నిందితులు కూడా ట్రయల్ కోర్టులో ఇదే విధమైన దరఖాస్తులను దాఖలు చేశారు. ఈ పరిణామా లు విచారణను నిలిపివేసాయి మరియు ఇప్పటి వరకు అభియోగాల రూపకల్పనపై చర్చ జరగలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ , ఇతరులపై 2017 జూలైలో సీబీఐ కేసు నమోదయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడాదిపాటు విచారణ తర్వాత ఏజెన్సీ ఏప్రిల్ 2018లో తన ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 2019 ఆదేశాన్ని అనుసరించి, మార్చి 2020లో అస్థానా  అభ్యర్థనకు ప్రతిస్పందనగా సీబీఐ స్టేటస్ రిపోర్టును దాఖలు చేసింది. జూలై 2018లో నిందితుల్లో ఒకరిపై ప్రాసిక్యూషన్ మంజూరు చేయాలని కోరినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొంది. అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌తో పాటు మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ దొరికిపోయారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలో అతను సర్వీసులో లేనందున, అవినీతి నిరోధక చట్టం, 1988లోని నిబంధనల ప్రకారం అతనిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదు. సీబీఐ నివేదికలో రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ మరియు ఇతర నిందితులకు సంబంధించి, వారిని ప్రాసి క్యూట్ చేయడానికి ఆంక్షలు అవసరం లేదని భావించారు. నిందితులపై ప్రాసిక్యూషన్‌ అనుమతి అవ సరం లేదన్న తన వైఖరికి మద్దతుగా మార్చి 2020లో అటార్నీ జనరల్‌ను సీబీఐ కోరింది. ఆమోదం పొందాల్సిన అవసరం లేదని ఏజెన్సీ తెలిపింది. అయినప్పటికీ, విచారణలో జాప్యాన్ని నివారించడానికి ఆస్థానా మరియు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రాసిక్యూషన్‌ను జూన్ 2020 లో కాంపిటెంట్ అథారిటీ ఆమోదించింది.

తిరుగుబాటా..ఫిక్స్‌డ్ మ్యాచ్‌?!

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన వారసుడిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన శాసనసభా పక్ష సమావేశాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విధేయులైన ఎమ్మెల్యేలు బహిష్కరించడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ప్రశ్నార్థకంగా మారింది.  పార్టీ విధేయుడి నేతృత్వంలో జరిగిన అనూహ్య సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది, కాంగ్రెస్ వర్గాల్లోని ప్రజలు రెండు అవకాశాల గురించి చర్చించుకుంటున్నారు. ఇది ముఖ్యమంత్రి పదవి లో ఉండగానే తన వారసుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్న నాయకత్వం ద్వారా అవమానకరమైన వ్యక్తి  తిరుగుబాటు అని, లేదా అదంతా ఒక "ఫిక్స్‌డ్ మ్యాచ్" అని, అతని స్థానంలో దూకుడుగా ఉన్న సచిన్ పైలట్‌ను సంస్థలో పరిమిత ఆమోదయోగ్యతను స్ప‌ష్టంగా పేర్కొన‌ డం ద్వారా అతని స్థానంలోకి తేవ‌డానికి రూపొందించింది. సచిన్ పైలట్‌ను అడ్డుకునే ప్రయత్నంలో అశోక్ గెహ్లాట్ క్యాంపు ఎమ్మెల్యే లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన శాసనసభ్యులు,  మంత్రులు ఆదివారం అర్థరాత్రి సిఎల్‌పి సమావేశానికి ముందు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అసెంబ్లీ స్పీకర్ నివాసానికి  క్యూ క‌ట్టారు, కాంగ్రెస్ హైకమాండ్  సచిన్  పైలట్‌ను చీఫ్‌గా ఎంపిక చేయకుండా ముందస్తుగా కోరింది. రాష్ట్ర అత్యున్నత పదవికి తన వారసుడిని ఎన్నుకోవడంపై శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవ డానికి జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సిఎల్‌పి) సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ "కొత్త తరానికి" అవకాశం కల్పించాలని అన్నారు. పైలట్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఎంచుకోవచ్చనే ఆందోళనల మధ్య దాదాపు మొత్తం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడం, గెహ్లాట్ స్వతంత్ర మార్గాన్ని కొట్టేశారని సూచిస్తుంది. ఇది ఢిల్లీకి వెళ్లడానికి అతని సుముఖతతో పాటు గాంధీలలో అతని ఆమోదయోగ్యత ప్రశ్నార్థకమయ్యే విపరీతమైన పరిస్థితిని సృష్టిస్తుంది. సెప్టెంబర్ 28 లేదా 29న పార్టీ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ నామి నేషన్ దాఖ లు చేసే అవకాశం ఉంది. అది ఇప్పుడు జరుగుతుందో లేదో చూడాలి. సోనియా గాంధీ స్థానంలో పార్టీ అధినేత్రిగా గెహ్లాట్ అంతర్గత ఎన్నికలలో పోటీ చేస్తే, తిరుగుబాటు అని పిలవబడేది వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య "ఫిక్స్డ్ మ్యాచ్" అనే సందేశం ఉంటుం దని చాలామంది భావిస్తున్నారు. రాజస్థాన్‌లో పార్టీని నడిపించడానికి ఆమోదయోగ్యం, చేయి దాటి పోయిన బహిరంగ లాబీయింగ్‌ను అంతం చేయడం. గెహ్లాట్ వెనక్కి తగ్గితే, అది నిజమైన తిరుగుబాటుగా పరిగణించబడుతుంది, దీని ద్వారా రాష్ట్ర నాయక త్వం ఇప్పటికే బలహీనంగా ఉన్న హైకమాండ్ నుండి వాస్తవంగా విడిపోయింది. దాని రిట్‌ను అంగీకరిం చ డానికి నిరాకరించింది. అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు గెహ్లాట్‌కు విధేయత చూపడం మరియు 2020 మధ్యలో పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి  అని పైలట్‌ను దూషించడం రాష్ట్ర యూనిట్,  కేంద్ర నాయకత్వ ఆలోచనలో తీవ్రమైన వైరుధ్యాన్ని బహిర్గతం చేస్తుంది.