బీజేపీ వారి అంతులేని స్వామిభక్తి
posted on Sep 22, 2022 @ 10:28AM
తెరమీద చిరు స్టెప్పులేస్తుంటే కుర్రాళ్లు టిక్కెట్లుతో పాటు నోట్లు కూడా చింపి హాల్లో డాన్సులు వేయడం వీరాభిమానానికి పరాకాష్ట. తమ నాయకుడి ఆరోగ్యం బాగుపడాలని చాలాకాలం క్రితం కేరళ ఉంచి తిరు పతికి ఒక వ్యక్తి సైకిల్ యాత్ర చేశాడు..అదీ వీరాభిమానమే. కానీ రక్తదానం ఇవ్వడం, మరీ ఆవేశం ఎక్కువైతే అమితాబ్ బచ్చన్ కోసం ప్రాణత్యాగం చేయడం వంటివీ విన్నాం. కానీ బీజేపీ వారి స్వామి భక్తి అంతంకు ఎన్ని రెట్లయినా ఎక్కువే!
ప్రధాని వస్తున్నారంటే దారంతా పూలదారి చేయడం గురించి విన్నాం, నాయకుని పుట్టినరోజున ఊరంతా స్వీట్లుపంచి గుళ్లలో పూజలు చేయించడం, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా హోమం చేయించిన వీరాభిమానులూ ఉన్నారు. కానీ వీరాభిమానం వీరావేశంలో వేళ్లు కోసుకోవడం, బావిలో దూకడం, డ్యామ్‌ల మీంచి దూకడం, ఓడితే ఉరేసుకుంటామనడం.. ఇలాంటి విపరీత మానసిక పరిస్థితుల్లో అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులు చాలా ఎక్కువే వీరాభిమానం ప్రకటిస్తూన్నారు. దీనికి అంతూ పొంతూ లేదు.
అక్కడితో ఆగిపోలేదు.. బీజేపీ వారి వీరాభిమానం మరీ నాలుగు ఆకులు ఎక్కువే! ఉత్తరప్రదేశ్‌లో రాకేష్ సచిన్ అనే ఒక మంత్రి ఏకంగా ప్రధాని మోదీజీ పట్ల స్వామిభక్తి ఊహించనివిధంగా ప్రకటించారు. అది ఒక్కడే కాదు, కొంతమందితో కలిసి చేసింది. మోదీజీ పుట్టినరోజున ఆయనకు స్వామిభక్తి ప్రకటించ డంలో శుభాకాంక్షలు పంపించవచ్చు, వీలైతే స్వీట్లు, శాలువలు ఫ్లయిట్‌లోనూ పంపగలడు. కానీ ఈ మహాను భావుడు ఏకంగా పూజ చేసాడు. ఎవరికి ప్రధానికే. ఆయన ఫాలోయర్లతో కలిసి స్వీట్లు పంచుకోవ డంతోపాటు ప్రధాని ఫోలోకి పూలదండలు వేసి మరీ ఆ స్వామి భక్తికి పరాకాష్ట తెలియజేశాడు.
సుబ్భ రంగా బతికున్న మనిషి ఫోటోకి పూలమాల వేసి మరీ శుభాకాంక్షలు చెప్పడం ఏమిటని కనీసం అక్కడున్న వారిలో ఏ ఒక్కరికీ అనుమానం తట్టలేదు. దాన్ని వీడియో చేసి మరీ నెటిజన్లకు చూపారు. అందరూ తిట్టేరు.. మీకిదేం బుద్ధని. మరి మంత్రిగారి నిర్వాకం గనుక, అక్కడే ఉన్నవారు గట్టిగా ఏమీ అనలేకపోయా రు. మంత్రిగారికి ఆ మాత్రం చిన్నవిషయం తెలీకుండా ఎలా ఉంది? అనేది నెటిజన్ల ప్రశ్న. దీన్ని స్వామి భక్తి అనాలా, పిచ్చ అనాలో బీజేపీ వారే తేల్చుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.