ఆటను ఆటగా చూడలేరా?
posted on Sep 21, 2022 @ 2:30PM
క్రికెట్ అనగానే అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటీకి సమానంగా చూసేది భారత్, పాకి స్తాన్ పోటీలే. ఏ టోర్నీ అయినా, వేదిక ఏదయినాసరే ఇంగ్లండ్, ఆసీస్‌ల మధ్య మ్యాచ్‌లకి ఉండే అత్యం త ప్రాధాన్యత భారత్, పాక్ మ్యాచ్‌లకీ ఉండడం విశేషం. అలాగే ప్లేయర్లన్నా వీరాభిమానుల మధ్య పెద్దగా తేడా ఉండదు. సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మను మనం ఎంతగా అభిమానిస్తామో అటు పాకిస్తాన్ లోనూ అంతే అభిమానిస్తారు. అదేవిధంగా మనదేశంలోనూ అబ్దుల్ రజాక్, వసీం అక్రమ్‌ను అభిమా నించినట్టే బాబర్ అజామ్, రషీద్, రిజ్వాన్‌లను అంతే స్థాయిలో అభిమానిస్తున్నారు.
కాబోతే మ్యాచ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరి దేశం జట్టు వారు గెలవాలనే కోరుకుంటారు. ఓడినా ఈజీగా తీసుకోలేకపోవడమే అభిమానుల మధ్య విద్రోహపు ఆలోచనలకు దారితీస్తోంది. అదే మళ్లీ బయట పడింది. ఆసియాకప్ జరిగి చాలారోజులయింది. చిత్రమే మంటే తొలిమ్యాచ్‌లో భారత్‌చేతిలో పాకిస్తాన్ ఓటమి తాలూకు ప్రభావం ఇంకా పోలేదు. పాక్ వీరాభిమా నులు లండన్‌లో విపరీత ధోరణిలో వ్యవహ రిస్తున్నారు.
భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆయా జట్ల అభిమానుల్లో ఉత్కంఠ, ఉద్వేగం పీక్స్ కి వెళ్లి పో తుంది. ఇప్పుడు గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్- పాక్ ల మధ్య జరి గిన మ్యాచ్ లండన్ లో హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను తార స్థాయికి చేర్చింది. మ్యాచ్ జరిగి రోజు లు గడిచిపోతున్నా.. ఆ ఉద్రిక్తతలు సడలడం లేదు.తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో న హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లీసెస్టర్ అల్లర్ల కు సంబంధించి ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయ కులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లీసెస్టర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయకులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.